సెప్టెంబర్ 17 దిన ఫలాలు: ఈరాశుల వారికి ఆదాయం, ఉద్యోగంలో భారీ పురోగతి.. మీ రాశి ఉందా?

Horoscope Today (September 17, 2026): గురువారం దిన ఫలాల్లో మేష రాశి వారికి ఆదాయం పెరగడంతో పాటు ఏ రంగంలో ఉన్నా పురోగతి సాధించే అవకాశాలు ఉన్నాయి. వృషభ రాశి నిరుద్యోగులకు ఉద్యోగ పరంగా శుభవార్త అందే సూచనలు కనిపిస్తున్నాయి. కుటుంబ పరిస్థితులు మెరుగుపడి మానసిక ప్రశాంతత ఏర్పడవచ్చు. మిథున రాశి వారికి ఆర్థిక లాభాలతో పాటు వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన పురోగతి కలిగే అవకాశం ఉంది. మేషం నుంచి మీనం వరకు 12 రాశుల వారికి గురువారం రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.

సెప్టెంబర్ 17 దిన ఫలాలు: ఈరాశుల వారికి ఆదాయం, ఉద్యోగంలో భారీ పురోగతి.. మీ రాశి ఉందా?
Rashi Phalalu 17 September 2026

Edited By:

Updated on: Sep 17, 2026 | 6:00 AM

దిన ఫలాలు (సెప్టెంబర్ 17, 2026): మేష రాశి వారికి ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఏ రంగంలో ఉన్నప్పటికీ తప్పకుండా పురోగతి ఉంటుంది. వృషభ రాశికి చెందిన నిరుద్యోగుల కల నెరవేరుతుంది. కుటుంబ పరిస్థితులు చాలావరకు చక్కబడి, మనశ్శాంతి ఏర్పడుతుంది. మిథున రాశి వారికి ఆర్థిక లాభాలకు లోటుండదు. వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన పురోగతి ఉంటుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

శుక్ర, రవి, బుధుల అనుకూలత వల్ల ఏ ప్రయత్నం తలపెట్టినా విజయాలు సాధిస్తారు. తమకు అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని లబ్ధి పొందుతారు. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఏ రంగంలో ఉన్నప్పటికీ తప్పకుండా పురోగతి ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో సొంత ఆలోచనలు బాగా కలిసి వస్తాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. సామాజికంగా ప్రాభవం పెరుగు తుంది. నిరుద్యోగులు శుభవార్త అందుకుంటారు. మంచి పెళ్లి సంబంధం కుదిరే అవకాశముంది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

కుటుంబంలో సుఖ సంతోషాలకు లోటుండదు. సామాజిక హోదా పెరుగుతుంది. తృతీయ రాశిలో గురువు ఉండడం వల్ల వృత్తి, ఉద్యోగాల్లో ఉన్నత స్థితికి వెళ్లడానికి అవకాశముంది. వ్యాపారాలు లాభసాటిగా పురోగమిస్తాయి. నిరుద్యోగుల కల నెరవేరుతుంది. కుటుంబ పరిస్థితులు చాలావరకు చక్కబడి, మనశ్శాంతి ఏర్పడుతుంది. ఆదాయం వృద్ధి చెందుతుంది. పిల్లలు పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తారు. మిత్రుల వల్ల డబ్బు నష్టపోయే అవకాశం ఉంది. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం మంచిది.

ఇవి కూడా చదవండి

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

రోజంతా ఉత్సాహంగా, ఉల్లాసంగా గడిచిపోతుంది. గ్రహ బలం అనుకూలంగా ఉన్నందువల్ల వృత్తి, ఉద్యోగాలతో పాటు సామాజికంగా కూడా ప్రాధాన్యం పెరుగుతుంది. ఆర్థిక లాభాలకు లోటుండదు. వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన పురోగతి ఉంటుంది. దీర్ఘకాలిక అనారోగ్యాల నుంచి కొంత వరకు ఉపశ మనం లభిస్తుంది. నిరుద్యోగులు, అవివాహితులకు శుభవార్తలు అందుతాయి. అదనపు ఆదా యానికి అవకాశాలు బాగా ఉన్నాయి. వ్యాపారాలు ఆర్థికపరంగా బాగా అనుకూలంగా ఉంటాయి.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

శుక్ర, గురువులు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఆదాయానికి లోటుండదు. ఆదాయ వృద్ధి మార్గాలు సత్ఫలితాలనిస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో అధికారులు ప్రత్యేక లక్ష్యాలు, బాధ్యతలు అప్ప గించి బాగా ప్రోత్సహిస్తారు. ఆరోగ్యానికి కూడా ఇబ్బంది ఉండదు. ఏ ప్రయత్నం తలపెట్టినా సఫల మయ్యే అవకాశం ఉంటుంది. ఇంటా బయటా కొద్దిగా ఒత్తిడి ఉంటుంది. నిరుద్యోగులకు ఆశించిన సమాచారం అందుతుంది. పెళ్లి ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

రవి, కుజుల అనుకూల సంచారం వల్ల ముఖ్యమైన ప్రయత్నాలు సఫలమవుతాయి. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవుతాయి. ఆదాయానికి లోటుండదు. అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది. ప్రముఖులతో పరిచయాల వల్ల సామాజిక హోదా పెరుగుతుంది. మీ పని తీరుతో అధికారులను ఆకట్టుకుంటారు. వృత్తి, వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. నిరుద్యోగులు ఆశించిన సంస్థలో ఉద్యోగం సంపాదించుకుంటారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

ధన స్థానం బలంగా ఉన్నందువల్ల ఆదాయానికి లోటుండదు కానీ, సప్తమ శని ప్రభావం వల్ల చేతిలో డబ్బు నిలవదు. అనవసర ఖర్చులు బాగా పెరుగుతాయి. ప్రతి పనిలోనూ ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు పరవాలేదనిపిస్తాయి కానీ, కాస్తంత అప్రమత్తంగా ఉండడం శ్రేయస్కరం. ఆహార, విహారాల్లో జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. వ్యక్తిగత వ్యవహారాల్లో బంధుమిత్రుల్ని తలదూర్చనివ్వవద్దు.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

ఈ రాశివారికి శుభ గ్రహాల అనుకూలత ఎక్కువగా ఉండడం వల్ల రోజంతా శుభవార్తలతో గడిచిపోతుంది. అనుకున్న పనులన్నీ పూర్తయి, ఊరట లభిస్తుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలకు ఆశించిన స్పందన లభిస్తుంది. వ్యాపారాలు అనుకూలంగా సాగిపోతాయి. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. వృత్తి, ఉద్యోగాల్లో అధికారుల నుంచి ప్రోత్సాహకాలు అందుకుంటారు. పిల్లలు ఆశించిన స్థాయిలో విజయాలు సాధిస్తారు. ఆర్థిక లావాదేవీలు, షేర్లు, స్పెక్యులేషన్లు లాభిస్తాయి.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

ఈ రాశివారికి ప్రస్తుతం గురు, కుజులు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ప్రతి ప్రయత్నమూ సఫలమవుతుంది. పెండింగ్ పనులకు అవకాశముండదు. ప్రతి వ్యవహారం లాభసాటిగా పూర్త వుతుంది. వ్యాపారపరంగా ఆశించిన స్థాయిలో లాభాలు పెరుగుతాయి. ఆదాయం మరింతగా పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో మీ శక్తి సామర్థ్యాలకు మంచి గుర్తింపు లభిస్తుంది. ఇంటా బయటా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. జీవిత భాగస్వామితో అన్యోన్యత బాగా పెరుగుతుంది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

రాశినాథుడైన గురువు అష్టమ స్థానంలో ఉచ్ఛ స్థితిలో ఉన్నందువల్ల కొన్ని ముఖ్యమైన సమ స్యల్ని అధిగమించడం జరుగుతుంది. ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు. వృత్తి, ఉద్యోగాల్లో ఉన్నత స్థానానికి వెళ్లే అవకాశముంది. అధికారులకు మీ సలహాలు, సూచనలు బాగా ఉపయోగపడతాయి. వ్యాపారాల్లో అంచనాలకు మించి లాభాలు పెరుగుతాయి. తండ్రి నుంచి ఆశించిన సహాయంతో పాటు ఆస్తి కలిసి వచ్చే అవకాశముంది. శుభవార్తలు ఎక్కువగా వింటారు.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

గురు, బుధ, శుక్రుల అనుకూలత వల్ల వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం, ప్రాభవం బాగా పెరుగుతాయి. ప్రతిభాపాటవాలకు మంచి గుర్తింపు లభిస్తుంది. వృత్తి, ఉద్యోగాల్లో మీ పని తీరుతో అధికా రులను ఆకట్టుకుంటారు. ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగు తుంది. బంధుమిత్రుల్లో మాటకు, చేతకు విలువ ఉంటుంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచ యాలు వృద్ధి చెందుతాయి. వ్యాపా రాలు ఆర్థికంగా బలం పుంజుకుంటాయి. ప్రస్తుతానికి ఎవరికీ ఎటువంటి వాగ్దానాలు చేయవద్దు.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

భాగ్య స్థానంలో శుక్ర, రవులు, దశమ స్థానంలో గురువు వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మీ ప్రాభవం, ప్రాధాన్యం బాగా పెరుగుతాయి. ఉద్యోగులకు, నిరుద్యోగులకు మంచి అవకాశాలు లభి స్తాయి. విదేశీ ఆఫర్లు అందే అవకాశం కూడా ఉంది. సర్వత్రా ప్రతిభా పాటవాలకు గుర్తింపు లభి స్తుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. పిల్లల నుంచి శుభవార్తలు అందుతాయి. దైవ కార్యాల్లో పాల్గొం టారు.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

పంచమ స్థానంలో ఉచ్ఛ స్థితిలో సంచారం చేస్తున్న రాశినాథుడు గురువు వల్ల అనేక విధాలుగా భాగ్యం కలిసి వస్తుంది. ముఖ్యంగా ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. మాటకు విలువ పెరుగుతుంది. అధికారులకు మీ సలహాలు, సూచనలు ఉపయోగపడతాయి. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఎదురు చూస్తున్న శుభవార్తలు వింటారు. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. శత్రువులు, పోటీదార్లు, ప్రత్యర్థుల మీద పైచేయి సాధిస్తారు. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.

Loading...
Unable to load recommendations.
Follow Us