Guru Vakri: వక్ర గురువుతో వారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్త..! పరిహారాలు ఏంటో తెలుసుకోండి

| Edited By: Janardhan Veluru

Oct 09, 2024 | 6:55 PM

ఈ నెల 10వ తేదీ ఉదయం నుంచి ఫిబ్రవరి 5 వరకూ, అంటే సుమారు 120 రోజుల పాటు గురువు వృషభ రాశిలో వక్రించడం జరుగుతోంది. ధనానికి, సంతానానికి కారకుడైన గురువు వక్రిస్తున్నందువల్ల ఆదాయం ఇబ్బడి ముబ్బడిగా పెరిగే అవకాశం ఉన్నా ఆర్థిక విషయాల్లో తప్పటడుగులు వేసే అవకాశం కూడా ఉంటుంది. పురోగతి చెందుతున్న పిల్లలు కూడా తిరోగమనం చెందే అవకాశం ఉంటుంది.

Guru Vakri: వక్ర గురువుతో వారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్త..! పరిహారాలు ఏంటో తెలుసుకోండి
Money Photo
Follow us on

ఈ నెల 10వ తేదీ ఉదయం నుంచి ఫిబ్రవరి 5 వరకూ, అంటే సుమారు 120 రోజుల పాటు గురువు వృషభ రాశిలో వక్రించడం జరుగుతోంది. ధనానికి, సంతానానికి కారకుడైన గురువు వక్రిస్తున్నందువల్ల ఆదాయం ఇబ్బడి ముబ్బడిగా పెరిగే అవకాశం ఉన్నా ఆర్థిక విషయాల్లో తప్పటడుగులు వేసే అవకాశం కూడా ఉంటుంది. పురోగతి చెందుతున్న పిల్లలు కూడా తిరోగమనం చెందే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మేషం, వృషభం, కర్కాటకం, కన్య, వృశ్చికం, మకర రాశులకు ఇది వర్తిస్తుంది. గురువు వంటి శుభ గ్రహం వక్రించినప్పుడు వీలైనంత అప్రమత్తంగా ఉండడం మంచిది. సుందరకాండ పారాయణం, దత్తాత్రేయ స్తోత్ర పఠనం, మంత్ర జపం వంటి వాటి వల్ల చెడు ఫలితాలు బాగా తగ్గడానికి అవకాశం ఉంటుంది.

  1. మేషం: ఈ రాశికి భాగ్యాధిపతిగా గురువు ధన స్థానంలో సంచారం చేయడం వల్ల ఆదాయం దిన దినాభి వృద్ధి చెందే అవకాశం ఉంటుంది. కానీ, ఆర్థిక వ్యవహారాల్లో తప్పటడుగులు వేసే ప్రమాదం కూడా ఉంటుంది. ఆర్థిక విషయాల్లో అత్యంత సన్నిహితులను సైతం గుడ్డిగా నమ్మకపోవడం మంచిది. ఆర్థిక లావాదేవీలకు కూడా దూరంగా ఉండడం మంచిది. డబ్బు ఇచ్చినా, తీసుకున్నా ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు లాభాలపరంగా కాస్తంత మందకొడిగా సాగుతాయి.
  2. వృషభం: ఈ రాశిలో సంచారం చేస్తున్న లాభాధిపతి గురువు వక్రిస్తున్న కారణంగా ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ, మిత్రుల వల్ల, ఆర్థిక లావాదేవీల వల్ల నష్టపోయే అవకాశం ఉంటుంది. ఆర్థిక వ్యవహారాల్లో కొందరు నమ్మించి మోసగించే అవకాశం ఉంది. ఎటువంటి ఒప్పందాల మీదా సంతకాలు చేయకపోవడం మంచిది. ఇల్లు కొనుగోలు విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. వ్యాపారాల్లో భాగస్వాముల నుంచి ఇబ్బందులు తలెత్తుతాయి.
  3. కర్కాటకం: ఈ రాశికి భాగ్యాధిపతి అయిన గురువు లాభ స్థానంలో సంచారం చేయడం వల్ల ఇబ్బడి ముబ్బ డిగా ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది. అనేక వైపుల నుంచి ఆదాయం వృద్ధి చెందుతుంది. అయితే, గురువు వక్రగతి వల్ల మిత్రుల మీదా, విలాసాల మీద ఖర్చులు బాగా పెరుగుతాయి. కొందరు మిత్రుల వల్ల నష్టపోయే అవకాశం కూడా ఉంది. ఎవరికీ డబ్బు ఇవ్వకపోవడం మంచిది. రావలసిన డబ్బు చేతికి అందని పరిస్థితి ఏర్పడుతుంది. ఆర్థిక లావాదేవీలు ఇబ్బంది కలిగిస్తాయి.
  4. కన్య: ఈ రాశికి సప్తమ, చతుర్ధాధిపతి అయిన గురువు భాగ్య స్థానంలో సంచారం చేయడం వల్ల అనేక మార్గాల్లో ఆదాయం పెరగడం, గృహ, వాహన సౌకర్యాలను అమర్చుకోవడం జరుగుతుంది. కానీ, ఆస్తి వివాదాలు పరిష్కారం కాక, ఆస్తులు విలువ పెరగక ఇబ్బంది పడతారు. గృహ నిర్మాణం పనులకు ప్రతిబంధకాలు ఏర్పడతాయి. పిల్లల చదువుల మీద బాగా శ్రద్ధ పెట్టాల్సి వస్తుంది. కుటుంబ సభ్యుల నుంచి ఇబ్బందులు తలెత్తుతాయి. రావలసిన డబ్బు ఒక పట్టాన చేతికి అందదు.
  5. వృశ్చికం: ఈ రాశికి ధన, పంచమాధిపతి అయిన గురువు సప్తమంలో సంచారం చేయడం వల్ల ఆదాయం దిన దినాభివృద్ధి చెందుతుంది. అనేక విధాలుగా సంపద పెరుగుతుంది. మనసులోని కోరికలు చాలావరకు నెరవేరుతాయి. పిల్లలు వృద్ధిలోకి రావడం ప్రారంభిస్తారు. అయితే, గురువు వక్రించడం వల్ల ఆర్థిక వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం, ప్రతివారినీ గుడ్డిగా నమ్మడం వంటివి జరుగుతాయి. పిల్లల విషయంలో శ్రద్ద పెంచాల్సి వస్తుంది. ఆదాయ ప్రయత్నాలు మందగిస్తాయి.
  6. మకరం: ఈ రాశికి అత్యంత శుభకరమైన పంచమ స్థానంలో తృతీయ స్థానాధిపతిగా గురువు సంచారం వల్ల ఆదాయం ఆశించిన స్థాయిలో పెరగడానికి, అదనపు ఆదాయ ప్రయత్నాలన్నీ సఫలం కావ డానికి అవకాశం ఉంటుంది. పిల్లలు వృద్ధిలోకి రావడం జరుగుతుంది. సంతాన యోగానికి అవ కాశం ఉంటుంది. అయితే, గురువు వక్ర గమనం వల్ల ఆదాయ ప్రయత్నాల్లో ఆటంకాలు ఏర్పడ తాయి. అనవసర ఖర్చులు, అనుకోని ఖర్చుల కారణంగా కష్టార్జితంలో చాలా భాగం వృథా అవుతుంది.