Zodiac Signs
తమ రాశిలో బుధుడు లేదా గురువు, చతుర్థంలో శుక్రుడు లేదా చంద్రుడు, సప్తమంలో శని, దశమంలో రవి లేదా కుజుడు సంచారం చేస్తున్నప్పుడు దిగ్బల యోగం పడుతుంది. దిగ్బల యోగం పట్టినప్పుడు శుభ ఫలితాలు, శుభ యోగాలు మరింత బలంగా పనిచేస్తాయి. ప్రస్తుతం వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, వృశ్చిక రాశులకు ఈ దిగ్బల యోగం పట్టింది. దీనివల్ల ప్రాధాన్యం, ప్రాభవం పెరగడంతో పాటు వ్యక్తిగత, ఆర్థిక, కుటుంబ, ఉద్యోగ సమస్యల నుంచి చాలావరకు గట్టెక్కడం కూడా జరుగుతుంది.
- వృషభం: ఈ రాశిలో గురు సంచారం వల్ల ఈ రాశివారికి దిగ్బల రాజయోగం పట్టింది. ఇది ఈ ఏడాదంతా కొనసాగుతుంది. దీనివల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లోనే కాకుండా సామాజికంగా కూడా ప్రాధాన్యం, ప్రాభవం పెరుగుతాయి. ప్రముఖులతో పరిచయాలు బాగా వృద్ధి చెందుతాయి. సంపన్నుల స్థాయికి ఎదిగే అవకాశం ఉంది. అనుకోకుండా ఆస్తిపాస్తులు కలిసి వస్తాయి. కొద్ది శ్రమతో అత్యధిక లాభాలు పొందుతారు. చేపట్టిన ప్రతి పనీ, ప్రతి ప్రయత్నమూ తప్పకుండా నెరవేరడం జరుగుతుంది.
- మిథునం: ఈ రాశికి చతుర్థ స్థానంలో శుక్ర సంచారం వల్ల సెప్టెంబర్ 18 వరకు దిగ్బల యోగం పట్టింది. దీని వల్ల ఇంటా బయటా గౌరవమర్యాదలు, పలుకుబడి వృద్ధి చెందుతాయి. కుటుంబంలో శుభకా ర్యాలు జరుగుతాయి. ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంటుంది. గృహ, వాహన యోగాలు పట్టే అవ కాశం ఉంది. ఆస్తిపాస్తులు కలిసి వస్తాయి. మాతృ సౌఖ్యం లభిస్తుంది. ఆరోగ్యం బాగా కుదు టపడుతుంది. దాంపత్య జీవితంలో ఎటువంటి సమస్యలున్నా తొలగిపోయి, అన్యోన్యత పెరుగుతుంది.
- కర్కాటకం: ఈ రాశిలో బుధ సంచారం వల్ల మరో పదిహేను రోజుల వరకు దిగ్బలం పట్టింది. దీనివల్ల వీరి ప్రతిభా పాటవాలు బాగా వెలుగులోకి వస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లోనే కాకుండా, సర్వత్రా మంచి గుర్తింపు లభిస్తుంది. వ్యక్తిగత, ఆర్థిక, ఆస్తి, కుటుంబ సమస్యలను చాలావరకు పరిష్కరించుకుం టారు. ఆదాయం వృద్ధి చెందుతుంది. మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. ఉద్యోగంలో హోదా పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు నిలకడగా సాగిపోతాయి. ఆశించిన శుభ వార్తలు వింటారు.
- సింహం: ఈ రాశికి సప్తమ స్థానంలో శనీశ్వరుడి సంచారం వల్ల దిగ్బలం పట్టింది. ఉద్యోగంలో హోదాలు పెరుగుతాయి. వృత్తి జీవితంలో కార్యకలాపాలు బాగా వృద్ధి చెందుతాయి. వ్యాపారాలు లాభాల బాటపడతాయి. రాజకీయ ప్రముఖులతో పరిచయాలు విస్తరిస్తాయి. అనారోగ్యానికి తగిన చికిత్స లభిస్తుంది. వృత్తి, ఉద్యోగాల రీత్యా తప్పనిసరిగా విదేశాలకు వెళ్లవలసి వస్తుంది. కుటుంబ జీవి తంలో సమ స్యలు తొలగిపోతాయి. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి ఖాయమవుతుంది.
- కన్య: ఈ రాశివారికి దశమ స్థానంలో కుజ సంచారం వల్ల వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం బాగా పెరుగు తుంది. మంచి హోదా లభించే సూచనలున్నాయి. నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగం లభించే అవకాశం ఉంది. పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలలో ఘన విజయాలు సాధిస్తారు. రాజకీయ ప్రాబల్యం పెరుగుతుంది. వృత్తి జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా అభివృద్ధి చెందుతుంది. నిరు ద్యోగులకు విదేశాల నుంచి కూడా ఆఫర్లు అందుతాయి. ప్రతి ప్రయత్నమూ సఫలం అవుతుంది.
- వృశ్చికం: ఈ రాశికి దశమ స్థానంలో రవి సంచారం వల్ల దిగ్బల రాజయోగం పట్టింది. దీనివల్ల ఉద్యోగ పరంగా ఊహించని లాభాలు కలుగుతాయి. ఉద్యోగ సంబంధమైన ఏ ప్రయత్నమైనా విజయం లభిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగాలకు అవకాశం ఉంది. మరింత మంచి ఉద్యోగంలోకి మారడానికి అవ కాశం ఉంటుంది. ఉద్యోగంలో ప్రాభవం పెరుగుతుంది. తప్పకుండా అధికార యోగం పడుతుంది. సిరిసంపదలు కలిసి వస్తాయి. పిత్రార్జితం లభించే అవకాశం ఉంది. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది.