Gajkesari Rajyog 2025: 12 ఏళ్ల తర్వాత పితృ పక్షంలో గజకేసరి రాజయోగం.. ఈ రాశులకు స్వర్ణకాలం ప్రారంభం..

బాధ్రప్రద మాసం పౌర్ణమి రోజు నుంచి పితృ పక్షం ప్రారంభం కానుంది. పితృ పక్షంలో 12 సంవత్సరాల తరువాత శక్తివంతమైన గజకేసరి రాజయోగం ఏర్పడుతుంది. ఈ సమయంలో కొన్ని రాశుల అదృష్టం ప్రకాశిస్తుంది. సంపద, ఆస్తిలో అపారమైన పెరుగుదలకు అవకాశం ఉంది. వేద పంచాంగం ప్రకారం బృహస్పతి, చంద్రుల కలయిక కారణంగా గజకేసరి రాజయోగం ఏర్పడబోతోంది. ఈ యోగం కారణంగా 3 రాశుల వారికి మంచి రోజులు ప్రారంభమవుతాయి.

Gajkesari Rajyog 2025: 12 ఏళ్ల తర్వాత పితృ పక్షంలో గజకేసరి రాజయోగం.. ఈ రాశులకు స్వర్ణకాలం ప్రారంభం..
Gajkesari Rajyog 2025

Updated on: Sep 03, 2025 | 1:41 PM

వేద క్యాలెండర్ ప్రకారం ఈ సంవత్సరం పితృ పక్షం సెప్టెంబర్ 7 నుంచి ప్రారంభమై సెప్టెంబర్ 21న ముగుస్తుంది. సెప్టెంబర్ 14న చంద్రుడు మిథునరాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ మిథున రాశిలో అప్పటికే దేవ గురువు బృహస్పతి ఉన్నాడు. అటువంటి పరిస్థితిలో ఈ మిథున రాశిలో గురువు, చంద్రుల కలయిక జరిగి గజకేసరి రాజ్యయోగం ఏర్పడుతుంది. ఈ యోగం వలన కొన్ని రాశుల వారికి స్వర్ణకాలం ప్రారంభమవుతుంది. అలాగే ఈ రాశుల వారి వృత్తి, వ్యాపారం ప్రకాశిస్తుంది. ఈ అదృష్ట రాశులు ఏమిటో తెలుసుకోండి..

కన్యా రాశి:
కన్యారాశి వారికి గజకేసరి రాజయోగం ఏర్పడటం ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే ఈ రాజయోగం ఈ రాశి కుండలిలో వృత్తి, వ్యాపార స్థానంలో ఏర్పడబోతోంది. ఈ సమయంలో నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఈ రాశికి చెందిన రచన, బోధన లేదా మీడియాతో సంబంధం ఉన్న వ్యక్తులు ప్రత్యేక ప్రయోజనాలను పొందవచ్చు. అలాగే కొత్త ఉద్యోగ ఆఫర్ లేదా పదోన్నతి పొందవచ్చు. ప్రయాణాలు ప్రయోజనకరంగా ఉంటాయి. వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. వీరు పోటీదారుల కంటే ముందు ఉంటారు. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. దంపతుల జీవితంలో ప్రేమ పెరుగుతుంది. ఈ సమయంలో తండ్రితో మీ సంబంధం బలంగా ఉంటుంది.

సింహ రాశి:
గజకేసరి రాజయోగం ఏర్పడటం వలన ఈ రాశికి చెందిన వ్యక్తులకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే ఈ రాజయోగం ఈ రాశి వ్యక్తుల ఆదాయం, లాభ స్థానంలో ఏర్పడబోతోంది. అందువల్ల ఈ సమయంలో వీరి ఆదాయంలో అపారమైన పెరుగుదల ఉండవచ్చు. అలాగే కొత్త ఆదాయ వనరుల ద్వారా డబ్బు సంపాదించే అవకాశం ఉంది. అదే సమయంలో ఉద్యోగంలో పదోన్నతి లేదా కొత్త ప్రాజెక్టుల ప్రారంభం ఉండవచ్చు. విద్యార్థులు విదేశాలలో చదువుకోవాలని చేసే ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. వీరు కుటుంబ సభ్యులు, స్నేహితులతో మంచి సమయాన్ని గడుపుతారు. ఈ సమయంలో పెట్టుబడుల నుండి ప్రయోజనం పొందుతారు. అలాగే ఈ సమయంలో స్టాక్ మార్కెట్, బెట్టింగ్, లాటరీల ద్వారా లాభం పొందవచ్చు.

ఇవి కూడా చదవండి

వృషభ రాశి:
వృషభ రాశి వారికి గజకేసరి రాజయోగం ఏర్పడటం సానుకూలంగా ఉంటుంది. ఎందుకంటే ఈ రాజయోగం వీరి సంచార జాతకంలో రెండవ స్థానంలో ఏర్పడుతుంది. అందువల్ల ఈ సమయంలో అప్పుడప్పుడు ఆకస్మికంగా లాభాల అవకాశాన్ని పొందుతారు. అలాగే ఈ యోగా ప్రభావం వల్ల వృషభ రాశి వ్యక్తులు తమ ప్రసంగం మాటల ద్వారా ప్రయోజనాలను పొందవచ్చు. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. వివాహ జీవితంలో ప్రేమ పెరుగుతుంది. ప్రతి పనిని ఉత్సాహంగా చేస్తారు. అదే సమయంలో వ్యాపారవేత్తలు పెట్టుబడుల కోసం రుణం పొందనున్నారు.

 

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

(నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.)