Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఐఫోన్‌ ప్రియులకు గుడ్‌ న్యూస్

స్మార్ట్ ఫోన్ దిగ్గజం ఆపిల్ తన ఫ్లాగ్‌షిప్‌ ఐఫోన్ 11ను భారత్‌లో తయారు చేయనుంది. దీంతో గతం కంటే తక్కువ ధరకే ఐఫోన్లు భారతీయ వినియోగదారులకు అందుబాటులోకి..

ఐఫోన్‌ ప్రియులకు గుడ్‌ న్యూస్
Follow us
Sanjay Kasula

|

Updated on: Jul 24, 2020 | 11:12 PM

Apple starts making iPhone 11 in India :  స్మార్ట్ ఫోన్ దిగ్గజం ఆపిల్ తన ఫ్లాగ్‌షిప్‌ ఐఫోన్ 11ను భారత్‌లో తయారు చేయనుంది. దీంతో గతం కంటే తక్కువ ధరకే ఐఫోన్లు భారతీయ వినియోగదారులకు అందుబాటులోకి రానున్నాయి. తమిళనాడు రాజధాని చెన్నైలోని తన ఉత్పత్తిని మొదలు పెట్టింది. ఫాక్స్‌కాన్‌ ప్లాంట్లో ఫ్లాగ్‌షిప్‌ ఐఫోన్ 11ను తయారు చేయడం ప్రారంభించింది. ఆపిల్ ఐఫోన్11ను తొలిసారిగా దేశీయంగా ఉత్పత్తి చేయనుంది. ఆపిల్ ఐఫోన్‌ల దేశీయంగా తయారు చేయడం ప్రయోజనకరంగా మారనుంది.

ఈ విషయాన్ని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ట్విటర్‌లో ప్రకటించారు.  మేడ్ ఇన్ ఇండియాలో ఇదో కీలకమైన పురోగతి అని ఆయన పేర్కొన్నారు. ఆపిల్ భారతదేశంలో ఐఫోన్ 11 తయారీని ప్రారంభించింది. దేశంలో మొట్టమొదటిసారిగా టాప్-ఆఫ్-ది-లైన్ మోడల్‌ను తీసుకువస్తోందని ట్వీట్‌ చేశారు.

ఐఫోన్ ఎక్స్‌ఆర్ స్మార్ట్‌పోన్‌ అసెంబ్లింగ్‌ ప్రారంభించిన తొమ్మిది నెలల తర్వాత ఈ కొత్త పరిణామం చోటు చేసుకుంది. మేడ్ ఇన్ ఇండియా యూనిట్లతో పోలిస్తే దిగుమతి చేసుకున్న స్మార్ట్‌ఫోన్‌లపై 20 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. దీంతో చెన్నైలో తయారయ్యే ఐఫోన్ల ధరలు త్వరలో దిగి రానున్నాయి. ఆపిల్‌ ఐఫోన్‌ లవర్స్‌కు ఇదో పెద్ద గుడ్‌న్యూస్‌.