Zodiac Signs: సింహరాశికి పెరిగిన ప్రాధాన్యం.. ఆ రాశుల వారికి పట్టందల్లా బంగారం.. వారికి తీవ్ర నష్టం తథ్యం..!

| Edited By: Janardhan Veluru

Jul 24, 2023 | 6:51 PM

Zodiac Signs: గ్రహ సంచారం ప్రకారం ప్రస్తుతం సింహ రాశికి ప్రాధాన్యం పెరిగిపోయింది. ఆరు గ్రహాల ప్రభావం ఈ రాశి మీద పడడం జరిగింది. ఈ రాశిలో ఇప్పటికే శుక్ర, బుధ, కుజ గ్రహాల సంచారం జరుగుతుండగా, శని దృష్టి, రాహువుతో కలిసిన గురు దృష్టి కూడా ఈ రాశి మీద పడింది.

Zodiac Signs: సింహరాశికి పెరిగిన ప్రాధాన్యం.. ఆ రాశుల వారికి పట్టందల్లా బంగారం.. వారికి తీవ్ర నష్టం తథ్యం..!
Leo
Follow us on

Zodiac Signs: గ్రహ సంచారం ప్రకారం ప్రస్తుతం సింహ రాశికి ప్రాధాన్యం పెరిగిపోయింది. ఆరు గ్రహాల ప్రభావం ఈ రాశి మీద పడడం జరిగింది. ఈ రాశిలో ఇప్పటికే శుక్ర, బుధ, కుజ గ్రహాల సంచారం జరుగుతుండగా, శని దృష్టి, రాహువుతో కలిసిన గురు దృష్టి కూడా ఈ రాశి మీద పడింది. ఈ రకమైన గ్రహ స్థితి ఆగస్టు 8వ తేదీ వరకూ కొనసాగబోతోంది. దీని ప్రభావం వివిధ రాశుల మీద వివిధ రకాలుగా ఉండబోతోంది. సహజంగానే కొన్ని రాశుల వారికి బాగుండడం, కొన్ని రాశులవారికి బాగు లేకపోవడం జరుగుతుంది. ప్రతికూల ఫలితాలు అనుభవానికి వచ్చే రాశుల వారు ఆదిత్య హృదయం పారాయణం చేయడం వల్ల ఈ ప్రతికూల ఫలితాలు తగ్గే అవకాశం
ఉంటుంది.

  1. మేషం: ఈ రాశివారికి ఈ గ్రహ కూటమి అయిదవ ‍స్థానంలో అంటే ఆలోచనా స్థానంలో చోటు చేసుకుం టోంది. ప్రతి విషయంలోనూ ఎంతో ప్రణాళికాబద్ధంగా వ్యవహరించడానికి వీలుంది కానీ, తానొకటి తలచిన దైవమొకటి తలచును అన్నట్టుగా వీరు అనుకున్న పనులు అనుకున్నట్టు జరగక పోవచ్చు. పనులు సకాలంలో, సంతృప్తికరంగానే పూర్తవుతాయి కానీ, వీరి అనుకున్నట్టు మాత్రం జరగవు. వీరి ఆలోచనలు, సలహాలు, సూచనలు ఇతరులకు మాత్రం బాగా ఉపయోగపడతాయి.
  2. వృషభం: ఈ రాశివారికి నాలుగవ స్థానం మీద ఈ ఆరు గ్రహాల ప్రభావం పడుతోంది. దీనివల్ల గృహ, వాహన సౌకర్యాలకు సంబంధించిన ఆటంకాలు తొలగుతాయి. వ్యక్తిగత వ్యవహారాలు, కుటుంబ వ్యవహారా లలో కొద్దిగా గందరగోళ పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది. ఉద్యోగంలో సహోద్యోగులు కుట్రలకు పాల్పడే అవకాశం ఉంది. కీలకమైన వ్యవహారాల విషయంలో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడుతుంది. తమకు అందివచ్చే ఆఫర్లలో దేనిని ఎంపిక చేసుకోవాలో నిరుద్యోగులకు అర్థం కాదు.
  3. మిథునం: ఈ రాశివారికి ఈ కూటమి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా అది సఫలం అవుతుంది. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. ఆర్థిక బలం పెరుగుతుంది. ఉద్యోగ సంబంధమైన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఆశించిన శుభవార్తలు అందుతాయి. అను కున్న పనులు చాలావరకు పూర్తవుతాయి. అయితే, సొంత ఆలోచనలు, నిర్ణయాలపై ఆధారప డడం మంచిది. ఇతరులు తప్పుదోవ పట్టించే ప్రమాదం ఉంది. ప్రయాణాల వల్ల లాభం ఉంటుంది.
  4. కర్కాటకం: కుటుంబ వ్యవహారాల్లో గందరగోళ పరిస్థితి చోటు చేసుకుంటుంది. కుటుంబ సభ్యులు ఇష్టారాజ్యంగా వ్యవహరించడం, క్రమశిక్షణ తగ్గడం వంటివి జరిగే అవకాశం ఉంటుంది. ఆర్థిక వ్యవహా రాల్లో ఆచితూచి అడుగు వేస్తున్న సమయంలో విలాసాల మీద ఖర్చు చేయడం జరుగుతుంది. మీ మాటలు అవతలివారికి తిట్లుగా వినిపిస్తాయి. ఆర్థిక ప్రయత్నాలు తారుమారు అవుతాయి. కాగా, వృత్తి, ఉద్యోగాల్లోనే కాక, సామాజికంగా కూడా మీ మాట చెల్లుబాటు అవుతుంది.
  5. సింహం: ఈ రాశివారికి అనేక ఆఫర్లు, అనేక అవకాశాలు ఒకేసారి కలిసి వచ్చే అవకాశం ఉంది. వీటిలో దేనిని సద్వినియోగం చేసుకోవాలో తెలియని పరిస్థితి ఏర్పడుతుంది. ఉద్యోగంలోనే కాక, వృత్తిలో కూడా అనేక పనులను ఒకేసారి చక్కబెట్టాల్సి వస్తుంది. ఎంత ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని ప్రయత్నించినా అది సాధ్యం కాదు. వ్యక్తిగత సమస్యల విషయంలో ఒత్తిడి పెరుగుతుంది. ఎవరు స్నేహితులో, ఎవరు శత్రువులో తేల్చుకోలేని పరిస్థితి తలెత్తుతుంది. ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది.
  6. కన్య: ఆదాయంలో స్థిరత్వం ఏర్పడినప్పటికీ, ఖర్చులు అదుపు తప్పి అవస్థలు పడడం జరుగుతుంది. వృత్తి, ఉద్యోగాలలో సహోద్యోగులు కుట్రలు, కుతంత్రాలకు పాల్పడే అవకాశం ఉంది. అధికారులు అలవికాని లక్ష్యాలను అప్పగించే సూచనలున్నాయి. ఆకస్మిక ప్రయాణాలకు అవకాశముంది. ఒక కంపెనీలో ఉద్యోగానికి ప్రయత్నం చేస్తుండగా, ఏమాత్రం ప్రయత్నం చేయని మరొక కంపెనీ నుంచి ఆఫర్ రావడం జరుగుతుంది. ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
  7. తుల: ఈ రాశివారికి లాభ స్థానం మీద ఆరు గ్రహాల ప్రభావం ఉన్నందువల్ల ఆదాయ మార్గాలు అనుకూలించడం, అనేక మార్గాలలో ధన సంపాదన జరగడం, అనుకోకుండా పేరు ప్రఖ్యాతులు పెర గడం, పిల్లలకు సంబంధించి శుభవార్తలు వినడం వంటివి చోటు చేసుకుంటాయి. వృత్తి, ఉద్యోగాల్లో అనూహ్యమైన పురోగతి ఉంటుంది. ఉద్యోగంలో అధికార యోగానికి అవకాశం ఉంది. వ్యాపారా లలో ఆశించిన దాని కంటే ఎక్కువ అభివృద్ధి చోటు చేసుకుంటుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి.
  8. వృశ్చికం: ఈ రాశివారికి కెరీర్ పరంగా అనూహ్యమైన పరిణామాలు చోటు చేసుకుంటాయి. అకస్మాత్తుగా ఉద్యోగం మారడం, ఆ ఉద్యోగంలో కూడా ఎక్కువ కాలం కొనసాగకపోవడం వంటివి జరుగుతాయి. నిరుద్యోగులకు అనేక అవకాశాలు కలిసి వస్తాయి. అనేక రకాల కెరీర్ల మీద దృష్టి పెట్టడం జరుగు తుంది. వివిధ రకాల ఆలోచనలు ముప్పిరిగొంటాయి. వృత్తి, ఉద్యోగాల్లో భారీ మార్పులకు అవ కాశం ఉంది. నాలుగు రోడ్ల కూడలిలో నిలబడినట్టుగా ఉంటుంది. ఏ ప్రయత్నమూ కలిసి రాదు.
  9. ధనుస్సు: ఈ రాశివారికి అప్రయత్న ధన లాభానికి అవకాశం ఉంది. ప్రయత్నాలు కలిసి రాకపోవచ్చు కానీ, అదృష్టం మాత్రం తప్పకుండా కలిసి వస్తుంది. వృత్తి, ఉద్యోగాల్లో తప్పకుండా అందలాలు ఎక్కు తారు. విదేశాల నుంచి కొత్త ఆఫర్లు అందుతాయి. విదేశీ ప్రయాణానికి సంబంధించిన సమస్యలు తొలగిపోయి, మార్గం సుగమం అవుతుంది. వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. విదేశాల్లో స్థిర పడిన పిల్లల నుంచి శుభవార్తలు అందుకుంటారు. అన్ని విధాలుగానూ ‍స్థిరత్వం లభిస్తుంది.
  10. మకరం: వృత్తి, ఉద్యోగాల పరంగా తప్పటడుగులు వేసే సూచనలున్నాయి. ఏ పరిస్థితీ నిలకడగా ఉండదు. ప్రయత్నాలు అనుకూలించవు. ప్రయత్నం చేయనప్పుడు అనుకూలంగా ఉంటుంది. శత్రువులు స్నేహితులవుతారు. కొందరు స్నేహితులు మోసం చేస్తారు. ఉద్యోగంలో మీ మాటల్ని తప్పుగా అర్థం చేసుకునేవారుంటారు. ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ, బంధువులతోనో, సహచరులతోనో సమస్యలు ఎదురవుతాయి. ఆరోగ్య నియమాలు పాటించినా స్వల్ప అనారోగ్యం తప్పకపోవచ్చు.
  11. కుంభం: అనుకున్నదొకటి అయిందొకటి అన్నట్టుగా ఉంటుంది పరిస్థితి. బాగా దగ్గర దాకా వచ్చిన పెళ్లి సంబంధాలు తప్పిపోయే అవకాశం ఉంది. నిరుద్యోగుల ప్రయత్నాలు కూడా చిక్కుల్లో పడతాయి. ఓర్పు సహనాలతో వ్యవహరించడం మంచిది. ఆర్థిక పరిస్థితి కూడా కొద్దిగా తారుమారయ్యే అవ కాశం ఉంది. వ్యక్తిగతంగా పెద్దగా సమస్యలు ఉండకపోవచ్చు కానీ, ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. జీవిత భాగస్వామితో అపార్థాలు చోటు చేసుకునే సూచనలున్నాయి. జాగ్రత్తగా ఉండడం మంచిది.
  12. మీనం: వృత్తి, ఉద్యోగాలలో బరువు బాధ్యతలు పెరిగినప్పటికీ, సకాలంలో లక్ష్యాలను పూర్తి చేస్తారు. ఊహించని బాధ్యతలు, లక్ష్యాలు మీద పడడం వల్ల కొద్దిగా ఒత్తిడికి గురవుతారు. అనుకోకుండా అనారోగ్యం నుంచి బయటపడతారు. శత్రువులు మిత్రులుగా మారతారు. ఆర్థిక సమస్యల నుంచి అప్రయత్నంగా విముక్తి లభిస్తుంది. బంధువర్గంతో సమస్యలు తలేత్తే అవకాశం ఉంది. ముఖ్య మైన వ్యవహారాలను ఒంటి చేత్తో పూర్తి చేస్తారు. శక్తి సామర్థ్యాలకు మంచి గుర్తింపు లభిస్తుంది.

Note: ఇక్కడ సమకూర్చిన సమాచారం వారివారి నమ్మకం, విశ్వాసాల మీద ఆధారపడి ఉంటుంది. దీన్ని నిర్ధారించేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని గమనించగలరు. పాఠకుల ఆసక్తిని, నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సమాచారాన్ని అందించాము.

మరిన్ని జ్యోతిష్య కథనాలు చదివేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.