ప్రధాన గ్రహాలైన శని, గురు రాహువు, శుక్ర, రవి, బుధులు కూడా అనుకూలంగా ఉన్నందువల్ల ఈ నెల అంతా అదృష్టవంతంగా సాగిపోతుంది. శుభవార్తలు వింటారు. ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆర్థికపరంగా ఊహించని విధంగా అభివృద్ధి జరుగుతుంది. ఆర్థిక సమస్యల నుంచి చాలావరకు బయటపడతారు. ఉద్యోగ పరంగా ఆశించిన స్థాయిలో పురోగతి ఉంటుంది. వృత్తి ఉద్యోగాలపరంగా విదేశీయానానికి కూడా అవకాశం ఉంది. కొద్దిగా ముందు చూపుతో వ్యవహరిస్తే ఒకటి రెండు ముఖ్యమైన కుటుంబ సమస్యలు కూడా పరిష్కారం అయ్యే సూచనలు ఉన్నాయి. సన్నిహితులతో కానీ, మిత్రులతో కానీ కొద్దిగా అపార్ధాలు తలెత్తే అవకాశం ఉంది. తోబుట్టువులతో ఆస్తి సమస్యలు ప్రారంభమయ్యే అవకాశం కూడా ఉంది. ఆరోగ్యం చాలావరకు సహకరిస్తుంది.
ఈ రాశి వారికి ఈ నెల ఆరు గ్రహాలు అనుకూలంగా మారుతున్నాయి. ఫలితంగా అదృష్ట యోగం పట్టే అవకాశం ఉంది. జీవితానికి సంబంధించి గతంలో తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఆశించిన ఫలితాలను ఇవ్వడం ప్రారంభిస్తాయి. ఆహార విహారాలలో కొన్ని జాగ్రత్తలు పాటించగలిగితే జీవితాన్ని ఆనందంగా అనుభవించడానికి అవకాశం కలుగుతుంది. ఉద్యోగ పరంగా ఉత్తమ భవితవ్యం కనిపిస్తోంది. నిరుద్యోగులు ఆశించిన దాని కంటే ఎక్కువగా శుభవార్తలు వింటారు. వారికి రెండు మూడు ఆఫర్లు వచ్చే అవకాశం కూడా ఉంది. ఆస్తి వ్యవహారాల్లో ఆచితూచి అడుగు వేయడం మంచిది. ఆర్థికపరంగా మంచి పురోగతి సాధిస్తారు. ఉద్యోగంలో అధికార యోగానికి అవకాశం ఉంది. ఐటీ రంగానికి చెందినవారు ఎంతగానో లాభపడతారు. వృత్తి వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి.
శని, గురు, శుక్ర గ్రహాలు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల కొన్ని కుటుంబ సమస్యల నుంచి, ఒకటి రెండు ఆర్థిక సమస్యల నుంచి బయటపడటానికి అవకాశం ఉంది. ఆర్థిక విషయాల్లో ఎవరికైనా వాగ్దానాలు చేయడం కానీ, హామీలు ఇవ్వటం కానీ చేయకపోవడం ప్రస్తుతానికి చాలా మంచిది. వ్యక్తిగత ఆర్థిక సమస్యల మీద దృష్టి పెట్టడం మంచిది. ఉద్యోగ పరంగా అధికారుల నుంచి ఒక శుభవార్త వినే అవకాశం ఉంది. ఉద్యోగ పరంగా విదేశాలకు వెళ్లే అవకాశం కలుగుతుంది. వ్యాపారంలో భాగస్వాముల నుంచి సహకారం లభిస్తుంది. వ్యయ స్థానంలో కుజుడు స్తంభించడం వల్ల అనవసర ఖర్చులు పెరుగుతాయి. అనవసర స్నేహాలకు, వ్యసనాలకు ఖర్చు చేయాల్సి వస్తుంది. కొన్ని విషయాలలో మెలకువగా వ్యవహరించడం మంచిది. ఆరోగ్యం జాగ్రత్త. ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు.
గురు, కుజ, రాహు, శుక్ర గ్రహాలు అనుకూలంగా ఉన్నందువల్ల వృత్తి వ్యాపారాల్లో ఊహించని అదృష్టాలను చవి చూస్తారు. విదేశాల్లో ఉన్నత విద్యకు, మంచి ఉద్యోగాలకు అవకాశం ఉంది. వాహన యోగం, గృహ యోగం వంటివి అనుభవానికి వస్తాయి. ఒక ప్రతిష్టాత్మక సంస్థలో ఉన్నత స్థాయి ఉద్యోగాన్ని దక్కించుకునే అవకాశం ఉంది. నిరుద్యోగులకు దూర ప్రాంతంలో ఆశించిన ఉద్యోగం లభించే సూచనలున్నాయి. ఆరోగ్యంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. ఊహించని విధంగా ఒక శుభ పరిణామం చోటు చేసుకోవడంతో జీవితం ఒక మంచి మలుపు తిరుగుతుంది. వృత్తి వ్యాపారాల్లో ముందుకు దూసుకు వెళతారు. ఆరోగ్యం సహకరిస్తుంది. ఐటీ, రియల్ ఎస్టేట్, సామాజిక రంగాల వారు ఆర్థికంగా బలపడతారు. పిల్లలు పురోగతి సాధిస్తారు. బంధువుల్లో పలుకుబడి పెరుగుతుంది. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది.
కుజ, రాహు, కేతువులు అనుకూలంగా ఉన్నందువల్ల వ్యాపారాల వారికి ఎక్కువగా ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి. డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, ఐటి వారు అనేక విధాలుగా వృద్ధిలోకి వస్తారు. వీరి సేవలకు సామాజికంగా మంచి గుర్తింపు లభిస్తుంది. పిల్లలు చదువుల్లో బాగా శ్రమ పడాల్సి ఉంటుంది. ఇంటా బయటా విపరీతంగా ఒత్తిడి ఉంటుంది. ఉద్యోగంలో కూడా పని భారం పెరుగుతుంది. ఆదాయం ఆశించిన స్థాయిలో పెరిగే సూచనలున్నాయి. ఆర్థిక సమస్యలు అదుపులో ఉంటాయి. ఎవరికైనా వాగ్దానాలు చేయటం కానీ, హామీలు ఉండటం కానీ చేయకపోవడం మంచిది. పెళ్లి సంబంధాల కారణంగా మాట పడాల్సి వస్తుంది. ఆరోగ్యం విషయంలో కొద్దిగా శ్రద్ధ అవసరం. మొండి బాకీల వసూళ్ల కోసం పోరాడాల్సి వస్తుంది. కుటుంబ సభ్యుల నుంచి ఆశించిన సహకారం ఉంటుంది. దాంపత్య జీవితంలో అన్యోన్యత ఏర్పడుతుంది.
ఈ నెల అంతా శని గురువు కుజుడు అను కూలంగా ఉండటం వల్ల ఆర్థికంగా బలపడటానికి, ఉద్యోగంలో స్థిరత్వం ఏర్పడడానికి అవకాశం ఉంది. సంతానయోగ సూచనలు ఉన్నాయి. పిల్లలు ఆశించిన విధంగానే పురోగతి సాధిస్తారు. ఒకటి రెండు శుభవార్తలు వింటారు. ఒక మంచి శుభ పరిణామం చోటు చేసుకుంటుంది. వృత్తి వ్యాపారాల్లో లాభాల పంట పండిస్తారు. డాక్టర్లు లాయర్లకు క్షణం కూడా తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. ఆర్థికంగా ఒక అడుగు ముందుకు వేస్తారు. తోబుట్టువులకు అండగా నిలబడతారు. ఉద్యోగరీత్యా దూర ప్రాంతానికి బదిలీ అయ్యే అవకాశం ఉంది. ఆర్థిక లావాదేవీలు, వ్యాపారాల్లో పెట్టుబడులు ఆశించిన ప్రయోజనాలను కలిగిస్తాయి. బంధువులతో ఆస్తి సంబంధమైన సమస్యలు పరిష్కారం అయ్యే సూచనలు ఉన్నాయి. మిత్రుల సహాయంతో ముఖ్యమైన పనులు విజయవంతంగా పూర్తి అవుతాయి.
ఈ రాశి వారికి యోగ కారకుడైన శని ఐదవ స్థానంలో ఉన్నందువల్ల ఈ నెల అంతా ఉద్యోగ పరంగా చాలా బాగుంటుంది. ఉద్యోగంలోనే కాక వృత్తి వ్యాపారాల్లో కూడా మీ మాటకు విలువ పెరుగుతుంది. భాగస్వాములతో వివాదాలు పరిష్కారం అవుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండటం మంచిది. కొందరు స్నేహితులు లేదా దగ్గర బంధువులు మిమ్మల్ని తప్పుదోవ పట్టించే అవకాశం ఉంది. కొంత డబ్బు నష్టపోయే సూచనలు ఉన్నాయి. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండటం శ్రేయస్కరం. బంధువర్గంలో మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. పిల్లలు చదువుల విషయంలో బాగా శ్రద్ధ పెంచాల్సి ఉంటుంది. వాగ్దానాలు, హామీలకు ఆమడ దూరంలో ఉండటం మంచిది. ఆరోగ్యం ఒక మోస్తరుగా ఉంటుంది . ఆహార విహారాల్లో జాగ్రత్తలు పాటించడం మంచిది. నిరుద్యోగులు సొంత ఊర్లోనే ఉద్యోగం సంపాదించుకునే అవకాశం ఉంది.
ఈ రాశికి పంచమ స్థానమైన మీనరాశిలో గురుగ్రహం సంచరిస్తున్నందువల్ల ఒకటి రెండు కుటుంబ సమస్యలు, వ్యక్తిగత సమస్యలు అనుకోకుండా పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. అయితే, సంపాదనలో ఆశించినంత పెరుగుదల ఉండకపోవడం వల్ల కొద్దిగా ఆర్థిక సమస్యలు ఇబ్బంది పెడతాయి. అర్ధాష్టమ శని కారణంగా మనశ్శాంతి తగ్గవచ్చు. ఇల్లు మారాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చు. మధ్య మధ్య అనారోగ్యాలు బాధించే అవకాశం కూడా ఉంది. కొందరు బంధువులు మిత్రుల సహాయ సహకారాల కారణంగా ఆర్థికంగా కొద్దిగా ప్రయోజనం ఉండవచ్చు. వృత్తి వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఉద్యోగంలో అధికారుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. ఇతరులకు వాగ్దానాలు చేయటం కానీ, హామీలు ఇవ్వటం కానీ చేయకపోవడం మంచిది. కొన్ని విషయాలలో తగ్గి ఉండటం శ్రేయస్కరం.
శని గురు కుజ గ్రహాలు అనుకూలంగా ఉన్నందువల్ల ఇంట్లో ప్రశాంత వాతావరణం ఏర్పడటంతో పాటు దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది. ఉద్యోగపరంగా బాగా కలిసి వస్తుంది. అధికార యోగానికి అవకాశం ఉంది. అనుకోకుండా భారీ మొత్తంలో డబ్బు చేతికి అందుతుంది. మొండి బాకీలు వసూలు అయ్యే అవకాశం కూడా ఉంది. ఆరోగ్యం చాలావరకు అనుకూలంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో కొత్త ఆదాయ మార్గాలు మీ దృష్టికి వస్తాయి. మనసులోని కోరికలలో ఒకటి రెండు కోరికలు నెరవేరుతాయి. మితిమీరిన ఔదార్యంతో ఒకరిద్దరు స్నేహితులకు ఆర్థిక సహాయం చేస్తారు. తోబుట్టువులు నిందలు వేసే సూచనలు ఉన్నాయి. నరఘోష ఎక్కువగా ఉంటుంది. విదేశీయాన సూచనలు ఉన్నాయి. విహార యాత్రలకు కూడా అవకాశం ఉంది. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోవద్దు.
శని గురు గ్రహాలు అనుకూలంగా ఉన్నందువల్ల ఉద్యోగ జీవితం సానుకూలంగా, ఉత్సాహంగా సాగిపోతుంది. అధికారులు ఆశించిన విధంగా ప్రోత్సహిస్తారు. తోబుట్టువులతో ఆస్తి వ్యవహారాలలో ఆచితూచి అడుగు వేయడం మంచిది. కొందరు మిత్రులు నమ్మించి మోసగించే అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాల్లో లాభాలు నిలకడగా ముందుకు సాగుతాయి. పెళ్లి సంబంధం కుదిరే సూచనలున్నాయి. తనకు మాలిన ధర్మంగా ఇతరులకు సహాయం చేస్తారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. పిల్లల నుంచి శుభవార్త వింటారు. వృత్తి నిపుణులు విదేశీ సంస్థల్లో ఉద్యోగాలు సంపాదించుకునే అవకాశం ఉంది. ఇప్పుడు తీసుకునే నిర్ణయాల వల్ల భవిష్యత్తులో ఉపయోగముంటుంది. నిర్ణయాలు తీసుకునే ముందు కుటుంబ సభ్యులతో సంప్రదించడం మంచిది. ఆరోగ్య పరిస్థితి చాలా వరకు నిలకడగా ఉంటుంది.
గురు, రాహువులు అనుకూలంగా ఉన్నందువల్ల కోర్టు కేసు ఒకటి అనుకూలంగా పరిష్కారం అవుతుంది. శత్రువుల మీద విజయం సాధిస్తారు. ఉద్యోగంలో అదనపు భారం మీద పడుతుంది. కొత్త లక్ష్యాలను నిర్దేశించడం జరుగుతుంది. ఆరోగ్యం చాలావరకు నిడకడగా ఉంటుంది. అయితే, శరీరానికి విశ్రాంతి అవసరమని గ్రహించండి. ఆర్థిక పరిస్థితుల్లో కొద్దిపాటి మెరుగుదల ఉంటుంది. అనవసర ఖర్చులను తగ్గించుకోవడం మంచిది. మిత్రుల నుంచి సహాయం కోసం ఒత్తిడి ఉంటుంది. కుటుంబంలో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. బంధు వర్గంలో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. పిల్లల వల్ల కొద్దిగా ఇబ్బందులు పడే సూచనలు ఉన్నాయి. దూర ప్రాంతం నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ఉద్యోగరీత్యా ఎక్కువగా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. అనవసర పరిచయాలకు దూరంగా ఉండండి.
ఈ రాశి వారికి ప్రధాన గ్రహాలైన గురువు, కుజుడు అనుకూలంగా ఉన్నందువల్ల ఆకస్మిక ధన లాభానికి, కొద్దిపాటి అధికార యోగానికి అవకాశం ఉంది. ఉద్యోగంలో అధికారుల నుంచి ఆదరణ, ప్రోత్సాహాలు ఉంటాయి. డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, ఐటి వారికి ఆర్థికంగా అదనపు ప్రయోజనాలు సమకూరుతాయి. మంచి గుర్తింపు కూడా లభిస్తుంది. వ్యాపార రంగంలో ఉన్నవారు అప్రమత్తంగా ఉండటం మంచిది. కొందరు సన్నిహితులు మోసగించే అవకాశం ఉంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. ఆహార విహారాల్లో జాగ్రత్తగా ఉండటం మంచిది. వాగ్దానాలు, హామీలు ఇబ్బందికర పరిస్థితుల్ని సృష్టిస్తాయి. ఆర్థిక లావాదేవీలవల్ల ప్రయోజనం ఉంటుంది. కుటుంబ పరంగా కొన్ని మంచి నిర్ణయాలు తీసుకొని ఆచరణలో పెట్టడం మంచిది. ఆధ్యాత్మిక చింతన బాగా పెరుగుతుంది. డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండండి.