ప్రతి వ్యక్తి తమ ఇంట్లో ఆనందం, శాంతి, శ్రేయస్సు ఉండాలని కోరుకుంటారు. అయితే కొన్నిసార్లు నిందలు, ప్రతికూలత కారణంగా ఇంట్లో చిన్న విషయాల్లో కూడా ఇబ్బందులు తలెత్తుతాయి. మానసికంగా ఆర్థికంగా బలహీనపడతారు. అంతేకాదు సంబంధాన్ని బలహీనపరుస్తుంది. ఇంటి పురోగతి, అభివృద్ధిపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. మీరు కూడా ఇదే విషయాలపై పోరాడుతున్నట్లయితే.. జ్యోతిషశాస్త్రంలోని ఈ సింపుల్ రెమెడీస్ తో ఇంట్లో ఏర్పడే ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు. జ్యోతిష్యశాస్త్రంలో ఇంట్లో 5 రకాల పువ్వులు నాటడం వల్ల ఆనందం, శాంతి లభిస్తుంది. ఇంట్లో డబ్బు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అవి ఏమిటో చూద్దాం..
ఇంట్లోని పూజ గదిలో తెల్లటి పువ్వులు:
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇంట్లో ఉన్న పూజా మందిరంలో తెల్లటి పువ్వులతో పూజ చేయండి. దేవుడిని అలంకరించండి. ఇలా చేయడం వల్ల ఆనందం, శాంతి లభిస్తుంది. అంతేకాదు కుటుంబ సంబంధాల మధ్య మాధుర్యాన్ని జోడిస్తుంది. ఇంట్లో జరుగుతున్న గొడవలకు ముగింపు లభిస్తాయి.
గజరాజు పువ్వులు
అనంత పుష్పాలను గజరాజ పుష్పాలు లేదా గోవర్ధనం పుష్పాలు అంటారు. జ్యోతిషశాస్త్రం ప్రకారం ఈ పువ్వులు సానుకూలతకు చిహ్నం. ఈ నందివర్ధనం పువ్వులతో పూజగదిలో ప్రతిరోజు దేవుడికి పూజ చేయాల్సి ఉంటుంది. దీంతో అమ్మవారు ప్రసన్నులవుతారు. డబ్బు ఇబ్బందులు తీరతాయి.
కరివేరు పువ్వు
జ్యోతిషశాస్త్రంలో,కరివేరు పువ్వులు గృహ సమస్యలను తొలగించడానికి ఉత్తమంగా పరిగణించబడుతున్నాయి. ఈ పువ్వును ప్రతిరోజూ ఇంట్లో ఉంచడం వల్ల శాంతి నెలకొంటుంది. పని ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇంట్లో, మరియు సంపద పెరుగుతుంది.
తెలుపు శంకు పుష్పం
అపరాజిక పుష్పం లేదా శంఖు పుష్పం తెలుపు , నీలం వంటి అనేక రంగులో ఉంటాయి. గుడిలో తెల్లటి శంఖు పుష్పాలను సమర్పించడం వల్ల భగవంతుని అనుగ్రహం లభిస్తుంది. ఇంట్లో సంతోషం, ఐశ్వర్యం పెరుగుతాయి.
తెల్లని తామర పువ్వు
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పూజగదిలో తెల్లటి కమలం ఆనందం, సంపదను అభివృద్ధి చేస్తుంది. ఇంట్లో సంపద, జ్ఞానం , శారీరక ఆనందం ఉన్నాయి. ఈ పుష్పాన్ని గుడిలో పూజ కోసం ఇవ్వడం వల్ల భార్యాభర్తల బంధానికి మధురానుభూతి చేకూరి, దాంపత్య జీవితం ఆనందమయం అవుతుంది.
కలువ పువ్వు
కలువ పువ్వు ఇంట్లో శాంతి , పరస్పర ప్రేమను పెంచుతుంది. ప్రతి రోజూ పూజ గదిలో కలువపూలను సమర్పించడం ద్వారా దైవిక శక్తి ప్రసరిస్తుంది. ఇది కుటుంబంలో ప్రేమను పెంచుతుంది. ఒత్తిడి దూరం చేస్తుంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం).