రెండు ప్రత్యేక యోగాలు.. ఆ రాశులకు పట్టిందల్లా బంగారం..! కలలు సాకారం కాబోతున్నాయ్

Lucky Zodiac Signs: మే 28 నుండి జూన్ 2 వరకు చంద్రుడు గురు, కుజులతో కలిసి సంచారం చేయబోతున్నాడు. దీని కారణంగా గజకేసరి, చంద్రమంగళ యోగాలు ఏర్పడబోతున్నాయి. మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, కన్య, మీన రాశుల వారికి ఇది ఎంతో అనుకూలంగా ఉంటాయి. ఆర్థిక పురోగతి, ఉద్యోగ అవకాశాలు, ఆరోగ్యం మెరుగుపడటం వంటి అంశాలలో సుధారణ ఫలితాలు కలుగుతాయి. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం మంచిది.

రెండు ప్రత్యేక యోగాలు.. ఆ రాశులకు పట్టిందల్లా బంగారం..! కలలు సాకారం కాబోతున్నాయ్
Luckiest Zodiac Signs

Edited By:

Updated on: May 27, 2025 | 6:42 PM

కోరికలు, ఆశలు, ఆశయాలు, మానసిక ఆరోగ్యం, ప్రశాంతత వంటి అంశాలకు కారకుడైన చంద్రుడు ఈ నెల 28 నుంచి మూడు రోజుల పాటు గురువుతోనూ, మరో మూడు రోజుల పాటు కుజుడితోనూ కలిసి ఉండడం వల్ల కొన్ని రాశుల వారి ఆశలు, కోరికలు చాలావరకు నెరవేరబోతున్నాయి. ఈ ఆరు రోజుల్లో చేపట్టే ప్రయత్నాల ప్రభావం భవిష్యత్తు మీద కూడా ఉంటుంది. మే 28 నుంచి జూన్ 2 వరకు వీరు అనుకున్నవి అనుకున్నట్టు జరిగే అవకాశం ఉంది. సానుకూల దృక్పథంతో వ్యవహరించడం మంచిది. చంద్రుడు గురువుతో కలవడం వల్ల గజకేసరి యోగం, కుజుడితో కలవడం వల్ల చంద్ర మంగళ యోగం ఏర్పడతాయి. మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, కన్య, మీన రాశుల వారు ఈ రెండు మహా యోగాల వల్ల అత్యధికంగా ప్రయోజనాలు పొందుతారు.

  1. మేషం: ఈ రెండు యోగాల వల్ల ఈ రాశివారి ఆదాయ వృద్ధి ప్రయత్నాలు నూరు శాతం ఫలితాలనిస్తాయి. శ్రమ తక్కువ ఫలితం ఎక్కువ అన్నట్టుగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో పోటీదార్ల మీద పైచేయి సాధిస్తారు. ఉద్యోగంలో సహచరుల పోటీలను తట్టుకుని అందలాలు ఎక్కుతారు. జీతభత్యాలు బాగా పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. గౌరవ మర్యాదలు బాగా విస్తరిస్తాయి. షేర్లు, స్పెక్యులేషన్ల మీద పెట్టుబడులు పెంచడానికి ఇది బాగా అనుకూల సమయం.
  2. వృషభం: ఈ రెండు యోగాల వల్ల ఆర్థికంగా బాగా పురోగతి చెందుతారు. దాదాపు పట్టిందల్లా బంగారం అవుతుంది. కొద్ది ప్రయత్నంతో అత్యధికంగా లాభాలు కలుగుతాయి. ప్రయాణాల వల్ల లాభాలు కలుగుతాయి. మదుపులు చేయడం వల్ల, పెట్టుబడులు పెట్టడం వల్ల ఆదాయం బాగా పెరుగు తుంది. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారమవుతాయి. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి సంబంధం కుదురుతుంది. నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి.
  3. మిథునం: ఈ రాశిలో గజకేసరి యోగం, ధన స్థానంలో చంద్ర మంగళ యోగం ఏర్పడడం వల్ల ఈ రాశివారికి పట్టిందల్లా బంగారమయ్యే అవకాశం ఉంది. ఆకస్మిక ధన ప్రాప్తి సూచనలున్నాయి. రావలసిన సొమ్ము చేతికి అందుతుంది. ఆస్తి లాభం కలుగుతుంది. ఆస్తి వివాదం అనుకూలంగా పరిష్కారమై, భూ లాభం కూడా కలుగుతుంది. పిత్రార్జితం లభిస్తుంది. ఆస్తిపాస్తుల విలువ పెరుగుతుంది. ఉద్యోగంలో జీతాలు పెరగడం, వృత్తి, వ్యాపారాలు లాభాలు పెరగడం తప్పకుండా జరిగే అవకాశం ఉంది.
  4. కర్కాటకం: రాశినాథుడైన చంద్రుడు తనకు ప్రాణ స్నేహితులైన గురు, కుజులతో యుతి చెందడం వల్ల గజ కేసరి, చంద్ర మంగళ యోగ ఫలితాలను పూర్తి స్థాయిలో ఇవ్వడం జరుగుతుంది. వీటివల్ల శత్రు జయం, పదోన్నతులు, గౌరవ మర్యాదలు తప్పకుండా చోటు చేసుకుంటాయి. ఉద్యోగంలో అంద లాలు ఎక్కుతారు. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ పెరుగుతుంది. అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది. మనసులోని కోరికలు చాలావరకు నెరవేరుతాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి.
  5. కన్య: ఈ రెండు యోగాల వల్ల ఈ రాశివారి దశ తిరగబోతోంది. అనేక విధాలైన అదృష్టాలు కలుగు తాయి. ఉద్యోగంలో ఊహించని విధంగా ఉన్నత పదవులు లభిస్తాయి. ఒక సంస్థకు సర్వాధికారి అయ్యే అవకాశం కూడా ఉంది. సంపన్న కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది. నిరుద్యోగులకు కలలో కూడా ఊహించని ఆఫర్లు అందుతాయి. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. ఆదాయం ఇబ్బడిముబ్బడిగా వృద్ధి చెందుతుంది.
  6. మీనం: రాశ్యధిపతి గురువుతో చంద్రుడు కలవడం, ఈ రాశికి అత్యంత శుభుడైన కుజ, చంద్రులు కర్కా టక రాశిలో యుతి చెందడం వల్ల ఈ రాశివారు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఒక వెలుగు వెలిగే అవకాశం ఉంది. ఉద్యోగంలో పదోన్నతులు కలుగుతాయి. అంచనాలకు మించి జీతభత్యాలు పెరిగే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో రాబడి అంచనాల్ని మించుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీలతో సహా అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందుతుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది.