Telugu Astrology: రవి, శనుల యుతి.. ఆ రాశుల వారు ఆ విషయాల్లో కాస్త జాగ్రత్త!

Astrology Alert: మార్చి 1 నుండి 14 వరకు రవి, శని గ్రహం కుంభ రాశిలో యుతి చెందనుంది. దీని ప్రభావం కారణంగా కొన్ని రాశుల వారు కొన్ని కీలక విషయాల్లో కాస్త జాగ్రత్త వహించాలి. ఆర్థిక నష్టాలు, ఆరోగ్య సమస్యలు, వైవాహిక విభేదాలు, ఉద్యోగంలో ఇబ్బందులు వంటివి సంభవించే అవకాశం ఉంది. ప్రతికూల ప్రభావాలను తగ్గించుకోవడానికి ఆదిత్య హృదయం పారాయణం చేయడం మంచిది.

Telugu Astrology: రవి, శనుల యుతి.. ఆ రాశుల వారు ఆ విషయాల్లో కాస్త జాగ్రత్త!
Telugu Astrology

Edited By: Janardhan Veluru

Updated on: Feb 23, 2025 | 7:12 PM

మార్చి 1వ తేదీ నుంచి మార్చి 14వ తేదీ వరకు రవి, శనులు మాత్రమే కుంభ రాశిలో యుతి చెందడం జరుగుతోంది. జ్యోతిషశాస్త్రం ప్రకారం శనీశ్వరుడికి రవి తండ్రి. అయితే, ఈ రెండు గ్రహాలు బద్ధ శత్రువులు. ఈ రెండు గ్రహాల కలయిక వల్ల కొన్ని రాశులకు రాజయోగం పట్టే అవకాశం ఉంది కానీ, మిథునం, కర్కాటకం, సింహం, తుల, కుంభ, మీన రాశుల వారు మాత్రం కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. తండ్రితో అకారణ వైరం, అధికారులతో ఇబ్బందులు, ప్రభుత్వ మూలక ధన వ్యయం, నమ్మక ద్రోహం, రహస్య శత్రువులు వంటి కొన్ని అవయోగాలు కలిగే అవకాశం ఉంది. ఈ రాశివారు ప్రతి రోజూ ఆదిత్య చదువుకోవడం వల్ల కొంత విముక్తి లభిస్తుంది.

  1. మిథునం: ఈ రాశికి భాగ్య స్థానంలో రవి, శనుల యుతి జరుగుతున్నందువల్ల కష్టార్జితంలో ఎక్కువ భాగం ఏదో విధంగా నష్టపోవడం, దుర్వినియోగం కావడం జరుగుతుంది. ఆస్తి విషయాల్లో తండ్రితో విభే దాలు తలెత్తే అవకాశం ఉంది. తండ్రి ఆరోగ్యం ఆందోళన కలిగించే అవకాశం కూడా ఉంది. నిరు ద్యోగులకు విదేశీ అవకాశాలు లభిస్తాయి కానీ, అవి సంతృప్తికరంగా ఉండే అవకాశం లేదు. దూర ప్రయాణాల మీద వృథాగా ఖర్చు చేయడం జరుగుతుంది. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం మంచిది.
  2. కర్కాటకం: ఈ రాశికి ఎనిమిదవ స్థానంలో ఈ రెండు గ్రహాలు కలవడం వల్ల ఆస్తి వివాదాలు చోటు చేసుకుంటాయి. రావలసిన డబ్బు ఒక పట్టాన చేతికి అందదు. మిత్రుల వల్ల ఆర్థికంగా నష్టపోయే అవ కాశం ఉంది. జీవిత భాగస్వామి ఆరోగ్యం ఇబ్బంది కలిగిస్తుంది. ఉద్యోగంలో పదోన్నతులు ఆగి పోయే అవకాశం ఉంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు బాగా నిరాశ కలిగిస్తాయి. రహస్య శత్రువులు తయారవుతారు. కొందరు దుష్ప్రచారం సాగించే అవకాశం ఉంది. ఆదాయం తగ్గుతుంది.
  3. సింహం: రాశ్యధిపతి రవి సప్తమంలో శనీశ్వరుడితో కలిసినందువల్ల ప్రతి విషయంలోనూ తేలికగా మోస పోయే లేదా నష్టపోయే అవకాశం ఉంటుంది. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు ప్రతికూలంగా పరిష్కారమవడం జరుగుతుంది. వైవాహిక జీవితంలో ఊహించని సమస్యలు తలెత్తుతాయి. పెళ్లి సంబం ధాలు వెనుకపట్టు పడతాయి. ప్రతిభకు తగ్గ ఉద్యోగం లభించకపోవచ్చు. తండ్రితో అకారణ వైరాలు కలుగుతాయి. అనారోగ్యాలు ఇబ్బంది పెడతాయి. ఆర్థిక లావాదేవీల వల్ల నష్టపోవడం జరుగుతుంది.
  4. తుల: ఈ రాశికి పంచమ స్థానంలో రవి శనుల యుతి జరుగుతున్నందువల్ల తానొకటి తలచిన దైవ మొకటి తలచును అన్నట్టుగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో పొరపాట్లు జరిగే అవకాశం ఉంది. అధికారుల నుంచి విమర్శలు, వేధింపులు ఎదురయ్యే సూచనలున్నాయి. పిల్లల వల్ల సమస్యలు కలుగుతాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో ఆటంకాలు తప్పకపోవచ్చు. ఆస్తి వివాదాలు కొద్దిగా ముదిరిపోయే అవకాశం ఉంది. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించవలసి వస్తుంది.
  5. కుంభం: ఈ రాశిలో రవి శనుల యుతి వల్ల అడపాదడపా కీలక నిర్ణయాలను కూడా మార్చుకోవడం జరుగుతుంది. మాట నిలకడ ఉండకపోవచ్చు. వృత్తి, వ్యాపారాల్లో కొద్దిపాటి నష్టాలకు అవకాశం ఉంది. ఉద్యోగంలో అధికారుల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. తొందరపడి వేటిలోనూ పెట్టు బడులు పెట్టకపోవడం మంచిది. అంచనాలు తప్పిపోతాయి. ఆరోగ్యం మీదా, ఆదాయం మీదా శ్రద్ధ పెట్టడం మంచిది. ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు. జీవిత భాగస్వామితో జాగ్రత్తగా ఉండడం అవసరం.
  6. మీనం: ఈ రాశికి 12వ స్థానంలో, అంటే వ్యయ స్థానంలో రవి శనుల కలయిక వల్ల రహస్య శత్రువుల వల్ల ఇబ్బందులు పడడం జరుగుతుంది. మిత్రులు కూడా శత్రువులుగా మారే అవకాశం ఉంది. ఆర్థిక లావాదేవీల్లో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. డబ్బు ఇవ్వడం, తీసుకోవడం పెట్టుకో వద్దు. ప్రయాణాల మీద డబ్బు వృథా అవుతుంది. కష్టార్జితంలో ఎక్కువ భాగం నష్టపోయే సూచనలున్నాయి. ఆదాయ ప్రయత్నాల్లో శ్రమ ఎక్కువ ఫలితం బాగా తక్కువగా ఉంటుంది.