Astrology: కీలక గ్రహాల అనుకూలత.. అనారోగ్య సమస్యల నుంచి ఆ రాశుల వారికి విముక్తి..!

| Edited By: Janardhan Veluru

Nov 05, 2024 | 4:01 PM

Health Astrology: ప్రస్తుత గ్రహ సంచారాన్ని బట్టి కొన్ని అనుకూల గ్రహాల కారణంగా ఏడాది చివరి లోగా కొన్ని రాశులకు అనారోగ్య సమస్యల నుంచి విముక్తి లభించే అవకాశం ఉంది. వ్యయ స్థానాన్ని బట్టి, వ్యయంలో ఉన్న గ్రహాన్ని బట్టి, గురు గ్రహాన్ని బట్టి వ్యాధి నివారణ గురించి చెప్పవలసి ఉంటుంది. కొన్ని దీర్ఘకాలిక అనారోగ్యాలు, మొండి వ్యాధులు, చికిత్సలను కూడా గ్రహాల స్థితిగతులను బట్టి పరిశీలించడం జరుగుతుంది.

Astrology: కీలక గ్రహాల అనుకూలత.. అనారోగ్య సమస్యల నుంచి ఆ రాశుల వారికి విముక్తి..!
Health Astrology
Follow us on

ప్రస్తుత గ్రహ సంచారాన్ని బట్టి కొన్ని అనుకూల గ్రహాల కారణంగా ఏడాది చివరి లోగా కొన్ని రాశుల వారికి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి విముక్తి లభించే అవకాశం ఉంది. వ్యయ స్థానాన్ని బట్టి, వ్యయంలో ఉన్న గ్రహాన్ని బట్టి, గురు గ్రహాన్ని బట్టి వ్యాధి నివారణ గురించి చెప్పవలసి ఉంటుంది. కొన్ని దీర్ఘకాలిక అనారోగ్యాలు, మొండి వ్యాధులు, చికిత్సలను కూడా గ్రహాల స్థితిగతులను బట్టి పరిశీలించడం జరుగుతుంది. మేషం, మిథునం, సింహం, తుల, ధనుస్సు, మీన రాశులకు దీర్ఘకాలిక అనారోగ్యాలు, మొండి వ్యాధుల నుంచి రెండు నెలల్లో విముక్తి లభించే అవకాశం ఉంది.

  1. మేషం: స్వభావరీత్యా ఈ రాశి వారికి మైగ్రేన్, శిరోబాధలు, బీపీ వంటివి ఎక్కువగా బాధించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ రాశికి వ్యయ స్థానంలో రాహువు సంచారం చేస్తున్నందువల్ల, గురువు కూడా బాగా అనుకూలంగా ఉన్నందువల్ల అనుకోకుండా మెరుగైన చికిత్స లభించడం, త్వరితగతిన అనారోగ్య సమస్యల నుంచి బయటపడడం వంటివి జరిగే అవకాశం ఉంది. ఈ రాశివారికి సంప్రదాయ వైద్య విధానాలు ఉపయోగపడతాయి. తరచూ స్కంద స్తోత్రం పఠించడం మంచిది.
  2. మిథునం: ఈ రాశివారిని సాధారణంగా గొంతు సంబంధమైన బాధలు, వ్యసనాలు, కేన్సర్ వంటి వ్యాధులు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం వ్యయ స్థానంలో గురు గ్రహ సంచారం వల్ల వీరు ఈ సమ స్యల నుంచి తప్పకుండా బయటపడే అవకాశం ఉంటుంది. సంప్రదాయ వైద్య విధానాలకు ప్రాధా న్యం ఇవ్వడం మంచిది. ఈ నెల 15 తర్వాత అనుకోకుండా అత్యుత్తమ చికిత్స లభించే అవకాశం ఉంది. ఆరోగ్యం అనుకూలంగా మారుతుంది. ఈ రాశివారు వినాయకుడిని ప్రార్థించడం మంచిది.
  3. సింహం: ఈ రాశివారికి సాధారణంగా ఊపిరితిత్తుల సమస్యలు, శ్వాసకోశ సమస్యలు, గుండె సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. వ్యయ స్థానంలో ప్రస్తుతం కుజుడు సంచారం చేస్తున్నందువల్ల ఇంగ్లీష్ వైద్య విధానం ద్వారా అనారోగ్యాల నుంచి కోలుకునే అవకాశం ఉంది. కొద్దిగా శస్త్ర చికిత్సలకు కూడా అవకాశం ఉంటుంది. ఆహార, విహారాల్లో వీలైనంతగా జాగ్రత్తలు పాటించడం చాలా మంచిది. రెండు నెలల్లో వీరికి తప్పకుండా ఉపశమనం లభిస్తుంది. రోజూ ఆదిత్య హృదయం చదవడం అవసరం.
  4. తుల: ఈ రాశివారికి సాధారణంగా జీర్ణకోశ సమస్యలు, రక్త హీనత, రక్తపోటు, మధుమేహం, వ్యసనాలు వంటి సమస్యలు పీడించే అవకాశం ఉంటుంది. ఎటువంటి అనారోగ్య సమస్య ఉన్నప్పటికీ ఈ రాశి వారు ఇంగ్లీష్ వైద్య విధానం ద్వారా దీని నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. ఈ రాశికి కేతువు వ్యయ స్థానంలో ఉన్నందువల్ల అనుకోకుండా అనారోగ్యాలు నయమయ్యే సూచనలున్నాయి. ఆహార, విహారాల్లో జాగ్రత్తలు పాటించడంతోపాటు, సుబ్రహ్మణ్యాష్టకాన్ని పఠించడం మంచిది.
  5. ధనుస్సు: ఈ రాశివారికి సాధారణంగా కీళ్ల నొప్పులు, చర్మ వ్యాధులు, రక్త సంబంధమైన సమస్యలతో పాటు మధుమేహం వంటి సమస్యలు కూడా బాధించే అవకాశం ఉంది. ఈ రాశికి ప్రస్తుతం బుధుడు వ్యయ స్థానంలో ఉన్నందువల్ల త్వరలో అనారోగ్యాల నుంచి ఉపశమనం లభిస్తుంది. సాధారణంగా సంప్రదాయ వైద్య విధానాల ద్వారా కోలుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆహార సంబంధమైన క్రమశిక్షణను తప్పకుండా పాటించాల్సి ఉంటుంది. తరచూ గణపతి స్తోత్రం చదవాల్సిన అవసరం ఉంది.
  6. మీనం: ఈ రాశివారికి సాధారణంగా కాళ్ల నొప్పులు, ఎముకల సమస్యలు, రక్త సమస్యలు, నిస్సత్తువ వంటివి పీడించే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం శనీశ్వరుడు వ్యయ స్థానంలో సంచారం చేయ డంతో పాటు గురువు వక్రించినందువల్ల వీరికి తప్పకుండా వీటి నుంచి విముక్తి లభించే అవకాశం ఉంది. సంప్రదాయ వైద్య విధానాల ద్వారా కోలుకునే అవకాశం ఉంటుంది. వ్యసనాల జోలికి వెళ్లకపోవడం మంచిది. నరసింహ స్వామిని లేదా ఆంజనేయ స్వామిని పూజించడం ఉత్తమం.