Astrology: మకర రాశిలో బుధుడి.. ఆ రాశుల వారికి సమస్యల నుంచి విముక్తి

| Edited By: Janardhan Veluru

Jan 11, 2025 | 1:30 PM

ఈ నెల(జనవరి) 24వ తేదీ నుంచి ఫిబ్రవరి 11 వరకు బుధుడు మకర రాశిలో సంచారంచేయబోతున్నాడు. దీని వల్ల కొన్ని రాశుల వారికి కొన్ని ముఖ్యమైన సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. ఆర్థిక సమస్యలు, ఉద్యోగ సమస్యలు, ఆస్తి సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి ముఖ్యమైన సమస్యలకు పరిష్కారం కనుగొనే అవకాశం ఉంది.

Astrology: మకర రాశిలో బుధుడి.. ఆ రాశుల వారికి సమస్యల నుంచి విముక్తి
Telugu Astrology
Follow us on

ఈ నెల 24వ తేదీ నుంచి ఫిబ్రవరి 11 వరకు మకర రాశిలో సంచారంచేయబోతున్న బుధుడి వల్ల కొన్ని రాశుల వారికి కొన్ని ముఖ్యమైన సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. ఆర్థిక సమస్యలు, ఉద్యోగ సమస్యలు, ఆస్తి సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి ముఖ్యమైన సమస్యలకు పరిష్కారం కనుగొనే అవకాశం ఉంది. ముఖ్యంగా మేషం, వృషభం, కర్కాటకం, కన్య, తుల, మకర రాశుల వారికి అనేక సమస్యల నుంచి, ఒత్తళ్ల నుంచి విముక్తి లభించే అవకాశం ఉంది. ఈ రాశులవారు ఆటంకాలను అధిగమించి పురోగతి సాధించడానికి కూడా అవకాశం లభిస్తుంది.

  1. మేషం: ఈ రాశికి దశమ స్థానంలో బుధ సంచారం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఊహించని అభివృద్ధి కలుగుతుంది. ప్రతిభకు, సమర్థతకు ఆశించిన గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగంలో మరింతగా ఎద గడం మీద దృష్టి కేంద్రీకరిస్తారు. వృత్తి, వ్యాపారాల్లో కొద్దిపాటి మార్పులు, చేపట్టి బాగా లాభం పొందే అవకాశం ఉంది. నిరుద్యోగులు పోటీ పరీక్షల్లో, ఇంటర్వ్యూలలో విజయాలు సాధిస్తారు. వృత్తి, ఉద్యోగాల రీత్యా ఇతర దేశాలకు వెళ్లే అవకాశం కలుగుతుంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది.
  2. వృషభం: ఈ రాశికి అత్యంత శుభుడైన బుధుడు భాగ్య స్థానంలో సంచారం చేయడం వల్ల విదేశీయానానికి సంబంధించిన ఆటంకాలు తొలగిపోతాయి. నిరుద్యోగులకు, ఉద్యోగులకు విదేశాల నుంచి ఆఫర్లు అందుతాయి. విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నవారికి స్థిరత్వం కలుగుతుంది. అనేక విధాలుగా ఆదాయం పెరిగే అవకాశం ఉంది. తండ్రి వల్ల ఆర్థిక, ఆస్తి లాభాలు కలుగుతాయి. విదేశాల్లో స్థిర పడిన వ్యక్తితో పెళ్లి సంబంధం కుదురుతుంది. న్యాయపరమైన చిక్కులన్నీ పరిష్కారమవుతాయి.
  3. కర్కాటకం: ఈ రాశికి సప్తమంలో బుధుడి సంచారం వల్ల వృత్తి, వ్యాపారాల్లో దూసుకుపోతారు. అనేక సమ స్యల నుంచి బయటపడతారు. వ్యక్తిగత, ఆర్థిక సమస్యల పరిష్కారం లభిస్తుంది. ఆర్థికపరంగా జీవితంలో కొన్ని సానుకూల మార్పులకు అవకాశం ఉంది. పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలలో ఘన విజయాలు సాధిస్తారు. లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. సొంత ఇంటి కల నెరవేరే అవకాశం ఉంది. ఆరోగ్యంలో ఆశించిన మెరుగుదల కనిపిస్తుంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది.
  4. కన్య: రాశినాథుడు బుధుడు పంచమ స్థానంలో సంచారం చేయడం వల్ల ప్రతిభా సామర్థ్యాలు బాగా వృద్ధి చెందుతాయి. పని చేస్తున్న సంస్థలకు బాగా ఉపయోగపడతారు. కొద్ది ప్రయత్నంతో ఆర్థిక సమస్యలు చాలావరకు పరిష్కారం అవుతాయి. ఆర్థికంగా బాగా అభివృద్ది సాధిస్తారు. కోర్టు కేసుల్లో విజయాలు సాధిస్తారు. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమయ్యే అవకాశం ఉంది. సంతాన యోగానికి అవకాశం ఉంది. బంధుమిత్రులు మీ సలహాలు, సూచనల వల్ల లబ్ధి పొందుతారు.
  5. తుల: ఈ రాశికి అత్యంత శుభుడైన బుధుడు చతుర్థ స్థానంలో సంచారం వల్ల కొద్ది ప్రయత్నంతో సొంత ఇంటి కల నెరవేరుతుంది. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమవుతాయి. ఆస్తిపాస్తుల విలువ పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో ఆటంకాలను అధిగమించి పదోన్నతులు పొందుతారు. నిరుద్యోగులు ఇంటర్వ్యూలలో ఘన విజయాలు సాధిస్తారు. వృత్తి, ఉద్యోగాల రీత్యా విదేశాలకు అనేక పర్యాయాలు వెళ్లడం జరుగుతుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు వృద్ధి చెందుతాయి.
  6. మకరం: ఈ రాశికి భాగ్యాధిపతి అయిన బుధుడు ఇదే రాశిలో సంచారం చేయడం వల్ల వృత్తి, ఉద్యోగాల్లోనే కాక, సామాజికంగా కూడా బాగా వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. కొత్త ప్రయత్నాలు, కొత్త నిర్ణయాలు తప్పకుండా ఆశించిన ఫలితాలనిస్తాయి. విదేశీయాన సమస్యలన్నీ తొలగిపోతాయి. తండ్రి నుంచి సిరిసంపదలు లభిస్తాయి. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశాల నుంచి ఆఫర్లు అందుతాయి. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. ఆదాయానికి లోటుండదు.