జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు, రాశుల కదలికలు ప్రతి వ్యక్తి జీవితంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. గ్రహాల కదలికలు అన్ని రాశులపై శుభ, అశుభ ప్రభావాలను కలిగి ఉంటాయి. అయితే జ్యోతిష్య శాస్త్రంలో కూడా వీటన్నింటిని ఎదుర్కోవడానికి మార్గాలు ఉన్నాయి. అదే సమయంలో న్యూమరాలజీ అనేది జ్యోతిషశాస్త్రంలో ఒక ముఖ్యమైన విభాగం. ఒక వ్యక్తి జీవితానికి సంబంధించిన అనేక విషయాలు న్యూమరాలజీలో ప్రస్తావించారు. న్యూమరాలజీ ప్రకారం పుట్టిన తేదీని బట్టి వ్యక్తి స్వభావం, ప్రవర్తన, భవిష్యత్తు, మరెన్నో తెలుసుకోవచ్చు. సంఖ్యాశాస్త్రంలో ఒక వ్యక్తి జీవితంలోని ఒడిదుడుకులతో పాటు భవిష్యత్తులో జరగబోయే విషయాలను జనన సంఖ్య ఆధారంగా తెలుసుకోవచ్చు.
ఉదాహరణకు ఎవరైనా నెలలోని 9, 18 లేదా 27వ తేదీల్లో జన్మించినట్లయితే.. వారి జనన సంఖ్య 9. అదే విధంగా అన్ని తేదీలు లెక్కిస్తారు. ఈ రోజు మనం నెల 2, 11 లేదా 20 తేదీల్లో పుట్టిన స్త్రీల వ్యక్తిత్వం గురించి తెలుసుకుందాం.. ఈ తేదీలో పుట్టిన యువతి జనన సంఖ్య 2. ఈ జనన సంఖ్య గల మహిళలు న్యూమరాలజీ ప్రకారం జీవిత భాగస్వామికి మాత్రమే కాదు మొత్తం కుటుంబానికి కూడా చాలా అదృష్టవంతులు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..
Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)