Lucky Zodiac Signs: అయిదు గ్రహాల అనుగ్రహం.. ఈ రాశులకు పట్టిందల్లా బంగారం..!

ప్రస్తుతం ఆరు రాశులవారికి అయిదు ప్రధాన గ్రహాలు బాగా అనుకూలంగా ఉండటం జ్యోతిష్య శాస్త్రం రీత్యా ఎంతో ఆసక్తికర పరిణామం. ఏ రాశికైనా అయిదు గ్రహాలు అనుకూలంగా ఉండడమనేది అరుదుగా జరుగుతుంది. అయిదు గ్రహాలు అనుకూలంగా ఉన్న రాశులకు తప్పకుండా దశ తిరుగుతుంది. అత్యధిక గ్రహాల అనుకూల సంచారం వల్ల పట్టిందల్లా బంగారం అవుతుంది. వీరికి ధన యోగాలు, రాజయోగాలు ఎక్కువగా కలిగే అవకాశం ఉంది.

Lucky Zodiac Signs: అయిదు గ్రహాల అనుగ్రహం.. ఈ రాశులకు పట్టిందల్లా బంగారం..!
Lucky Zodiac Signs

Edited By: Janardhan Veluru

Updated on: Jun 18, 2025 | 7:08 PM

ఏ రాశికైనా నాలుగు గ్రహాలు అనుకూలంగా ఉండడమే గొప్ప విశేషం. ప్రస్తుతం ఆరు రాశులవారికి అయిదు ప్రధాన గ్రహాలు బాగా అనుకూలంగా ఉన్నాయి. ఏ రాశికైనా అయిదు గ్రహాలు అనుకూలంగా ఉండడమనేది అరుదుగా జరుగుతుంటుంది. ఆ రాశులకు తప్పకుండా దశ తిరుగుతుందని చెప్పవచ్చు. మొత్తం తొమ్మిది గ్రహాల్లో అత్యధిక సంఖ్యాక గ్రహాలు అనుకూలంగా సంచారం చేయడం వల్ల పట్టిందల్లా బంగారం అవుతుంది. మేషం, వృషభం, సింహం, తుల, ధనుస్సు, మకర రాశుల వారికి ఈ విధంగా అత్యధిక గ్రహాలు అనుకూలంగా మారడం వల్ల ధన యోగాలు, రాజయోగాలు ఎక్కువగా కలిగే అవకాశం ఉంది. జూలై ఆఖరు వరకూ ఈ అదృష్టం కొనసాగుతుంది.

  1. మేషం: ఈ రాశికి రాశ్యధిపతి కుజుడితో పాటు రాహువు, శుక్రుడు, బుధ, గురువులు బాగా అనుకూలంగా సంచారం చేస్తున్నందువల్ల వీరికి అనేక విధాలైన అదృష్టాలు కలుగుతాయి. ఉద్యోగంలో జీత భత్యాలు, వృత్తి, వ్యాపారాల్లో రాబడి బాగా పెరిగే అవకాశం ఉంది. షేర్లు, స్పెక్యులేషన్ల వంటివి అంచనాలకు మించి లాభిస్తాయి. అనేక పర్యాయాలు ధన యోగాలు పట్టే అవకాశం ఉంది. ఉద్యోగంలో పదోన్నతులు కలుగుతాయి. ఆస్తి వివాదం పరిష్కారమై విలువైన ఆస్తి కలిసి వస్తుంది.
  2. వృషభం: ఈ రాశివారికి రాశ్యధిపతి శుక్రుడితో పాటు శని, రాహువు, బుధ, రవి, గురువులు అనుకూల సంచారం చేస్తున్నందువల్ల మనసులోని కోరికలు, ఆశలు చాలావరకు నెరవేరే అవకాశం ఉంది. ఆకస్మిక ధన లాభానికి కూడా అవకాశం ఉంది. అనేక మార్గాల్లో ఆదాయం పెరగడం, ఆస్తి కలిసి రావడం, షేర్లు, లాటరీలు, స్పెక్యులేషన్లలో లాభాల పంట పండడం జరుగుతుంది. వృత్తి, వ్యాపా రాలు బాగా వృద్ధి చెందుతాయి. ఉద్యోగాల్లో జీతభత్యాలతో పాటు అదనపు రాబడి కూడా పెరుగుతుంది.
  3. సింహం: రాశ్యధిపతి రవితో పాటు, బుధ, శుక్ర, కుజ, రాహువులు బాగా అనుకూలంగా మారడం వల్ల ఈ రాశివారికి అనేక విధాలుగా ధన లాభాలు కలుగుతాయి. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీలు, వడ్డీ వ్యాపారాలు బాగా లాభిస్తాయి. రావలసిన సొమ్ముతో పాటు, బాకీలు, బకాయిలు కూడా చేతికి అందుతాయి. వారసత్వపు ఆస్తి లభించే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు లాభాల పంట పండిస్తాయి. జీతభత్యాలు బాగా పెరుగుతాయి.
  4. తుల: రాశ్యధిపతి శుక్రుడితో పాటు రవి, బుధ, కుజ, శని, కేతువులు అనుకూలంగా మారడం వల్ల ఈ రాశివారికి పట్టిందల్లా బంగారం అవుతుంది. అనేక విధాలుగా ఆదాయం కలిసి వస్తుంది. తండ్రి వైపు నుంచి ఆస్తిపాస్తులు లభిస్తాయి. ఆస్తుల విలువ పెరుగుతుంది. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారమవుతాయి. తక్కువ సమయంలో సంపన్నులు కావడానికి అన్ని విధాలా అవకాశాలు కలుగుతున్నాయి. అదనపు ఆదాయ ప్రయత్నాలు కలిసి వస్తాయి.
  5. ధనుస్సు: రాశ్యధిపతి గురువుతో పాటు రాహువు, రవి, బుధ, శుక్రుల అనుకూలత వల్ల ఆర్థిక జీవితం ఇది వరకటి కంటే అనేక రెట్లు మెరుగుపడే అవకాశం ఉంది. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. బంధుమిత్రుల నుంచి రావలసిన సొమ్ము చేతికి అందుతుంది. ఈ రాశివారికి తప్పకుండా మహా భాగ్య యోగం పడుతుంది. బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది. ఆర్థిక స్థిరత్వం లభిస్తుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు సఫలం అవుతాయి.
  6. మకరం: రాశ్యధిపతి శని, రాహువు, శుక్రుడు, రవి, బుధుల అనుకూల సంచారం వల్ల ఈ రాశివారికి ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. ఉద్యోగంలో పదోన్నతులు కలుగుతాయి. జీతభత్యాలు భారీగా పెరుగుతాయి. మరింత మంచి ఉద్యోగంలోకి మారడానికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపా రాలు కొత్త పుంతలు తొక్కుతాయి. ఐశ్వర్య యోగం పడుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లతో సహా అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది. ఆస్తి కలిసి వస్తుంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది.