ఆగస్టు 29 రాశిఫలాలు: ఈ రాశుల వారికి ఉద్యోగ, ఆదాయ విషయాల్లో శుభవార్తలు..!

దిన ఫలాలు (ఆగస్టు 29, 2026): శనివారం 12 రాశుల వారికి గ్రహాల ప్రభావం ఎలా ఉండబోతోంది? మేష రాశి వారికి ఆర్థిక విషయాల్లో అనుకూలతతో పాటు ప్రయత్నాల్లో విజయాలు లభించే అవకాశం ఉంది. వృషభ రాశి వారికి ఉద్యోగంలో ప్రోత్సాహం, ఆదరణ లభిస్తాయి. మిథున రాశి వారికి ఆదాయ వృద్ధికి అవకాశాలు కనిపిస్తున్నాయి. మేషం నుంచి మీనం వరకు 12 రాశుల శనివారం రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

ఆగస్టు 29 రాశిఫలాలు: ఈ రాశుల వారికి ఉద్యోగ, ఆదాయ విషయాల్లో శుభవార్తలు..!
Horoscope Today 29 August 2026

Edited By:

Updated on: Aug 29, 2026 | 6:00 AM

దిన ఫలాలు (ఆగస్టు 29, 2026): మేష రాశి వారికి ఆర్థిక విషయాలకు సమయం బాగా అనుకూలంగా ఉంది. ఏ ప్రయత్నమైనా సఫలమవుతుంది. వృషభ రాశి వారికి ఉద్యోగంలో ఆశించిన ప్రోత్సాహం,ఆదరణ లభిస్తాయి. వృత్తి జీవితం సాఫీగా, సంతృప్తికరంగా సాగుతుంది. మిథున రాశి వారికి ఆదాయ వృద్ధికి అవకాశాలు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాలు సాఫీగా సాగిపోతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

ఆర్థిక విషయాలకు సమయం బాగా అనుకూలంగా ఉంది. ఏ ప్రయత్నమైనా సఫలమవుతుంది. ఆస్తిపాస్తుల విలువ పెరుగుతుంది. ఆదాయం ఆశించిన దాని కంటే బాగా పెరిగే అవకాశం ఉంటుంది. పిల్లలు బాగా వృద్ధిలోకి రావడం జరుగుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు సంతృప్తి కరంగా సాగుతాయి. విలాసాల మీద ఖర్చు చేసే అవకాశం ఉంటుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ప్రముఖులతో లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. రావలసిన సొమ్ము చేతికి అందుతుంది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

ఉద్యోగంలో ఆశించిన ప్రోత్సాహం, ఆదరణ లభిస్తాయి. వృత్తి జీవితం సాఫీగా, సంతృప్తికరంగా సాగుతుంది. వ్యాపారాలు నిలకడగా పురోగమిస్తాయి. నిరుద్యోగులకు మంచి ఆఫర్ అందే అవకాశం ఉంది. బంధుమిత్రులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. మాట తొందర వల్ల కుటుంబంలో వివా దాలు, అపార్థాలకు అవకాశం ఉంది. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. బంధువుల రాకపోక లుంటాయి. ఇంటా బయటా ఒత్తిడి కాస్తంత ఎక్కువగా ఉంటుంది. ఆశించినశుభవార్తలు వింటారు.

ఇవి కూడా చదవండి

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

ఆదాయ వృద్ధికి అవకాశాలు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాలు సాఫీగా సాగిపోతాయి. ఉద్యోగ వాతావరణం కూడా చాలావరకు అనుకూలంగా ఉంటుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ, అను కోని ఖర్చులు మీద పడతాయి. పిల్లల చదువుల పట్ల శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఉంటుంది. జీవిత భాగస్వామికి మంచి గుర్తింపు లభిస్తుంది. దైవ కార్యాలకు ఆర్థికంగా సహాయపడతారు. స్నేహితుల సహాయంతో కీలకమైన పనులను పూర్తి చేస్తారు. ప్రయాణాల వల్ల లాభం ఉంటుంది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

ఉద్యోగంలో ప్రాధాన్యం, ప్రాభవం పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో పెట్టుబడులకు తగిన లాభాలు అందుతాయి. కొద్ది ప్రయత్నంతో ఆర్థిక పరిస్థితి చాలావరకు మెరుగుపడుతుంది. ముఖ్యమైనఆస్తి, ఆర్థిక వ్యవహారాలను పట్టుదలగా పూర్తి చేస్తారు. పిల్లల చదువులకు సంబంధించి సంతృప్తికర మైన సమాచారం అందుకుంటారు. గృహ, వాహన సౌకర్యాల మీద దృష్టి సారిస్తారు. ఆరోగ్యం పర వాలేదు. ఇంటా బయటా కొద్దిగా ఒత్తిడి ఉంటుంది. ఎవరికీ వాగ్దానాలు చేయకపోవడం మంచిది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

ఒకటి రెండు ముఖ్యమైన ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవుతాయి. ఆదాయ వృద్ధి సూచ నలున్నాయి. ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో కొద్దిగా ఆర్థిక సమస్య లున్నప్పటికీ, లాభాలకు లోటుండకపోవచ్చు. ఆర్థికంగా సమయం కాస్తంత అనుకూలంగా ఉంది. ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేయడం మీద శ్రద్ధ పెట్టడం మంచిది. ఇతరుల బాధ్యతలను మోయడం వల్ల ఫలితం ఉండదు. కుటుంబ సభ్యులతో సరదాగా, ఆనందంగా కాలక్షేపం చేస్తారు.

కన్య (ఉత్తర 1,2,3, హస్త, చిత్త 1,2)

ఉద్యోగంలో ఒత్తిడి ఉన్నప్పటికీ, సకాలంలో, సంతృప్తికరంగా బాధ్యతల్ని నిర్వర్తిస్తారు. వృత్తి, వ్యాపా రాల్లో కూడా అంచనాల్ని అందుకుంటారు. ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది. పిల్లలు చదువుల్లోనూ, పోటీ పరీక్షల్లోనూ ఘన విజయాలు సాధిస్తారు. జీవిత భాగస్వామి నుంచి కూడా శుభవార్తలు అందుతాయి. స్నేహితుల నుంచి ఆర్థిక సహాయం కోసం ఒత్తిడి ఉంటుంది. ముఖ్య మైన వ్యవహారాలు, పనులు సునాయాసంగా పూర్తవుతాయి. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

ఉద్యోగంలో బాగా అనుకూల వాతావరణం ఉంటుంది. జీతభత్యాలు, ప్రమోషన్ వంటి విషయాలకు సంబంధించి శుభవార్తలు వింటారు. వృత్తి, వ్యాపారాల్లో రాబడి పెరుగుతుంది. ఒత్తిడి ఎక్కువగానే ఉన్నా ఆశించిన ప్రతిఫలం ఉంటుంది. బంధుమిత్రులతో కాస్తంత ఆలోచించి మాట్లాడడం మంచిది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. వృథా ఖర్చులకు కళ్లెం వేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు సహాయంగా నిలబడతారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. వ్యక్తిగత సమస్య పరిష్కారం అవుతుంది.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

వృత్తి, ఉద్యోగాల్లో అవకాశాలు పెరుగుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఇష్టమైన బంధుమిత్రులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. ప్రముఖుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందు తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉండి, దీర్ఘకాలిక రుణాలు సైతం తీర్చగలుగుతారు. చేపట్టిన వ్యవ హారాలు కొద్ది ప్రయత్నంతో పూర్తవుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. జీవిత భాగస్వామికి ధన లాభం కలుగుతుంది. ఎవరికీ హామీలు ఉండవద్దు.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

ఉద్యోగంలో అధికారులు ప్రత్యేక బాధ్యతలు అప్పగిస్తారు. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగిపో తాయి. మితిమీరిన ఔదార్యంతో ఇతరులకు సహాయం చేస్తారు. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది కానీ, ఆధ్యాత్మిక కార్యక్రమాల మీద ఎక్కువగా ఖర్చు చేయడం జరుగుతుంది. ఆరోగ్యం అనుకూ లంగా ఉంటుంది. జీవిత భాగస్వామికి గుర్తింపు లభిస్తుంది. నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్ అందే అవకాశం ఉంది. బంధువర్గంలో మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. ప్రయాణాలు లాభిస్తాయి.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

ఉద్యోగంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. వృత్తి, వ్యాపారాలు మరింత అనుకూ లంగా పురోగతి చెందుతాయి. చేపట్టిన పనుల్లో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. జీవిత భాగ స్వామితో కలిసి దైవ దర్శనాలు చేసుకుంటారు. నిరుద్యోగులు తమకు లభించిన ఉద్యోగావకాశా లను సద్వినియోగం చేసుకోవడం మంచిది. దూరపు బంధువుల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. పిల్లలు విజయాలు సాధిస్తారు.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

వృత్తి, ఉద్యోగాల్లో బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కు తాయి. ఆదాయం వృద్ధి చెందుతుంది. ముఖ్యమైన పనులు, వ్యవహారాలు చురుకుగా సాగు తాయి. బంధుమిత్రులతో సఖ్యత పెరుగుతుంది. ఇష్టమైన ఆలయాలను సందర్శిస్తారు. దూర ప్రయాణాలు వాయిదాపడే అవకాశం ఉంది. ఇంటా బయటా బాధ్యతలు పెరుగుతాయి. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఆదాయానికి, ఆరోగ్యానికి ఢోకా ఉండదు.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

వృత్తి, ఉద్యోగాలలో చిన్నా చితకా సమ స్యలను అధిగమిస్తారు. కుటుంబసమేతంగా ఆలయాలు సందర్శిస్తారు. పిల్లలు విజయాలు సాధిస్తారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఆర్థిక సమస్యల నుంచి కొద్దిగా బయటపడతారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆర్థిక లావాదేవీలు, షేర్లు, స్పెక్యులేషన్లు బాగా లాభిస్తాయి. జీవిత భాగస్వామి నుంచి శుభవార్తలు వింటారు. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. నిరుద్యోగులకు సమయం అనుకూలంగా ఉంది.

(గమనిక: ఈ రాశిఫలాలు, జ్యోతిష్య అంచనాలు సాధారణ గ్రహస్థితులు, జ్యోతిష్య విశ్వాసాల ఆధారంగా మాత్రమే ఇవ్వబడుతున్నాయి. ఇవి వ్యక్తిగత జాతకం లేదా శాస్త్రీయ ఆధారాలపై ఆధారపడినవి కావు. ముఖ్యమైన ఆర్థిక, ఆరోగ్య, ఉద్యోగ లేదా వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.)

Loading...
Unable to load recommendations.
Follow Us