
జ్యోతిషశాస్త్రంలో బుధుడిని గ్రహాలకు రాకుమారుడు అంటారు. జ్యోతిషశాస్త్రంలో బుధ గ్రహ సంచారాన్ని ముఖ్యమైనదిగా భావిస్తారు. ఎందుకంటే బుధుడు తెలివితేటలు, వ్యాపారం, తర్కం మొదలైన వాటికి కారకుడు. ఇతర గ్రహాల మాదిరిగానే బుధుడు కూడా రాశులను, నక్షత్రాలను ఒక నిర్ణీత సమయంలో మార్చుకుంటాడు. ఈ నేపధ్యంలో బుధుడు ఉత్తర భాద్రపద నక్షత్రంలోకి ప్రవేశించాడు. ఉత్తరాభాద్రపద నక్షత్రం 26వ నక్షత్రం. ఉత్తరాభాద్రపద నక్షత్రం మీన రాశి కిందకు వస్తుంది.
ఉత్తరభాద్రపద నక్షత్రంలోకి బుధుడు ప్రవేశం
ఉత్తరాభాద్రపద నక్షత్ర అధిపతి శనీశ్వరుడు. మార్చి 2న ఉదయం 12:15 గంటలకు బుధుడు ఉత్తర భాద్రపద నక్షత్రంలోకి ప్రవేశించాడు. శని దేవుడికి , బుధుడికి మధ్య స్నేహపూర్వక సంబంధం ఉందని జ్యోతిషశాస్త్రం పేర్కొంది. కనుక ఉత్తరాభాద్ర నక్షత్రంలో బుధ సంచారము కొన్ని రాశుల వ్యక్తుల అదృష్టాన్ని ప్రకాశవంతం చేస్తుంది. అకస్మాత్తుగా ఆర్థిక లాభం కలిగే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారంలో పురోగతిని పొందుతారు. అటువంటి పరిస్థితిలో ఈ రోజు ఆ అదృష్ట రాశులు ఏమిటో తెలుసుకుందాం..
వృషభ రాశి:
ఉత్తరాభాద్రపద నక్షత్రంలో బుధ సంచారము వృషభ రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ కాలంలో వృషభ రాశి వారు అసంపూర్ణమైన పనులు పూర్తి చేస్తారు. కోర్టు కేసుల్లో విజయం సాధించే అవకాశం ఉంది. విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు.
కర్కాటక రాశి:
ఉత్తరాభాద్రపద నక్షత్రంలో బుధ సంచారము కర్కాటక రాశి వారి జీవితాల్లో సానుకూల మార్పులను తెస్తుంది. ఈ సమయంలో కెరీర్‌లో కొత్త అవకాశాలు లభించే అవకాశం ఉంది. ఈ రాశికి చెందిన వారు ఉద్యోగంలో బోనస్ పొందుతారు. వ్యాపారంలో లాభాలు అందుకుంటారు.
ధనుస్సు రాశి:
ఉత్తరాభాద్రపద నక్షత్రంలో బుధ సంచారం ధనుస్సు రాశి వారికి శుభప్రదం. కుటుంబంలో ఆనందం నెలకొంటుంది. వివాహానికి సంబంధించిన శుభవార్త వింటారు. వ్యాపారస్తులు తమ పెట్టుబడులతో ప్రయోజనాలను పొందే అవకాశం ఉంది. వ్యాపారవేత్తలు తమ వ్యాపారంలో లాభం పొందవచ్చు. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది.
సింహ రాశి:
ఉత్తరాభాద్రపద నక్షత్రంలో బుధ సంచారము సింహ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ఈ కాలంలో సింహ రాశి వారి ధైర్యం పెరిగే అవకాశం ఉంది. నిర్ణయాలలో విశ్వాసం ప్రతిబింబిస్తుంది. ఆర్థిక పరిస్థితులు బాగుంటాయి.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు