జూన్ 3 రాశిఫలాలు: ఈ రాశి నిరుద్యోగులకు ఆఫర్లు వచ్చే ఛాన్స్..మీ రాశికి ఇలా..

దిన ఫలాలు (జూన్ 3, 2026): బుధవారం మేషం నుంచి మీనం వరకు 12 రాశుల వారికి గ్రహాల సంచారం అనుకూల, ప్రతికూల ప్రభావాలను చూపనుంది. కొందరికి ఉద్యోగ, వ్యాపార రంగాల్లో పురోగతి, ఆదాయ వృద్ధి అవకాశాలు కనిపిస్తుండగా, మరికొందరు కీలక నిర్ణయాల్లో జాగ్రత్త వహించడం మంచిది. నిరుద్యోగులకు కొత్త అవకాశాలు లభించే సూచనలు ఉన్నాయి. ఈ రోజు మీ రాశి ఫలితం ఎలా ఉందో తెలుసుకోండి.

జూన్ 3 రాశిఫలాలు: ఈ రాశి నిరుద్యోగులకు ఆఫర్లు వచ్చే ఛాన్స్..మీ రాశికి ఇలా..
Rashifal In Telugu 03 June 2026

Edited By:

Updated on: Jun 03, 2026 | 5:45 AM

దిన ఫలాలు (జూన్ 3, 2026): మేష రాశి వారికి ఆదాయ వృద్ధి మార్గాలు పెరుగుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు ఆశించిన స్థాయిలో కలిసివస్తాయి. వృషభ రాశి వారు ఉద్యోగంలో వారి పనితీరుతో అధికారుల్ని ఆకట్టుకుంటారు. వ్యాపారాల్లో పెట్టుబడులు పెంచే ఆలోచనలు చేస్తారు. మిథున రాశి వారికి ఉద్యోగంలో బాధ్యతలు పెరుగుతాయి. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

వృత్తి, ఉద్యోగాల్లో అనుకూలతలున్నా పని భారం, ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. అదనపు బాధ్యతల వల్ల శ్రమాధిక్యత ఉంటుంది. ఆదాయ వృద్ధి మార్గాలు పెరుగుతాయి. వ్యాపారాల్లో కొద్దిగా శ్రమ ఉన్నా, ఊహించని ప్రతిఫలం ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు ఆశించిన స్థాయిలో కలిసివస్తాయి. ప్రయాణాలు లాభిస్తాయి. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది. విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగుతాయి.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

ఉద్యోగంలో మీ పనితీరుతో అధికారుల్ని ఆకట్టుకుంటారు. వ్యాపారాల్లో పెట్టుబడులు పెంచే ఆలోచనలు చేస్తారు. వృత్తి, వ్యాపారాలు బాగా లాభదాయకంగా సాగిపోతాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ముఖ్యమైన ప్రయత్నాలు నెరవేరుతాయి. బంధుమిత్రులతో సఖ్యత, సామరస్యం పెరుగుతాయి. విద్యార్థులకు శ్రమ తప్పకపోవచ్చు. నిరుద్యోగులకు ఆఫర్లు అందుతాయి. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగిపోతాయి.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

ఉద్యోగంలో బాధ్యతలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల పరిస్థితి బాగా ఆశాజనకంగా ఉంటుంది. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. దైవ కార్యాల్లో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యల్ని బాగా తగ్గించుకుంటారు. కొద్ది శ్రమతో ముఖ్యమైన వ్యవహారాలు పూర్తవుతాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. విద్యార్థులకు బాగానే ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు హుషారు కలిగిస్తాయి.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

ఉద్యోగంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. అదనపు బాధ్యతలు స్వీకరించాల్సి ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్లు అందుతాయి. వ్యాపారాల్లో పెట్టుబడులు పెంచడానికి అవకాశం ఉంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. సామాజికంగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఇంటా బయటా పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. విద్యార్థులు బాగా కష్టపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

ఉద్యోగంలో అధికారుల నుంచి ఒత్తిడి ఉంటుంది. ఆదాయానికి ఏమాత్రం లోటుండదు. వృత్తి, వ్యాపారాల్లో శ్రమాధిక్యత ఉన్నా ఫలితం ఉంటుంది. వ్యాపారాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఆర్థిక ప్రయత్నాల్లో ఆశించిన పురోగతి ఉంటుంది. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం మంచిది. నిరుద్యోగులు కొద్ది ప్రయత్నంతో మంచి ఉద్యోగం సంపాదించుకునే అవకాశం ఉంది. ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు. విద్యార్థులకు పరవాలేదు. ప్రేమ వ్యవహారాలు కొద్దిగా ఇబ్బంది కలిగిస్తాయి.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

వృత్తి, ఉద్యోగాల్లో అధికారులను పనితీరుతో ఆకట్టుకుంటారు. వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా, ఆశాజనకంగా పురోగమిస్తాయి. కొందరు ఇష్టమైన బంధువుల్ని కలుసుకుంటారు. మిత్రులు, సన్నిహితులతో విందులో పాల్గొంటారు. నిరుద్యోగులు మంచి ఉద్యోగంలో చేరే అవకాశం ఉంది. అదనపు ఆదాయ మార్గాలు సత్ఫలితాలనిస్తాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. విద్యార్థులకు శ్రమ తప్పకపోవచ్చు. ప్రేమ వ్యవహారాల్లో అపార్థాలు తలెత్తుతాయి.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

వృత్తి, ఉద్యోగాలు ప్రోత్సాహకరంగా, సంతృప్తికరంగా పురోగమిస్తాయి. ఆర్థిక పరిస్థితి అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. కుటుంబ వ్యవహారాలు చక్కబడతాయి. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు పూర్తిగా పరిష్కారమవుతాయి. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఉన్నతస్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. బంధువుల నుంచి ఆశించిన శుభవార్తలు వింటారు. చదువుల్లో విద్యార్థులు విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా పురోగతి చెందుతాయి. ఉద్యోగంలో పని భారం పెరిగి కొద్దిగా ఇబ్బంది పడతారు. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. అదనపు ఆదాయ మార్గాల నుంచి ఆశించిన ప్రయోజనాలు లభిస్తాయి. కానీ, అనవసర ఖర్చులు పెరుగుతాయి. దూర ప్రయాణాల్లో అనుకోని ఇబ్బందులు కలగవచ్చు. ముఖ్యమైన వ్యవహారాలు వ్యయ ప్రయాసలతో పూర్తవుతాయి. విద్యార్థులు బాగా కష్టపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు బాగా హ్యాపీగా సాగిపోతాయి.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

ఉద్యోగంలో అధికారులతో సమానంగా బాధ్యతలను నిర్వర్తించాల్సి వస్తుంది. దాదాపు ప్రతి ప్రయత్నమూ సఫలం అవుతుంది. ఆర్థిక వ్యవహారాలు సానుకూలంగా పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి చాలావరకు మెరుగుపడుతుంది. ఇతరులకు ఇతోధికంగా సహాయం చేసే స్థితికి చేరుకుంటారు. వృత్తి, వ్యాపారాలు ఆర్థిక సమస్యల నుంచి, నష్టాల నుంచి పూర్తిగా బయటపడతాయి. ఆరోగ్యానికి ఢోకా లేదు. విద్యార్థులు విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో అనుకూలతలు పెరుగుతాయి.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

ఉద్యోగంలో అధికారుల అండతో ఆశించిన పదోన్నతి లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో శ్రమాధిక్యత ఉన్నప్పటికీ లాభాలు పెరుగుతాయి. తల్లితండ్రుల జోక్యంతో ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది. ఆస్తి విలువ బాగా పెరిగే అవకాశం ఉంది. చిన్ననాటి మిత్రులతో విందుల్లో పాల్గొంటారు. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఆరోగ్యం బాగా అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు కష్టపడి విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు సంతృప్తికరంగా సాగిపోతాయి.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

వృత్తి, ఉద్యోగాల్లో సహోద్యోగుల నుంచి ఇబ్బందులు పడడం జరుగుతుంది. వ్యాపారాలు ఆశాజనకంగా పురోగమిస్తాయి. ఇంటా బయటా బాగా పని ఒత్తిడి ఉంటుంది. ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి. ముఖ్యమైన ప్రయత్నాలు చాలావరకు నెరవేరుతాయి. స్వల్ప అనారోగ్యంతో ఇబ్బంది పడతారు. కీలక వ్యవహారాలు శ్రమ మీద పూర్తవుతాయి. వృథా ఖర్చుల్ని తగ్గించుకోవాల్సి ఉంటుంది. విద్యార్థులకు శ్రమ పెరుగుతుంది. ప్రేమ వ్యవహారాల్లో చికాకులుంటాయి.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

ఉద్యోగాలు ఉత్సాహంగా, హుషారుగా సాగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో కీలకమైన నిర్ణయాలు చేపడతారు. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యల నుంచి జాగ్రత్తగా బయటపడతారు. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. ఆర్థికంగా ఆశించిన పురోగతి ఉంటుంది. ఒకటి రెండు దైవ కార్యాలకు ఆర్థికంగా సహాయపడతారు. ఆహార, విహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. ప్రస్తుతానికి ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు. విద్యార్థులకు పరవాలేదు. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి.

Follow Us