
దిన ఫలాలు (ఫిబ్రవరి 27, 2026): మేష రాశి వారు ఉద్యోగంలో శుభవార్తలు వినే అవకాశముంది. వ్యాపారాలు సానుకూలంగా సాగుతాయి. వృషభ రాశి వారికి ఉద్యోగంలో ప్రాధాన్యం ఏర్పడుతుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు బాగా పెరుగుతాయి. మిథున రాశి వారికి ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరిగినప్పటికీ ఆశించిన ప్రతిఫలం ఉంటుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?
ఉద్యోగంలో శుభవార్తలు వింటారు. వ్యాపారాలు సానుకూలంగా సాగుతాయి. వృత్తి జీవితం బిజీగా సాగిపోతుంది. ఇంటా బయటా అనుకూల వాతావరణం ఉంటుంది. అధికారులు ఆదర భావంతో వ్యవహరిస్తారు. ఆరోగ్యం చాలావరకు మెరుగ్గా ఉంటుంది. ఆదాయానికి మించిన ఖర్చులుం టాయి. అనుకోకుండా ప్రయాణాలు వాయిదా పడే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక వ్యవహారాలు, దైవ కార్యాల్లో పాల్గొంటారు. ఉద్యోగ, వివాహ ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది.
ఉద్యోగంలో ప్రాధాన్యం ఏర్పడుతుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు బాగా పెరుగుతాయి. ఇంటా బయటా అనుకూల వాతావరణం ఉంటుంది. వ్యక్తిగతంగా కొన్ని సమస్యలను సమయస్ఫూర్తితో పరిష్కరించుకుంటారు. సమాజంలో ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. స్నేహి తుల సహకారంతో పెండింగ్ పనుల్ని పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆరోగ్యం కుదుటపడుతుంది. కుటుంబ జీవితం సానుకూలంగా సాగిపోతుంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు.
ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరిగినప్పటికీ ఆశించిన ప్రతిఫలం ఉంటుంది. పనితీరుతో అధికారులను బాగా ఆకట్టుకుంటారు. వృత్తి, వ్యాపారాలు బాగా అనుకూలంగా ముందుకు సాగు తాయి. తలపెట్టిన పనులన్నీ సవ్యంగా జరిగిపోతాయి. తోబుట్టువులతో ఆస్తి వివాదం ఒకటి పరి ష్కారం కావచ్చు. కొందరు చిన్ననాటి మిత్రుల్ని కలుసుకుంటారు. నిరుద్యోగులకు కొత్త ఆఫర్లు అందుతాయి. కొందరు బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. ఉద్యోగులకు కొత్త ఆపర్లు అందుతాయి. వృత్తి, వ్యాపా రాల మీద శ్రద్ధ పెంచాల్సి ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేస్తారు. ఇంటి బాధ్యతల విషయంలో కొద్దిగా ఇబ్బందులుంటాయి. ఆస్తి, ఆర్థిక వ్యవహారాల్లో కొద్దిగా ఒత్తిడి ఉంటుంది. అతి కష్టం మీద పెండింగ్ పనుల్ని పూర్తి చేస్తారు. లాభాలకు, రాబడికి లోటుండదు. ఇంటా బయటా శ్రమకు గురవుతారు. జీవిత భాగస్వామి నుంచి శుభవార్తలు వింటారు. ఆరోగ్యం అనుకూలిస్తుంది.
ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో బాగా ఒత్తిడి ఉంటుంది. ఏ పని తలపెట్టినా వ్యయ ప్రయాసలు తప్పకపోవచ్చు. ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ, వృథా ఖర్చులు ఇబ్బంది పెడతాయి. నిరుద్యోగులు ఆశించిన శుభ వార్త వింటారు. కుటుంబంలో అనుకో కుండా ఒక శుభ పరిణామం చోటు చేసుకుంటుంది. వృత్తి, ఉద్యోగాలపరంగా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. కుటుంబంతో దైవ కార్యాల్లో పాల్గొంటారు.
వృత్తి, ఉద్యోగాల్లో ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి. వ్యాపారాల్లో లాభాలు ఆశాజనకంగా ఉంటాయి. వ్యక్తిగత సమస్యలు చాలావరకు తగ్గుముఖం పడతాయి. ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి. రావలసిన డబ్బు చేతికి అంది అవసరాలు తీరిపోతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు అనుకూలిస్తాయి. తలపెట్టిన ప్రతి పనీ విజయవంతంగా పూర్తవుతుంది. విద్యార్థులు పురోగతి సాధి స్తారు. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దు. ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు.
వృత్తి, ఉద్యోగాల్లో బాధ్యతలు మారే అవకాశం ఉంది. అధికారుల నుంచి ఆశించిన ఆదరణ లభి స్తుంది. ఇంటా బయటా చాలా వరకు అనుకూలతలు పెరుగుతాయి. వ్యాపారాల్లో మీరు చేపట్టిన మార్పులు సత్ఫలితాలనిస్తాయి. కుటుంబ సభ్యులతో ఇష్టమైన ఆలయాల్ని సందర్శిస్తారు. బంధు వులతో సఖ్యత పెరుగుతుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ఉద్యోగం మారే విషయంలో సానుకూల స్పందన లభిస్తుంది. కుటుంబ వ్యవహారాలు చక్కబడ తాయి.
వృత్తి, ఉద్యోగాల్లో మీ ప్రతిభా పాటవాలకు ఆశించిన గుర్తింపు లభిస్తుంది. మీ పనితీరుకు అధి కారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. అదనపు ఆదాయ మార్గాలు పెరిగి, ఆర్థిక సమస్యలు తగ్గుతాయి. వ్యాపారాల్లో లాభాలు నిలకడగా ఉంటాయి. పిల్లల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. జీవిత భాగస్వామి పురోగతి సాధిస్తారు. కుటుంబ వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణ యాలు తీసుకోవద్దు. నిరుద్యోగులకు ఆశించిన సమాచారం అందుతుంది. ఆరోగ్యం బాగుంటుంది.
వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం పెరుగుతుంది. అధికారులకు చేదోడు వాదోడుగా ఉంటారు. ఆర్థిక లావాదేవీలు ఆశించిన ఫలితాలనిస్తాయి. షేర్లు బాగా లాభిస్తాయి. అదనపు ఆదాయ మార్గాలు మీ ముందుకు వస్తాయి. మీ ప్రతిభకు డిమాండ్ పెరుగుతుంది. వ్యక్తిగత సమస్యలు చాలా వరకు పరిష్కారం అవుతాయి. వ్యాపారాలు అనుకూలంగా సాగిపోతాయి. కుటుంబంలో సుఖ సంతో షాలు వెల్లి విరుస్తాయి. భాగస్వాములతో విభేధాలు సమసిపోతాయి. ఆరోగ్యానికి ఢోకా ఉండదు.
వృత్తి, ఉద్యోగాల్లో కొన్ని ముఖ్యమైన శుభవార్తలు వింటారు. వ్యక్తిగత సమస్యల నుంచి కొద్దిగా విముక్తి లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో మార్పులు, చేర్పులు చేస్తారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఇంటా బయటా అనుకూల పరి స్థితులుంటాయి. ఆర్థిక లావాదేవీలు ఆశించిన ఫలితాలనిస్తాయి. బంధువుల ద్వారా ఆస్తి వివాదం సమసిపోతుంది. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. కుటుంబ సభ్యులతో దైవకార్యాల్లో పాల్గొంటారు.
వృత్తి, ఉద్యోగాల్లో శ్రమాధిక్యత ఉంటుంది. వ్యాపారాల్లో శ్రద్ధ పెంచాల్సి ఉంటుంది. కొద్దిపాటి వ్యయ ప్రయాసలు తప్పకపోవచ్చు. వ్యక్తిగత పనులు సంతృప్తికరంగా పూర్తి చేస్తారు. ఆరోగ్యం పరవాలే దనిపిస్తుంది. నిరుద్యోగులకు ఆశించిన సమాచారం అందుతుంది. కుటుంబ సభ్యులతో హ్యాపీగా గడుపుతారు. తోబుట్టువులతో వివాదాలు పరిష్కారమవుతాయి. పెళ్లి ప్రయత్నాలు అనుకూలంగా ఉండకపోవచ్చు. అదనపు ఆదాయ ప్రయత్నాలు మందగిస్తాయి. ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు.
ఉద్యోగంలో ఆదరాభిమానాలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో క్షణం కూడా తీరిక ఉండని పరి స్థితి ఏర్పడుతుంది. కొత్త కార్యక్రమాలు, ప్రాజెక్టులు చేపడతారు. ఆర్థిక ప్రయత్నాలు విజయ వంత మవుతాయి. ఆదాయ మార్గాలు ఆశించిన ఫలితాలనిస్తాయి. చిన్ననాటి మిత్రులతో ఎంజాయ్ చేస్తారు. గృహ, వాహన సౌకర్యాల మీద దృష్టి పెడతారు. బంధువుల నుంచి శుభవార్తలందు తాయి. ఆర్థిక పరిస్థితి చాలావరకు నిలకడగా ఉంటుంది. ఆరోగ్యానికి భంగమేమీ ఉండదు.