Today Horoscope: మనం ముందు వెనుక ఆలోచించకుండా తీసుకునే నిర్ణయాలతో ప్రమాదంలో పడుతుంటాం. అందుకే కొత్తపనిని మొదలు పెట్టాలన్నా, శుభకార్యాలు నిర్వహించాలన్నా జాతకాలు, రాశిఫలాలను అనుసరించేవారు చాలా మంది ఉన్నారు. అందుకే పనులను మొదలుపెట్టే ముందు కొంతమంది తమ జాతకం, దినఫలాలపై దృష్టి సారిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఈరోజు (డిసెంబర్ 3)న శుక్రవారం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..
మేష రాశి:
ఈ రాశి వారు మానసికంగా దృఢంగా ఉంటారు. ముఖ్యమైన వ్యవహారాలలో మీరు ఆశించిన ఫలితాలు వస్తాయి. అర్థలాభం సూచితం. దుర్గాస్తుతి చేయడం వల్ల మంచి ఫలితాలను పొందగలుగుతారు. అనుకున్న పనులు పూర్తవుతాయి.
వృషభ రాశి:
ఈ రోజు కీలక విషయాల్లో బుద్ధిబలం బాగా పనిచేస్తుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. ఇష్టదైవారాధన శుభప్రదం. అదృష్ట యోగం ఉంది. ఉద్యోగంలో ఉత్తమ స్థితి కనిపిస్తోంది.
మిథున రాశి:
ఈ రాశి వారు శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. గొప్ప భవిష్యత్తు కోసం మంచి ఆలోచనలు చేస్తారు. కుటుంబ సభ్యులకు శుభకాలం. కీలక సమయాల్లో ధైర్యంగా వ్యవహరిస్తారు. శివారాధన మంచిది. ఆర్థిక ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారులకు బాగుంది. ఆరో గ్యం పరవాలేదు. ఈ రోజు మీ తల్లి ఆరోగ్యంలో మంచి మార్పులు ఉంటాయి.
కర్కాటక రాశి:
కర్కాటక రాశి వారికి శారీరక శ్రమ కాస్త పెరుగుతుంది. బంధువులతో వాదులాటలకు దిగకపోవడమే మంచిది. ఉద్యోగంలోను, వ్యాపారంలోను మంచి అభివృద్ధి కనిపిస్తోంది. అనవసర ధనవ్యయం జరిగే సూచనలు ఉన్నాయి. మీ ధైర్యం, శక్తి రెట్టింపు పెరుగుతుంది.
సింహ రాశి:
వీరికి ఒక వ్యవహారంలో తోటివారి సాయం అందుతుంది. ఒక వ్యవహారంలో మీ పేరుప్రతిష్టలు పెరుగుతాయి. విందు,వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. హనుమాన్ చాలీసా పారాయణ మంచిది. వారికి క్షమాపణలు చెప్పే సూచనలు కూడా ఉన్నాయి.
కన్య రాశి:
ఈ రోజు ఎంత కష్టపడితే అంత ఫలితం వస్తుంది. ప్రారంభించిన పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తిచేస్తారు. అనవసర ఖర్చులు పెరుగుతాయి. అనవసర వ్యవహారాల్లో తలదూర్చకుండా ఉండటం మేలు. నారాయణ మంత్రాన్ని జపించాలి.
తుల రాశి:
ఈ రాశి వారికి మంచి కాలం నడుస్తోంది. ఒక ముఖ్య వ్యవహారంలో కుటుంబ సభ్యుల సంపూర్ణ సహకారం లభిస్తుంది. అవసరానికి ఆర్థిక సహకారం లభిస్తుంది. సూర్యాష్టకం చదివితే మంచిది. మీరు ఎవరికైనా అప్పు ఇవ్వబోతున్నట్లయితే, ఒకటికి రెండు సార్లు ఆలోచించి ఇవ్వడం మంచిది.
వృశ్చిక రాశి:
ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. దూరప్రయాణాలలో వాహన ఇబ్బందులుంటాయి. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంపై అప్రమత్తంగా వ్యవహరించాలి. చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగులకు స్థానచలనాలు తప్పవు.
ధనస్సు రాశి:
ఈ రాశి వారు ప్రారంభించబోయే పనులలో ఆటంకాలు కలుగకుండా వ్యవహరించాలి. ఉన్నత విద్యలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న విద్యార్థులు ఇప్పుడు సానుకూల ఫలితాలను పొందుతారు. వృత్తి,ఉద్యోగ,వ్యాపారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. శరీర సౌఖ్యం కలదు. శివనామాన్ని జపించండి.
మకర రాశి:
ఒక శుభవార్త మీ ఇంట్లో సంతోషాన్ని నింపుతుంది. ఒక ముఖ్య వ్యవహారంలో ఆర్థికసాయం అందుతుంది. అనుకున్న పనులను అనుకున్నట్టు చేయగలుగుతారు. నవగ్రహ స్తోత్రం చదివితే బాగుంటుంది. వ్యక్తిగత జీవితంలో కూడా సంతోషంగా ఉంటారు.
కుంభ రాశి:
అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ప్రారంభించిన పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయగలుగుతారు. చంద్ర ధ్యానం చదివితే శుభఫలితాలు కలుగుతాయి.
మీన రాశి:
ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు కలుగుతాయి. అనుకోని ప్రయాణాలు చేయవలసి వస్తుంది కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలు ముందుకు సాగక నిరాశ పరుస్తాయి. నిరుద్యోగులకు రావలసిన అవకాశాలు తృటిలో చేరుతాయి.