ఏపీలో జోరుగా సాగుతోన్న వైసీపీ బస్సు యాత్ర.. అన్ని వర్గాలను ఆదుకున్న ఘనత జగన్‌దే అంటూ..
దక్షిణాంధ్రకు సంబంధించి కడప జిల్లా ప్రొద్దుటూరులో బస్సు యాత్ర జరిగింది. డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, ఎంపీ బీద మస్తాన్ రావు, ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి తదితర నేతలు పాల్గొన్నారు. తండ్రికి మించిన తనయుడిగా జగన్ పేరు తెచ్చుకున్నారని, ఆయనకు మరో ఛాన్స్ ఇవ్వాలని ప్రజలను కోరారు నేతలు. మధ్యాంధ్రకు సంబంధించి శనివారం బాపట్ల జిల్లాలో సామాజిక సాధికార...

దేశ చరిత్రలో సామాజిక న్యాయం అనే మాటకు సార్థకత చేకూర్చిన ఘనత వైఎస్ జగన్‌దేనన్నారు వైసీపీ నేతలు. అన్ని వర్గాలకూ పెద్దపీట వేసింది జగన్ ప్రభుత్వమేనన్నారు. ఏపీలో వైసీపీ సామాజిక సాధికార బస్సుయాత్ర జోరుగా సాగుతోంది. శనివారం మూడోరోజు భీమిలి, ప్రొద్దుటూరు, బాపట్లలో బస్సు యాత్ర జరిగింది. సామాజిక సాధికార యాత్ర పేరుతో వైసీపీ చేపట్టిన బస్సు యాత్ర శనివారంతో మూడవ రోజుకు చేరింది.
దక్షిణాంధ్రకు సంబంధించి కడప జిల్లా ప్రొద్దుటూరులో బస్సు యాత్ర జరిగింది. డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, ఎంపీ బీద మస్తాన్ రావు, ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి తదితర నేతలు పాల్గొన్నారు. తండ్రికి మించిన తనయుడిగా జగన్ పేరు తెచ్చుకున్నారని, ఆయనకు మరో ఛాన్స్ ఇవ్వాలని ప్రజలను కోరారు నేతలు. మధ్యాంధ్రకు సంబంధించి శనివారం బాపట్ల జిల్లాలో సామాజిక సాధికార బస్సు యాత్ర సాగింది. పీవీ పాలెం నుంచి బాపట్ల వరకూ జరిగిన యాత్రలో ఎంపీలు విజయసాయిరెడ్డి, మంత్రి జోగి రమేష్ తదితరులు పాల్గొన్నారు. సాయంత్రం 6 గంటలకు బహిరంగ సభ జరిగింది.
ఉత్తరాంధ్రలోని భీమిలి నియోజకవర్గంలో ప్రాంతీయ సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి బస్సు యాత్రను ప్రారంభించారు. చంద్రపాలెం, మధురవాడ, తగరపువలసలో యాత్ర సాగింది. నాడు-నేడు కార్యక్రమానికి సంబంధించి మధురవాడలో స్కూళ్లను పరిశీలించారు. విద్యార్థులు, టీచర్లతో ముచ్చటించారు నేతలు. శనివారం మధ్యాహ్నం తర్వాత తగరపువలస ఫుట్‌బాల్ గ్రౌండ్స్‌లో బహిరంగసభ జరిగింది. భీమిలి బస్సుయాత్రలో మంత్రులు బొత్స, శీదిరి, కారుమూరి, మేరుగ నాగార్జున పాల్గొన్నారు. నవంబర్ 9 వరకు సాగే బస్సు యాత్రకు రేపు విరామం. సోమవారం పాడేరు, దెందులూరు, ఉదయగిరి మీదుగా వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర సాగనుంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..