Zodiac Signs: కొత్త జంటలకు అదిరిపోయే శుభవార్త.. ఆ రాశులవారికి ఈ సంవత్సరం తప్పకుండా సంతాన యోగం..

| Edited By: Janardhan Veluru

Mar 20, 2023 | 3:46 PM

ఈ ఏడాది తప్పకుండా కొత్త దంపతులకు సంతానయోగం కలుగుతుంది. ఈ ఐదు రాశుల వారు సంతాన యోగానికి సంబంధించిన శుభవార్త ఎప్పుడు వింటారన్నది ఇక్కడ పరిశీలిద్దాం. 

Zodiac Signs: కొత్త జంటలకు అదిరిపోయే శుభవార్త.. ఆ రాశులవారికి ఈ సంవత్సరం తప్పకుండా సంతాన యోగం..
Zodiac Sign
Image Credit source: TV9 Telugu
Follow us on
ఈ మధ్యనే పెళ్లయిన భార్యాభర్తలకు ఒక శుభవార్త. ఈ భార్యాభర్తలు గనుక మేషం, మిధునం, సింహం, ధనస్సు, మీనరాశులకు చెందినవారు అయి ఉంటే ఈ ఏడాది వీరికి సంతానం కలగటం ఖాయం. సంతానానికి గురువు కారకుడు. ఈ ఐదు రాశులకు గురుగ్రహం సంతాన పరంగా అనుకూల రాశులలో సంచరించడం జరుగుతోంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం, రెండు ఐదు తొమ్మిది స్థానాలు సంతానానికి సంబంధించిన స్థానాలు. ఈ స్థానాలలో గురువు సంచరిస్తున్నప్పుడు సంతాన యోగానికి అవకాశం ఉంటుంది.   ఈ ఏడాది ఏప్రిల్ 23 వరకు గురువు మీన రాశి లోనూ, ఆ తరువాత మేషరాశిలోనూ సంచరిం చడం జరుగుతోంది. ఈ సంచారం పైన చెప్పిన ఐదు రాశులకు చాలావరకు అనుకూలంగా ఉంది. మేషరాశిలో ఈ ఏడాది ఏప్రిల్ 23న ప్రవేశిస్తున్న గురుగ్రహం వచ్చే ఏడాది ఏప్రిల్ 25 వరకు ఆ రాశి లోనే కొనసాగడం జరుగుతుంది. అందువల్ల ఏడాది తప్పకుండా కొత్త దంపతులకు సంతానయోగం కలుగుతుంది. ఈ ఐదు రాశుల వారు సంతాన యోగానికి సంబంధించిన శుభవార్త ఎప్పుడు వింటారన్నది ఇక్కడ పరిశీలిద్దాం.

మేష రాశి

ఈ రాశి వారు ఏప్రిల్ 23 తరువాత సంతానానికి సంబంధించిన శుభవార్త వినే అవకాశం ఉంది. మే, జూలై నెలల మధ్య వీరికి శుభవార్త అందవచ్చు. ప్రస్తుత గ్రహచారం ప్రకారం వీరికి పురుష సంతానం కలిగే అవకాశం ఉందని కూడా చెప్పవచ్చు. ఈ రాశి వారికి గురువు అనుగ్రహం బాగా ఉన్నందువల్ల ఆరోగ్యకరమైన సంతానం కలగవచ్చు. గురువుతో రాహు కలిసి ఉండబోతు న్నందువల్ల సిజేరియన్ జరిగే అవకాశం ఉంది. వైద్య ఖర్చులు ఎక్కువయ్యే సూచనలు కూడా ఉన్నాయి.

మిథున రాశి

ఈ రాశి వారు ఒకటి రెండు నెలల్లో సంతానానికి సంబంధించిన శుభవార్త వినే సూచనలున్నాయి. ముఖ్యంగా జూలై తరువాత అక్టోబర్ లోపల శుభవార్త అందే అవకాశం ఉంది. గ్రహ సంచారం ప్రకారం వీరికి ఆడపిల్ల కానీ కవలలు గానీ జన్మించడం జరుగుతుంది. ప్రసవ సమయంలో వైద్య పరమైన జోక్యం అవసరం కావచ్చు. ఆరోగ్యవంతమైన శిశువు జన్మించడం జరుగుతుంది. తల్లి ఆరోగ్యం మీద కొద్దిగా శ్రద్ధ పెట్టడం మంచిది.

సింహ రాశి

ఈ రాశి వారు మే నెల నుంచి సంతాన యోగానికి సంబంధించిన శుభవార్త వినవచ్చు. ఒకవేళ ఆలస్యం జరిగితే అక్టోబర్ తరువాత ఖాయంగా శుభవార్త వినడం జరుగుతుంది. గ్రహ సంచారం ప్రకారం వీరికి పురుష సంతానం కలిగే అవకాశం ఉంది. సాధారణంగా వీరికి సుఖ ప్రసవం జరుగుతుందని చెప్పవచ్చు. ఈ రాశి వారికి ఈ ఏడాది సంతానయోగం పడితే తల్లిదండ్రులకు అన్ని విధాలా కలిసి వస్తుంది. ఎటువంటి ఆరోగ్య సమస్య ఉండకపోవచ్చు.

ధనుస్సు రాశి

ఈ రాశి వారు అతి త్వరలో గానీ, నవంబర్ తరువాత కానీ తీపి కబురు వినే అవకాశం ఉంది. పంచమ స్థానంలో సంచరిస్తున్న గురు గ్రహం కారణంగా వీరికి పురుష సంతానం కలిగే అవకాశం ఉంది. తల్లికి గానీ, శిశువుకు గానీ ఆరోగ్య సమస్యలు తలెత్తక పోవచ్చు. సుఖ ప్రసవానికి ఎక్కువగా అవకాశం ఉంది. అయితే వైద్య ఖర్చులు మరీ ఎక్కువగా ఉండే సూచనలు ఉన్నాయి. ఈ రాశికి గురు గ్రహమే అధిపతి అయినందువల్ల సంతానానికి సంబంధించిన సమస్యలేవీ ఉండకపోవచ్చు.

మీన రాశి

ఈ ఏడాది మే నెల తరువాత ఈ రాశి మహిళలు గర్భం ధరించే అవకాశం ఉంది. ఆడపిల్ల పుట్టే సూచనలున్నాయి. సిజేరియన్ అవసరం రావచ్చు. తల్లి ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకో వాల్సి ఉంటుంది. ఈ రాశి నాథుడైన గురువు ఏప్రిల్ 23 నుంచి ద్వితీయ స్థానంలో సంచరిం చడం వల్ల తప్పకుండా సంతాన ప్రాప్తి, కుటుంబ వృద్ధి ఉంటాయని చెప్పవచ్చు. అయితే ఈ గురువుతో రాహు గ్రహం కలుస్తున్నందువల్ల అనుకోకుండా ప్రసవ ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. శిశువుకు ఆరోగ్య సమస్య ఉండక పోవచ్చు.

ముఖ్యమైన పరిహారాలు

సంతానం కోసం ఎదురుచూస్తున్న కొత్త జంటలు ఎక్కువగా శివపార్వతులను పూజించడం మంచిది. శివుడు, పార్వతి, వినాయకుడు, సుబ్రహ్మణ్యస్వామి లతో కూడిన బొమ్మను ఇంట్లో పూజా మందిరంలో పెట్టుకోవడం వల్ల శుభ ఫలితాలు అనుభవానికి వస్తాయి. భార్య గానీ, భర్త గానీ పుష్యరాగం పొదిగిన ఉంగరాన్ని ధరించడం వల్ల సత్సంతానం కలగటమే కాకుండా తల్లి బిడ్డ క్షేమంగా ఆరోగ్యంగా ఉండటం జరుగుతుంది. అంతేకాక, గురువారం రోజున ఒక పూట ఉపవాసం ఉండటం వల్ల కూడా ఆశించిన శుభ ఫలితాలు పొందటానికి అవకాశం ఉంటుంది.
Note: ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం
మరిన్ని జ్యోతిష్య కథనాలు చదవండి..