Horoscope Today (March 16, 2023): ఆర్థికంగా ఆ రాశివారికి అదృష్ట యోగం.. గురువారంనాటి రాశిఫలాలు..

| Edited By: Ravi Kiran

Mar 16, 2023 | 2:00 AM

Daily Horoscope Today: 12 రాశుల వారికి గురువారం (మార్చి 16) దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.

Horoscope Today (March 16, 2023): ఆర్థికంగా ఆ రాశివారికి అదృష్ట యోగం.. గురువారంనాటి రాశిఫలాలు..
Horoscope Today
Image Credit source: TV9 Telugu
Follow us on

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

ఉద్యోగంలో తలకు మించిన బాధ్యతలు మీద పడతాయి. ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉంటుంది. ఆర్థిక పరిస్థితి అనుకూలంగానే ఉంటుంది. పొదుపులు, మదుపులు
ప్రారంభిస్తారు. పిల్లల నుంచి శుభవార్త వింటారు. శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. మిత్రులతో విభేదాలు సమసిపోతాయి. ఉద్యోగం మారటానికి ఇది సమయం
కాదు. వృత్తి వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఆర్థిక లావాదేవీలు ఆశించిన ప్రయోజనాన్ని కలిగిస్తాయి.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

ఉద్యోగ వాతావరణం సానుకూలంగా, సామరస్యంగా సాగిపోతుంది. డబ్బు సమస్యలు ఉండకపోవచ్చు. తనకు మాలిన ధర్మంగా ఒకరిద్దరు స్నేహితులకు సహాయం చేస్తారు.
ఆర్థిక సంబంధమైన వ్యాపారాలు చేసేవారికి సమయం అనుకూలంగా ఉంది. డాక్టర్లు లాయర్లు ఐటి వారు పురోగతి సాధిస్తారు. చదువుల్లో పిల్లలు ముందడుగు వేస్తారు. ఆహార విహారాల్లో జాగ్రత్తలు పాటించడం అవసరం.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

కుటుంబ జీవితం ఎటువంటి సమస్యలు లేకుండా ప్రశాంతంగా సాగిపోతుంది. దాంపత్యంలో అన్యోన్యత పెరుగుతుంది. జీవిత భాగస్వామి తరపు బంధువులు ఇంటికి
వస్తారు. బంధువర్గంలోనే మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. కొందరు స్నేహితుల వల్ల ఆర్థికంగా ఒత్తిడికి గురవుతారు. ఆరోగ్యం నిలకడగానే ఉంటుంది. ఉద్యోగంలో బరువు బాధ్యతలు కాస్తంత ఎక్కువగానే పెరుగుతాయి.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

కొందరు బంధువులకు ఆర్థికంగా సహాయం చేసి ఇబ్బంది పడతారు. విలాసాల మీద ఖర్చు చేయడం ఎక్కువ అవుతుంది. వ్యసనాలకు దూరంగా ఉండటం మంచిది. ఉద్యోగ జీవితం సాఫీగానే సాగిపోతుంది. నిరుద్యోగులు శుభవార్త వింటారు. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు ఒక్క నిమిషం కూడా తీరిక
లేని స్థితికి చేరుకుంటారు. ఆర్థిక  లావాదేవీల వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

స్థాన చలనానికి అవకాశం ఉంది. అద్దె ఇంటివారు ఇల్లు మారాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఆర్థిక పరిస్థితి చాలా వరకు మెరుగుపడుతుంది. వృత్తి వ్యాపారాల్లో లాభాలు గడిస్తారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యులతో సంప్రదించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు మీద పడే అవకాశం ఉంది. ఆరోగ్యం చాలావరకు అనుకూలంగా ఉంటుంది.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

తాను ఒకటే తలచిన దైవం ఒకటి తలచును అన్నట్టుగా ఉంటుంది. మీరు అనుకున్నట్టు పనులు జరగక పోయినా, చివరికి అవి సంతృప్తి కలిగిస్తాయి. తోబుట్టువులతో
విభేదాలు తలెత్తే సూచనలు ఉన్నాయి. ఎవరితోనైనా ఆచితూచి మాట్లాడడం మంచిది. ఉద్యోగంలో అధికారుల నుంచి మంచి ప్రోత్సాహం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి
ఆశాజనకంగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

కుటుంబ వాతావరణం, ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటాయి. పనిచేసే చోట గౌరవ మర్యాదలు పెరుగుతాయి. పలుకుబడి కలవారితో పరిచయాలు ఏర్పడతాయి. ఆర్థిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది. మీ స్తోమతకు మించి ఇతరులకు సహాయం చేస్తారు. కుటుంబంతో కలిసి ఆనందంగా గడుపుతారు. వ్యాపారులు నిలకడగా లాభాలు
సంపాదిస్తారు. ఐటీ నిపుణులకు సమయం అనుకూలంగా ఉంది.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ఠ)

ఉద్యోగ పరంగాను, కుటుంబ పరంగాను, ఆర్థికంగానూ సమయం చాలావరకు అనుకూలంగా ఉంది. ఇప్పుడు మీరు తీసుకునే నిర్ణయాలు మంచి ఫలితాలను ఇస్తాయి. కొత్త
నిర్ణయాలను వెంటనే ఆచరణలో పెట్టండి. అనవసర పరిచయాలకు దూరంగా ఉండండి. చాలాకాలంగా ఇబ్బంది పెడుతున్న వ్యక్తిగత సమస్య ఒకటి అనుకోకుండా పరిష్కారం అవుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

ఒకటి రెండు ఆర్థిక సమస్యలు అనుకోకుండా పరిష్కారం అవుతాయి. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. అవసరాలకు తగ్గట్టుగా డబ్బు చేతికి అందుతుంది. పిల్లలతో సరదాగా కాలక్షేపం చేస్తారు. ఉద్యోగంలో సహచరుల కారణంగా ఒకటి రెండు సమస్యలు ఇబ్బంది పెడతాయి. తోబుట్టులతో అపార్ధాలు తలెత్తుతాయి. ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంటుంది. అదనపు ఆదాయం కోసం ప్రయత్నాలు ప్రారంభిస్తారు.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

ఆర్థికంగా అదృష్ట యోగం పడుతుంది. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. ఉద్యోగంలో స్థిరత్వం ఏర్పడుతుంది. అధికారుల నుంచి ఆదరణ లభిస్తుంది. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో పురోగతి ఉంటుంది. భాగస్వాములతో ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. బంధువర్గంలో పెళ్లి సంబంధం కుదురుతుంది. నిరుద్యోగులకు మంచి ఆఫర్ వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యం అనుకూలిస్తుంది.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

చిన్నపాటి ధనయోగం పట్టే అవకాశం ఉంది. కొన్ని ఆర్థిక అవసరాలు తీరుతాయి. ఉద్యోగ పరంగా కొద్దిగా ఒత్తిడి ఉన్నప్పటికీ లక్ష్యాలను విజయవంతంగా పూర్తి చేస్తారు. మిత్రుల సహాయంతో ఒకటి రెండు ముఖ్యమైన పనులు పూర్తి అవుతాయి. అనవసర పరిచయాలకు దూరంగా ఉండటం మంచిది. మిత్రుల వల్ల డబ్బు నష్టపోయే అవకాశం ఉంది. వాగ్దానాలు చేయడం, హామీలు ఉండటం మంచిది కాదు.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

ఉద్యోగంలో తలకు మించిన బాధ్యతలు మీద పడతాయి. ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉంటుంది. ఆర్థిక పరిస్థితి అనుకూలంగానే ఉంటుంది. పొదుపులు, మదుపులు
ప్రారంభిస్తారు. పిల్లల నుంచి శుభవార్త వింటారు. శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. మిత్రులతో విభేదాలు సమసిపోతాయి. ఉద్యోగం మారటానికి ఇది సమయం
కాదు. వృత్తి వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి.

Note: ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం..

మరిన్ని జ్యోతిష్య కథనాలు చదవండి..