
Telugu Astrology
ఫిబ్రవరి 6, 7, 8 తేదీల్లో రెండు మహా యోగాలు చోటు చేసుకుంటున్నాయి. జ్యోతిషశాస్త్రంలో అత్యంత ప్రాధాన్యం, ప్రాముఖ్యం కలిగిన బుధాదిత్య యోగం, గజకేసరి యోగం చోటు చేసుకుంటుండడం వల్ల కొన్ని రాశులవారి జీవితాల్లో సానుకూల మార్పులు, శుభ పరిణామాలు సంభవించే అవకాశం ఉంది. వృషభ రాశిలో ఉచ్ఛ చంద్రుడు, గురువుల కలియక వల్ల అద్భుతమైన గజకేసరి యోగం ఏర్పడుతుండగా, మకర రాశిలో రవి, బుధులు కలవడం వల్ల బుధాదిత్య యోగం ఏర్పడుతుంది. ఇందులో బుధాదిత్య యోగం ఫిబ్రవరి 27 వరకూ కొనసాగుతుండగా, గజ కేసరి యోగం మాత్రం ఆ మూడు రోజులకే పరిమితం అవుతుంది. గజకేసరి యోగం వల్ల ధనాభివృద్ధి, బుధాదిత్య యోగం వల్ల కార్యసిద్ధి, వ్యవహార జయం కలుగుతాయి. మేషం, వృషభం, కర్కాటకం, కన్య, వృశ్చికం, మకర రాశుల వారికి ఇవి యోగాలు కలిగిస్తాయి.
- మేషం: ఈ రాశికి ధన స్థానంలో గజకేసరి యోగం, దశమ స్థానంలో బుధాదిత్య యోగం చోటు చేసుకో వడం వల్ల ఉద్యోగంలోనే కాక, వృత్తి, వ్యాపారాల్లో సైతం శుభ పరిణామాలు సంభవిస్తాయి. ఉద్యో గంలో భారీ జీతాలతో కూడిన పదోన్నతి లభించే అవకాశం ఉంది. ఉద్యోగులకు డిమాండ్ బాగా పెరుగుతుంది. వారి ప్రతిభాపాటవాలకు, సమర్థతకు, నైపుణ్యాలకు ఆశించిన గుర్తింపు లభిస్తుంది. ధన స్థానంలో గజకేసరి యోగం కలగడం వల్ల ఈ రాశివారి ఆదాయం బాగా వృద్ధి చెందే అవకాశం ఉంది.
- వృషభం: ఇదే రాశిలో గజకేసరి యోగం చోటు చేసుకోవడం, భాగ్య స్థానంలో బుధాదిత్య యోగం సంభవిం చడం వల్ల ఈ రాశివారికి అనేక విజయాలు, సాఫల్యాలు అనుభవానికి వస్తాయి. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాల్లో విదేశీ అవకాశాలు ఎక్కువ సంఖ్యలో అందివస్తాయి. ఏ ప్రయత్నం చేపట్టినా సఫలం అవుతుంది. అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది. కొద్ది ప్రయత్నంతో సంపన్నుల జాబితాలో చేరిపోతారు. తండ్రి వైపు నుంచి ఆస్తిపాస్తులు, సంపద లభించే అవకాశం కూడా ఉంది.
- కర్కాటకం: ఈ రాశికి సప్తమ స్థానంలో బుధాదిత్య యోగం, లాభ స్థానంలో గజకేసరి యోగం ఏర్పడినందువల్ల సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి నిశ్చయం అయ్యే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహా రాలు పెళ్లికి దారితీస్తాయి. విదేశీయాన యోగం, విదేశాల్లో సంపాదించే యోగం కలుగుతాయి. వృత్తి, వ్యాపారాలు విశేషంగా అభివృద్ధి చెందుతాయి. వృత్తి, ఉద్యోగాలరీత్యా విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. ఉద్యోగంలో రాజయోగాలు కలుగుతాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది.
- కన్య: ఈ రాశికి పంచమ స్థానంలో బుధాదిత్య యోగం, భాగ్య స్థానంలో గజకేసరి యోగం ఏర్పడుతు న్నందు వల్ల నిరుద్యోగులకు, ఉద్యోగులకు ఎక్కువగా విదేశీ ఆఫర్లు అందే అవకాశం ఉంది. షేర్లు, లాటరీలు, వడ్డీ వ్యాపారాలు, ఇతర ఆర్థిక లావాదేవీలు బాగా కలిసి రావడం జరుగుతుంది. తండ్రి నుంచి ఆస్తిపాస్తులు లభిస్తాయి. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కార మవు తాయి. సొంత ఇంటి ప్రయత్నాలు నెరవేరుతాయి. ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి.
- వృశ్చికం: ఈ రాశికి తృతీయ స్థానంలో బుధాదిత్య యోగం, సప్తమ స్థానంలో గజకేసరి యోగం ఏర్పడుతు న్నందువల్ల ఉన్నత స్థాయి వ్యక్తులతో లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. చాలా కాలంగా పెండింగులో ఉన్న పనులు, వ్యవహారా లన్నీ పూర్తయి, ఊరట కలుగుతుంది. ఉద్యోగంలో ఉన్నత పదవులు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాలు నష్టాల నుంచి బయటపడతాయి. అనేక మార్గాల్లో ఆదాయం పెరిగే అవకాశం ఉంది.
- మకరం: ఈ రాశిలో బుధాదిత్య యోగం, పంచమ స్థానంలో గజకేసరి యోగం కలగడం వల్ల వీరికి ఉద్యోగ పరంగా రాజయోగాలు కలుగుతాయి. ఉద్యోగులకు విపరీతంగా డిమాండ్ పెరుగుతుంది. సామాజి కంగా కూడా గౌరవమర్యాదలు వృద్ధి చెందుతాయి. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీల వల్ల దాదాపు కనక వర్షం కురుస్తుంది. నిరుద్యోగులకు అరుదైన అవకాశాలు లభిస్తాయి. ఉన్నత స్థాయికి చెందిన కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది. ప్రతిభకు ఆశించిన గుర్తింపు లభిస్తుంది.