Horoscope: ఆ రాశుల వారికి పంట పండబోతుంది.. ఆదివారం రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

25వ తేదీ రాశిఫలాల్లో ఎక్కువ రాశులకు అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగాలు, వ్యాపారాల్లో పురోగతి, ఆకస్మిక ధనలాభాలు, వివాహ–ఉద్యోగ ప్రయత్నాల్లో శుభవార్తలు అందే సూచనలు ఉన్నాయి. కొందరికి స్వల్ప ఆరోగ్య సమస్యలు, మానసిక ఒత్తిడి ఉన్నప్పటికీ మొత్తం మీద రోజు అనుకూలంగా సాగనుంది.

Horoscope: ఆ రాశుల వారికి పంట పండబోతుంది.. ఆదివారం రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..
Horoscope Today

Edited By:

Updated on: Jan 25, 2026 | 7:30 AM

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

ఉద్యోగులకు సహోద్యోగుల సహాయ సహకా రాలు అందుతాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. ఆకస్మిక ధన లాభ సూచనలున్నాయి. పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. కొందరు బంధుమిత్రులతో అపార్థాలు తలెత్తుతాయి. కుటుంబ జీవితం బాగా సామర స్యంగా సాగుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వ్యక్తిగత సమస్యలు పరి ష్కారం అవుతాయి. ముఖ్యమైన ప్రయత్నాల్లో ఆశించిన ఫలితాలు కనిపిస్తాయి. ఆరోగ్యం పరవా లేదు.

 

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

ఉద్యోగులకు పదోన్నతులు లభిస్తాయి. జీతభత్యాలు పెరుగుతాయి. వృత్తి జీవితంలో బాగా ఒత్తిడి ఉంటుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. కుటుంబ పెద్దలు అనారోగ్యం నుంచి కోలుకుం టారు. నిరుద్యోగుల ప్రయత్నాలు సఫలం అవుతాయి. అవసరానికి చేతికి డబ్బు అందుతుంది. ఆధ్యాత్మిక విషయాల మీద దృష్టి పెడతారు. కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి. ఇతరుల వివాదాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది.

 

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

ఉద్యోగంలో అధికారుల ఆదరణ, ప్రోత్సాహం పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో విశేషమైన లాభా లను ఆర్జిస్తారు. కొందరు బంధుమిత్రులతో సాన్నిహిత్యం పెరుగుతుంది.  వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. మిత్రుల సహాయంతో కొన్ని ముఖ్యమైన వ్యవహారాలు, పనులు పూర్తవుతాయి. ఆర్థిక వ్యవహారాలు బాగా అనుకూలంగా సాగుతాయి. కుటుంబ వాతావరణం చాలావరకు ప్రశాంతంగా ఉంటుంది. ఇంటా బయటా బరువు బాధ్యతలు పెరుగుతాయి. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది.

 

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

ఉద్యోగంలో అధికారుల నుంచి శుభవార్తలు అందుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో అవకాశాలు పెరుగు తాయి. వ్యాపారాల్లో కొద్దిపాటి మార్పులను చేపట్టి పెట్టి లాభాలు గడిస్తారు. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ పెట్టడం మంచిది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి ఇతరులకు సహాయం చేయదగ్గ స్థాయిలో ఉంటుంది. ఇంటా బయటా కాస్తంత ఒత్తిడి ఉన్నప్పటికీ ముఖ్యమైన పను లన్నిటినీ పూర్తి చేస్తారు. ఇంటా బయటా క్షణం కూడా తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది.

 

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

ఉద్యోగంలో బాధ్యతల మార్పులకు కూడా అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు ఆశించిన స్థాయిలో పురోగతి చెందుతాయి. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాల విషయంలో శుభవార్తలు వింటారు. జీవిత భాగ స్వామితో ఇష్టమైన ఆలయాలు సందర్శిస్తారు. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లి విరుస్తాయి. చిన్ననాటి మిత్రులతో విందులో పాల్గొంటారు. ప్రయాణాల వల్ల మంచి ఫలితం ఉంటుంది. కుటుంబ జీవితం జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవ సరం.

 

కన్య (ఉత్తర 2,3,4. హస్త, చిత్త 1,2)

వృత్తి, ఉద్యోగాల్లో నూతనోత్సాహంతో ముందుకు సాగుతారు. వ్యాపారాల్లో లాభాలు నిలకడగా ఉంటాయి. కొత్త ప్రయత్నాలు చేపడతారు. ఆర్థిక పరిస్థితి సజావుగా సాగిపోతుంది. చేపట్టిన పనుల్లో జాప్యం జరిగినా అనుకున్న సమయానికి అన్నీ పూర్తవుతాయి. ప్రముఖులతో పరిచ యాలు పెరుగుతాయి. ఆకస్మిక ధన లాభ సూచనలున్నాయి. కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు. నిరుద్యోగులకు అనుకూల సమాచారం అందుతుంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు.

 

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

వృత్తి, ఉద్యోగాలు అనుకూలంగా సాగిపోతాయి. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి. ఆకస్మిక ధన లాభ సూచనలున్నాయి. కుటుంబ వాతావరణం సంతృప్తికరంగా ఉంటుంది. బంధు మిత్రులతో విందు కార్యక్రమంలో పాల్గొంటారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఇంటా బయటా అనుకూలతలుంటాయి. ఆర్థిక ప్రయత్నాలు బాగా లాభిస్తాయి. ఆస్తి  వ్యవహారా లలో మంచి పరిణామాలు చోటు చేసుకుంటాయి. నిరుద్యోగులు ఆశించిన శుభ వార్త వింటారు.

 

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

ఉద్యోగంలో మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటాయి. వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా ముందుకు సాగుతాయి.  ముఖ్యమైన వ్యవహారాలలో అవరోధాలున్నా అధిగమిస్తారు. చిన్నపాటి ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. కొందరు మిత్రులు ఇబ్బందులకు గురి చేస్తారు. ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. ఉద్యోగ ప్రయత్నాలకు ఆశించిన స్పందన లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది.  కుటుంబ వాతావరణం అన్ని విధాలా సామరస్యంగా ఉంటుంది.

 

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

వృత్తి, ఉద్యోగాల్లో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయట పడతారు. కొందరు బంధువులతో మాట పట్టింపులు ఏర్పడే సూచనలున్నాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. మిత్రుల కలహాల్లో మధ్యవర్తిత్వం చేస్తారు. ఏ రంగంలో ఉన్నప్పటికీ ఆదాయానికి లోటు ఉండదు. ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కీలక వ్యవహా రాల్లో మంచి నిర్ణయాలు తీసుకుని అమలు చేస్తారు.  నిరుద్యోగులకు కలిసి వచ్చే కాలం ఇది.

 

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

అధికారుల నుంచే కాక, ప్రముఖుల నుంచి కూడా ఆదరణ పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో కొన్ని చిన్నా చితకా సమస్య లున్నా, కార్యకలాపాలు ముందుకు వెడతాయి. కుటుంబ పెద్దల ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. సమాజంలో గౌరవ మర్యాదలకు లోటుండదు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ప్రయాణాలు లాభసాటిగా సాగు తాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. ఆశించిన స్థాయిలో పురోగతి కూడా ఉంటుంది.

 

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

ఉద్యోగంలో అధికారులతో సామరస్యం పెరుగుతుంది. నిరుద్యోగుల ప్రయత్నాలకు ఆశించిన స్పందన లభిస్తుంది. ఒకటి రెండు శుభవార్తలు అందుతాయి. ఆర్థిక వ్యవహారాలు ఉత్సాహం కలి గిస్తాయి. ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. దైవ చింతన పెరుగుతుంది. స్వల్ప అనారోగ్య సమ స్యలు పీడిస్తాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. వ్యాపారంలో కొత్త ఆలోచనలు ప్రవేశపె డతారు. అదనపు ఆదాయ ప్రయత్నాలకు, సంపాదన ప్రయత్నాలకు అవకాశాలు బాగానే ఉంటాయి.

 

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

ఉద్యోగంలో ప్రోత్సాహం, ఆదరణ కొనసాగుతాయి. వృత్తి, వ్యాపారాలు సాధారణంగా సాగు తాయి. నిరుద్యోగులకు శుభ వార్త అందవచ్చు. కొత్త ప్రయత్నాలు, కొత్త కార్యక్రమాలు చేపడతారు. ఆర్థిక వ్యవహారాలు సజావుగా సాగిపోతాయి. అన్ని రంగాల వారికి అనుకూల ఫలితాలుంటాయి. రుణ సమస్యలు చాలా వరకు తగ్గిపోతాయి. మానసికంగా ప్రశాంతత లభిస్తుంది. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి.