Lord Shani Dev: తగ్గిపోయిన శని దోషం ప్రభావం.. ఆ రాశుల వారికి శుభ యోగాలు..!

| Edited By: Janardhan Veluru

Jun 24, 2024 | 7:15 PM

ప్రస్తుతం కుంభ రాశిలో స్వస్థానంలో సంచారం చేస్తున్న శనీశ్వరుడి వల్ల కర్కాటకం, సింహం, వృశ్చికం, మకరం, కుంభం, మీన రాశులవారు ఏడాదిన్నరగా అనేక విధాలుగా ఇబ్బందులు పడడం జరుగుతోంది. నిజానికి, ఈ శని దోషం వచ్చే ఏడాది జూలై వరకూ కొనసాగే అవకాశం ఉన్నప్పటికీ, శుభ గ్రహాల అనుకూలతల వల్ల శని దోషం మధ్య మధ్య బాగా తగ్గడం జరుగుతుంది.

Lord Shani Dev: తగ్గిపోయిన శని దోషం ప్రభావం.. ఆ రాశుల వారికి శుభ యోగాలు..!
Lord Shani Dev
Follow us on

ప్రస్తుతం కుంభ రాశిలో స్వస్థానంలో సంచారం చేస్తున్న శనీశ్వరుడి వల్ల కర్కాటకం, సింహం, వృశ్చికం, మకరం, కుంభం, మీన రాశులవారు ఏడాదిన్నరగా అనేక విధాలుగా ఇబ్బందులు పడడం జరుగుతోంది. నిజానికి, ఈ శని దోషం వచ్చే ఏడాది జూలై వరకూ కొనసాగే అవకాశం ఉన్నప్పటికీ, శుభ గ్రహాల అనుకూలతల వల్ల శని దోషం మధ్య మధ్య బాగా తగ్గడం జరుగుతుంది. అందువల్ల శని దోషం పూర్తిగా రెండున్నర ఏళ్ల పాటు కొనసాగే అవకాశం లేదు. ప్రస్తుతం ఈ ఏడాది చివరి వరకూ గురు, శుక్ర, బుధుల అనుకూలత వల్ల ఈ రాశుల వారికి శని దోషం తగ్గి, శుభ యోగాలు పెరిగే అవకాశం ఉంది.

  1. కర్కాటకం: ఈ రాశివారికి అష్టమ శని దోషం వల్ల ప్రతి పనీ ఆలస్యం కావడం, రావలసిన డబ్బు చేతికి అందకపోవడం, ప్రతి బాకీ మొండి బాకీ కింద మారడం, పదోన్నతులు ఆగిపోవడం, ప్రయత్నాలు నెరవేరకపోవడం వంటివి జరుగుతాయి. అయితే, ప్రస్తుతం గురు, బుధ, శుక్రులు ఈ రాశికి బాగా అనుకూలంగా మారినందువల్ల ఇవేవీ జరగకపోవచ్చు. ఎక్కువగా శుభవార్తలు వినడం జరుగుతుంది. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది.
  2. సింహం: ఈ రాశికి సప్తమ స్థానంలో శని సంచారం వల్ల జీవితంలో ఒక విధమైన స్తబ్ధత ఏర్పడుతుంది. ఏ పనీ సవ్యంగా సాగక ఇబ్బందులు పడతారు. రావలసిన డబ్బు ఒక పట్టాన చేతికి అందదు. అనేక అవకాశాలు చేజారిపోతాయి. ప్రస్తుతం గురు, శుక్ర గ్రహాలు అనుకూలంగా మారడంతో ఈ శని దోషం బాగా తగ్గిపోయి, అన్ని పనులు సవ్యంగా పూర్తవుతాయి. ఆశావహ పరిస్థితి నెలకొంటుంది. అనారోగ్యాల నుంచి కూడా బయటపడతారు. గృహ, వాహన సౌకర్యాల మీద దృష్టి పెడతారు.
  3. వృశ్చికం: ఈ రాశికి చతుర్థ స్థానంలో శని సంచారం వల్ల అర్ధాష్టమ శని దోషం ఏర్పడింది. దీనివల్ల మన శ్శాంతి లోపించడం, సుఖ సంతోషాలు తగ్గడం, గృహ నిర్మాణాలు మందకొడిగా సాగడం, ఆస్తి వివాదాలు పరిష్కారం కాకపోవడం, అనారోగ్యాలు బాధించడం వంటివి జరుగుతాయి. అయితే, సప్తమంలో గురువు సంచారం వల్ల ఈ దోషం గణనీయంగా తగ్గిపోతుంది. ఎటువంటి చిక్కులు, సమస్యలున్నా తొలగిపోతాయి. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. ఆర్థిక స్థిరత్వం లభిస్తుంది.
  4. మకరం: ఈ రాశివారికి రెండవ స్థానంలో శని సంచారం ఏలిన్నాటి శని దోషం ఏర్పడింది. దీనివల్ల శరీర కష్టం ఎక్కువగా ఉంటుంది. కొద్దిపాటి ఆదాయానికి కూడా బాగా కష్టపడాల్సి ఉంటుంది. ముఖ్యమైన పనులు ఆలస్యం అవుతుంటాయి. శుభ కార్యాలు పెండింగులో పడతాయి. మరో అయిదు నెలల పాటు, గురువు, శుక్ర, బుధుల సంచారం అనుకూలంగా ఉండబోతున్నందువల్ల పరిస్థితులన్నీ బాగా మెరుగుపడతాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలించి ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి.
  5. కుంభం: ఈ రాశిలో శని సంచారం వల్ల ఈ రాశివారికి ఏలిన్నాటి శని దోషం ఏర్పడింది. దీనివల్ల ఆర్థిక నష్టాలు, వృథా ఖర్చులు, ప్రతిభకు గుర్తింపు లభించకపోవడం, ప్రతి పనీ ఆలస్యంగా పూర్తి కావ డం, నిరాశా నిస్పృహలు వంటివి జరుగుతుంటాయి. ప్రస్తుతం శుభ గ్రహాల అనుకూల సంచారం వల్ల సుఖ సంతోషాలు పెరుగుతాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఆదా యానికి లోటుండదు. ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది. ప్రతిభా పాటవాలు బాగా రాణిస్తాయి.
  6. మీనం: ఈ రాశికి వ్యయ స్థానంలో శని సంచారం సాగుతున్నందువల్ల ఏలిన్నాటి శని దోషం ఏర్పడింది. వ్యయ ప్రయాసలు ఎక్కువగా ఉంటాయి. కష్టార్జితంలో అధిక భాగం వృథా అవుతుంటుంది. వైద్య ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు ఒక పట్టాన కలిసి రావు. అయితే, రాశ్యధిపతి గురువు, సుఖ స్థానాధిపతి బుధుడు బాగా అనుకూలం అయినందువల్ల శుభ యోగాలు పట్టే అవకాశం ఉంది. ఆర్థికంగా బాగా పుంజుకోవడం జరుగుతుంది. అనారోగ్యాల నుంచి ఊరట లభిస్తుంది.