Telugu News Astrology Avoid Giving These Items as Gifts: They May Cause Serious Problems
ఈ వస్తువులు ఎవరికీ గిఫ్ట్‌గా ఇవ్వకండి.. పెద్ద సమస్యలు రావచ్చు!
Items Not To Gift: బహుమతులు ప్రేమ, కృతజ్ఞతను వ్యక్తపరచడానికి మంచి మార్గం. కానీ వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని వస్తువులు బహుమతిగా ఇస్తే ఆర్థిక సమస్యలు లేదా సంబంధాల్లో అపార్థాలు రావచ్చని నిపుణులు చెబుతున్నారు. అందుకే కొన్ని వస్తువులను గిఫ్ట్‌గా ఇవ్వడంలో జాగ్రత్త అవసరం అని అంటారు.
సందర్భం ఏదైనా మనకు మన ప్రేమను వ్యక్తపరచడానికి, కృతజ్ఞత చూపించడానికి బహుమతులు ఒక మంచి మార్గం. పెళ్లిళ్లు, గృహప్రవేశాలు, పుట్టినరోజులు వంటి సందర్భాల్లో మనకు నచ్చినవి లేదా ఉపయోగపడే వస్తువులు ఇచ్చి ఆనందాన్ని పంచుకుంటాం. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని వస్తువులను బహుమతిగా ఇవ్వడం మంచిదికాదని నిపుణులు చెబుతున్నారు. అలాంటి వస్తువులు ఇచ్చితే ఆర్థిక సమస్యలు, సంబంధాల్లో అపార్థాలు వచ్చే అవకాశం ఉందని విశ్వాసం ఉంది. చాలామందికి ఈ విషయంపై అవగాహన ఉండదు. కానీ కొన్ని వస్తువులను బహుమతిగా ఇవ్వడం వలన ప్రయోజనం కంటే ప్రతికూల ఫలితాలు ఎక్కువగా ఉండొచ్చని అంటారు. మరి అలాంటి బహుమతులు ఏవి అనేది చూద్దాం.
వాస్తు ప్రకారం ఇవ్వకూడని బహుమతులు
పదునైన వస్తువులు: కత్తెరలు, కత్తులు వంటి పదునైన వస్తువులను బహుమతిగా ఇవ్వడం మంచిది కాదు. ఇవి సంబంధాల్లో దూరం పెంచుతాయని, గొడవలకు కారణమవుతాయని భావిస్తారు.
నలుపు రంగు వస్తువులు: నలుపు రంగు వస్తువులను బహుమతిగా ఇవ్వడం ప్రతికూల శక్తిని పెంచుతుందని వాస్తు నమ్మకం.
కృత్రిమ పూలు: తాజా పూలు ఇవ్వడం శుభప్రదం. కానీ ప్లాస్టిక్ లేదా ఆర్టిఫిషియల్ పూలు ఇవ్వడం మంచిదికాదని చెబుతారు.
లెదర్ వస్తువులు: తోలుతో తయారైన పర్సులు, బ్యాగులు వంటి వాటిని బహుమతిగా ఇవ్వడం ప్రతికూల ప్రభావాన్ని కలిగిస్తుందని విశ్వాసం ఉంది.
నీటికి సంబంధించిన వస్తువులు: అక్వేరియం లేదా వాటర్ ఫౌంటెన్ వంటి వస్తువులను బహుమతిగా ఇవ్వడం అనుకూలం కాదని భావిస్తారు.
గడియారాలు: గడియారాలను బహుమతిగా ఇవ్వడం కొన్నిసార్లు సంబంధాల్లో దూరాన్ని సూచిస్తుందని వాస్తు నమ్మకం.
చేతి రుమాలు: హ్యాండ్‌కర్చీఫ్‌ను బహుమతిగా ఇవ్వడం వల్ల అపార్థాలు లేదా చిన్న తగాదాలు పెరిగే అవకాశం ఉందని అంటారు.
ముళ్ల మొక్కలు: ముళ్లు ఉన్న మొక్కలను ఇవ్వడం ప్రతికూల శక్తిని తీసుకువస్తుందని వాస్తు ప్రకారం చెబుతారు.
పులుపు సంబంధిత పదార్థాలు (పచ్చళ్లు): ఇవి బంధాల్లో చేదు పెంచుతాయని కొందరి నమ్మకం.
అద్దం: వాస్తు శాస్త్రంలో అద్దాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. అవి సానుకూల, ప్రతికూల శక్తులను ప్రతిబింబిస్తాయని నమ్మకం ఉంది. అందువల్ల అద్దాన్ని బహుమతిగా ఇవ్వడం కొంతమంది శుభంగా భావించరు. అద్దాలు జీవితంలో అదృష్టంపై ప్రభావం చూపుతాయని, కొన్ని సందర్భాల్లో సంబంధాలలో అపార్థాలు లేదా ఉద్రిక్తతలకు కారణమవుతాయని కూడా చెబుతారు. ముఖ్యంగా జంటలు లేదా వివాహితులకు ఆలోచించకుండా అద్దం బహుమతిగా ఇస్తే వారి మధ్య విభేదాలు లేదా దూరం పెరగవచ్చని విశ్వాసం.
చివరగా.. బహుమతులు ఎప్పుడూ ప్రేమతో, శుభాశయాలతో ఇవ్వాలి. అందుకే ఎలాంటి వస్తువును ఇవ్వాలన్నా ఆలోచించి, ఆ వ్యక్తికి ఉపయోగపడే, సానుకూల భావన కలిగించే వాటిని ఎంచుకోవడం మంచిది.
(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం జ్యోతిష్యం, మతం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.)