Budh Gochar: కర్కాటక రాశిలోకి బుధుడు.. ఆ రాశుల వారికి కొత్త శభ యోగాలు..!

| Edited By: Janardhan Veluru

Aug 16, 2024 | 6:42 PM

చాలా రోజులుగా సింహ రాశిలో వక్ర సంచారం చేస్తున్న బుధుడు ఈ రాశిలో తిరోగమనం చెంది, ఈ నెల 23 నుంచి మళ్లీ కర్కాటక రాశిలో ప్రవేశిస్తోంది. ఇక్కడ సెప్టెంబర్ 4 వ తేదీ వరకూ కొనసాగుతుంది. బుధుడికి వేగం పెరగడం, పైగా కర్కాటకం వంటి చర రాశిలో సంచారం వల్ల కొన్ని రాశుల వారికి శీఘ్ర పురోగతి ఉంటుంది. జీవితంలో ఆకస్మిక మార్పులు చోటు చేసుకునే అవకాశం కూడా ఉంటుంది.

Budh Gochar: కర్కాటక రాశిలోకి బుధుడు.. ఆ రాశుల వారికి కొత్త శభ యోగాలు..!
Budh Gochar 2024
Follow us on

చాలా రోజులుగా సింహ రాశిలో వక్ర సంచారం చేస్తున్న బుధుడు ఈ రాశిలో తిరోగమనం చెంది, ఈ నెల 23 నుంచి మళ్లీ కర్కాటక రాశిలో ప్రవేశిస్తోంది. ఇక్కడ సెప్టెంబర్ 4 వ తేదీ వరకూ కొనసాగుతుంది. బుధుడికి వేగం పెరగడం, పైగా కర్కాటకం వంటి చర రాశిలో సంచారం వల్ల కొన్ని రాశుల వారికి శీఘ్ర పురోగతి ఉంటుంది. జీవితంలో ఆకస్మిక మార్పులు చోటు చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. వ్యక్తిగత, ఆర్థిక, ఆస్తి సమస్యల పరిష్కారం మీద బుధుడు ఎక్కువగా శ్రద్ధ పెట్టడం జరుగుతుంది. మిథునం, కర్కాటకం, కన్య, తుల, మకరం, మీన రాశుల వారికి కొత్త యోగాలు పట్టే అవకాశం ఉంది.

  1. మిథునం: రాశ్యధిపతి బుధుడు మళ్లీ ధన స్థానంలోకి ప్రవేశిస్తున్నందువల్ల ఆదాయం క్రమంగా పెరుగుతూ, ఆర్థిక సమస్యలను తగ్గించే అవకాశం ఉంటుంది. ధన స్థానంలోని బుధుడు తప్పకుండా బ్యాంక్ బ్యాలెన్స్ ను పెంచడం జరుగుతుంది. ఉద్యోగంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంటుంది. లాభదాయక పరిచయాలు ఏర్పడ తాయి. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లి విరుస్తాయి. షేర్లు, స్పెక్యులేషన్ల వల్ల లాభం ఉంటుంది.
  2. కర్కాటకం: ఈ రాశిలో బుధుడి ప్రవేశం వల్ల ఉద్యోగ ప్రయత్నాలు, వ్యాపార ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి. కుటుంబ జీవితంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వివిధ రంగాలకు చెందిన ప్రము ఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఉద్యోగంలో ప్రతిభా పాటవాలకు, శక్తి సామర్థ్యాలకు మంచి గుర్తింపు లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో కొత్త పద్ధతులు, మార్పులు ప్రవేశపెట్టి లాభాలు పెంచు కుంటారు. ప్రయాణాల వల్ల లాభం పొందుతారు. వృథా ఖర్చులు తగ్గించుకుని పొదుపు పాటిస్తారు.
  3. కన్య: రాశ్యధిపతి బుధుడు లాభ స్థానంలో సంచారం ప్రారంభిస్తున్నందువల్ల వృత్తి, వ్యాపారాల్లో క్షణం కూడా తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. ఉద్యోగంలో జీతభత్యాలు, వృత్తి, వ్యాపారాల్లో లాభాలు బాగా పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగంలో తప్పకుండా హోదా పెరిగే సూచనలున్నాయి. నిరుద్యో గులకు దూర ప్రాంతంలో ఆశించిన ఉద్యోగం లభిస్తుంది. మరింత మంచి ఉద్యోగంలోకి మారడానికి అవకాశం ఉంది. మనసులోని ఒకటి రెండు కోరికలు నెరవేరుతాయి. వ్యక్తిగత సమస్యలు తగ్గుతాయి.
  4. తుల: ఈ రాశికి దశమ స్థానంలో బుధ సంచారం వల్ల ఉద్యోగపరంగా పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. ఆదాయానికి లోటుండదు. షేర్లు, వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది. నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. ఉద్యోగులకు కూడా డిమాండ్ పెరుగుతుంది. ప్రతిభా పాటవాలను, నైపుణ్యాలను పెంచుకుంటారు. ఉద్యోగరీత్యా విదేశీ ప్రయాణాలు చేయవలసి వస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో నష్టాలు తగ్గి లాభాలు పెరిగే అవకాశం ఉంది. లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి.
  5. మకరం: ఈ రాశికి సప్తమ స్థానంలో బుధ సంచారం వల్ల వృత్తి, వ్యాపారాలు లాభాలతో కళకళల్లాడిపోతాయి. ఉద్యోగ, ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి చాలావరకు విముక్తి లభిస్తుంది. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో ప్రేమలో పడడం, పెళ్లి నిశ్చయం కావడం వంటివి జరుగుతాయి. విదేశీయానానికి, విదేశాల్లో ఉద్యోగాలకు సంబంధించిన ఆటంకాలు తొలగిపోతాయి. జీవిత భాగ స్వామికి కూడా ధన యోగాలు పట్టే అవకాశం ఉంది. ఆర్థికంగా బాగా బలం పుంజుకుంటారు.
  6. మీనం: ఈ రాశికి పంచమ స్థానంలో బుధ సంచారం వల్ల ప్రతిభా పాటవాలకు ఆశించిన గుర్తింపు లభి స్తుంది. పిల్లల నుంచి శుభ వార్తలు వింటారు. సంతాన యోగానికి అవకాశం ఉంది. కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వృత్తి, వ్యాపారాలు బాగా రాణిస్తాయి. ఉద్యోగ జీవితం కొత్త పుంతలు తొక్కుతుంది. ప్రేమవ్యవహారాల్లో విజయం సాధిస్తారు. మంచి పరిచయాలు ఏర్పడ తాయి. అనారోగ్యం నుంచి చాలావరకు ఉపశమనం లభిస్తుంది. తల్లితండ్రుల సహాయం లభిస్తుంది.