Zodiac Signs
కొన్ని పరిచయాలు, స్నేహాల వల్ల జీవితాలు మారిపోతాయి. మంచి స్నేహాలు కలగడం, మంచి స్నేహితులు దొరకడం నిజంగా అదృష్టం. జాతక చక్రంలో లాభ స్థానాన్ని బట్టి స్నేహాల గురించి, మిత్రుల గురించి చెప్పాల్సి ఉంటుంది. శుభ గ్రహాల అనుకూలత కారణంగా, ముఖ్యంగా 11వ స్థానాన్ని ప్రభావితం చేస్తున్న కారణంగా కొన్ని రాశుల వారికి లాభదాయక పరిచయాలు, ఉపయోగకర పరిచయాలు కలిగే అవకాశం ఉంది. మేషం, వృషభం, కర్కాటకం, సింహం, వృశ్చికం, ధనూ రాశుల వారికి స్నేహితుల వల్ల, అనుకోని సహాయాల వల్ల వచ్చే నెల రోజుల కాలంలో శుభ యోగాలు అనుభవించే యోగం ఉంది.
- మేషం: ఈ రాశివారికి లాభ స్థానంలో లాభాధిపతి శని సంచారం వల్ల దృఢమైన, లాభదాయకమైన స్నేహ సంబంధాలు ఏర్పడే అవకాశం ఉంది. రాజకీయ నేతలు, ప్రజా నాయకులతో పరిచయాలు విస్తరి స్తాయి. అవసరమైనప్పుడు సహాయం చేయడానికి, ఆదుకోవడానికి సిద్ధంగా ఉండే స్నేహి తులు ఏర్పడతారు. శత్రువులు కూడా మిత్రులుగా మారి సహాయం చేయడం జరుగుతుంది. మిత్రుల వల్ల వృత్తి, వ్యాపారాలు బాగా విస్తరించే అవకాశం ఉంది. మిత్రుల వల్ల ఆర్థిక లాభాలు చేకూరుతాయి.
- వృషభం: ఈ రాశికి లాభ స్థానంలో ఉన్న రాహువు వల్ల శత్రువుల సంఖ్య తగ్గి మిత్రుల సంఖ్య బాగా పెరుగుతుంది. వ్యాపారులు, సంపన్నులతో స్నేహ సంబంధాలు ఏర్పడతాయి. లాభదాయక పరిచయాలు ఏర్పడడానికి బాగా అవకాశం ఉంది. మిత్రుల వల్ల వ్యాపారాల్లో ప్రవేశించడం గానీ, వ్యాపారాల్లో రాణించడం గానీ జరుగుతుంది. ఆదాయం పెరగడానికి, ఆర్థికంగా స్థిరత్వం కలగడా నికి అవకాశం ఉంటుంది. సహోద్యోగుల వల్ల అదనపు ఆదాయ మార్గాలు బాగా విస్తరిస్తాయి.
- కర్కాటకం: లాభ స్థానంలో ఉన్న గురువు వల్ల వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతో స్నేహ సంబంధాలు విస్తరిస్తాయి. ఈ పరిచయాల వల్ల విజ్ఞానం పెరగడంతో పాటు ఆదాయ వృద్ధికి, పలుకుబడి పెరగ డానికి కూడా అవకాశం ఉంది. సహోద్యోగుల సహకారంతో ఉద్యోగంలో ఉన్నత పదవులు లభించే అవకాశం ఉంది. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాలు విజయవంతం కావడంలో కూడా సన్నిహితుల సహాయ సహకారాలు ఉంటాయి. విదేశాల్లో స్థిరపడిన మిత్రుల సహాయంతో విదేశీ ఆఫర్లు అందుతాయి.
- సింహం: ఈ రాశికి అత్యంత శుభుడైన కుజుడు లాభ స్థానంలో సంచారం చేయడం వల్ల సర్వకాల, సర్వా వస్థలా చేదోడు వాదోడుగా ఉండే స్నేహితులు లభిస్తారు. వీరి కారణంగా ఉద్యోగంలో పురోగతి ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో కష్టనష్టాలను అధిగమిస్తారు. ముఖ్యమైన పనులు, వ్యవహారాలను పూర్తి చేయడంలో సహకరిస్తారు. సాధారణంగా ఇప్పుడు కలిగే పరిచయాలు జీవితాంతం కొనసాగే అవకాశం ఉంది. అవసర సమయాల్లో స్నేహితుల నుంచి అవసర సలహాలు, సూచనలు అందుతాయి.
- వృశ్చికం: ఈ రాశికి లాభస్థానంలో రవి, బుధులు సంచారం చేస్తున్నందువల్ల వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతో స్నేహ సంబంధాలు వృద్ధి చెందుతాయి. వీరితో కలిసి వ్యాపారాలు చేయడం, పెట్టు బడులు పెట్టడం వంటివి జరిగే అవకాశం ఉంది. రాజకీయ ప్రముఖులు, ప్రభుత్వంలోని ఉన్నత వర్గాలతో కూడా పరిచయాలు పెంపొందే అవకాశం ఉంది. ఉద్యోగాల్లో అధికారుల నుంచే కాక, సహోద్యోగుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. వీరి ద్వారా ఆదాయ మార్గాలు పెరుగుతాయి.
- ధనుస్సు: ఈ రాశికి లాభ స్థానంలో శుక్ర సంచారం వల్ల బాగా సంపన్నులతో పరిచయాలు వృద్ధి చెందు తాయి. స్నేహితుల వల్ల అనేక విధాలుగా లాభాలు పొందడం జరుగుతుంది. అవసరమైనప్పు డల్లా స్నేహితుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. ఉద్యోగాలకు సిఫారసు చేయడం, ఉద్యోగావకాశాలను సూచించడం, ఆదాయ మార్గాలను తెలియజేయడం జరుగుతాయి. ఆస్తి వివాదాలు, ఆర్థిక సమస్యలు, వ్యక్తిగత సమస్యల పరిష్కారాల్లో కూడా వీరి సహాయం లభిస్తుంది.