YSRCP: ప్చ్.. బీజేపీతో జట్టు కట్టుంటే కథ మరోలా ఉండేది.. వైసీపీ మాజీ ఎమ్మెల్యేల సంచలన కామెంట్స్..

2019 ఎన్నికల్లో 151 స్థానాలతో ఘన విజయాన్ని అందుకున్న వైసిపి 2024 ఎన్నికల్లో ఊహించని విధంగా 11 స్థానాలకే పరిమితం అయిపోయింది. వై నాట్ 175 నినాదంతో ప్రజల్లోకి వెళ్లిన మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి ఊహించని షాక్ తగిలింది. ఎన్నికల ఫలితాల తర్వాత ఈవీఎంల వల్లే తమకు ఈ స్థాయి ఫలితాలకు పరిమితం అయ్యామంటూ.. పార్టీ అధినేత నుంచి ముఖ్య నేతలు అందరూ ఇదే మాట్లాడారు.

YSRCP: ప్చ్.. బీజేపీతో జట్టు కట్టుంటే కథ మరోలా ఉండేది.. వైసీపీ మాజీ ఎమ్మెల్యేల సంచలన కామెంట్స్..
Ysrcp

Edited By: Shaik Madar Saheb

Updated on: May 18, 2025 | 8:35 PM

2019 ఎన్నికల్లో 151 స్థానాలతో ఘన విజయాన్ని అందుకున్న వైసిపి 2024 ఎన్నికల్లో ఊహించని విధంగా 11 స్థానాలకే పరిమితం అయిపోయింది. వై నాట్ 175 నినాదంతో ప్రజల్లోకి వెళ్లిన మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి ఊహించని షాక్ తగిలింది. ఎన్నికల ఫలితాల తర్వాత ఈవీఎంల వల్లే తమకు ఈ స్థాయి ఫలితాలకు పరిమితం అయ్యామంటూ.. పార్టీ అధినేత నుంచి ముఖ్య నేతలు అందరూ ఇదే మాట్లాడారు. ఏడాది తర్వాత పార్టీ ఓటమికి ఒక్కొక్కరు ఒక్కో కారణాన్ని చెబుతున్నారు. జగన్మోహన్ రెడ్డి మంచితనమే తమ ఓటమికి కారణమైందని కడప జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే రాజమల్లు శివప్రసాద్ రెడ్డి అన్నారు. పైన దేవుడు ఉన్నాడు.. కింద ప్రజలు ఉన్నారు అంటూ పదేపదే చెప్పిన జగన్మోహన్ రెడ్డి మధ్యలో చంద్రబాబు ఉన్న విషయాన్ని మరిచిపోయారని.. అందుకే తమకు ఇలాంటి ఫలితాలు వచ్చాయని అన్నారు. ఇక రాష్ట్రంలో ఫలితాలు అన్ని జిల్లాల్లో ఎలా ఉన్నా.. కడప తర్వాత వైసీపీకి అంతటి కంచుకోట ఉన్న నెల్లూరు జిల్లాలో కూడా ఫలితాలు దారుణంగా ఉండడం ఎవరు ఊహించలేని పరిస్థితి.

ఇదిలా ఉంటే నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల్లో బీజేపీతో జట్టు కట్టకుండా తప్పుచేసామన్నారు కోవూరు మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి.. రానున్న ఎన్నికల్లో బిజెపితోనే కలిసి పోటీ చేయాలన్నది తన వ్యక్తిగత అభిప్రాయమని ఆయన అన్నారు. నెల్లూరు జిల్లా కోవూరులో వైసీపీ నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన ప్రసన్న మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వంలో ప్రధాని మోదీ అన్ని అంశాల్లో జగన్ మద్దతు తీసుకున్నారని చెప్పారు. అయితే ఈ సారి ఎన్నికల్లో పొత్తు పెట్టుకోకుంటే నష్టపోతామన్నారు. ఈ అంశాన్ని పార్టీ అధినేత జగన్ దృష్టికి తీసుకు వెళ్తానని వెల్లడించారు.

వీడియో చూడండి..


మహిళలు ముందుండి ఆపరేషన్ సింధూర్ విజయవంతం చేయడం ప్రశంసనీయమని ప్రసన్న కొనియాడారు. పెహల్గాంలో పాకిస్తాన్ ఉగ్రవాదులు దాడి చేసి 26 మంది పర్యాటకులను బలి తీసుకోవడం బాధాకరమని ఆయన అన్నారు. ఉగ్రవాదులకు గుణపాఠం చెప్పాలా ప్రధాని నరేంద్ర మోడీ సమర్థవంతమైన నిర్ణయం తీసుకున్నారని ప్రశంసించారు. దేశానికి మోడీ లాంటి వారే మరో 20 ఏళ్ళు ప్రధానిగా ఉండాలన్నారు. దేశం కోసం పోరాడుతూ వీర్ల మరణం పొందే సైనికులకు తగిన గుర్తింపు కావాలని కేంద్రం మూడు కోట్లు రాష్ట్రం రెండు కోట్లు పరిహారం అందజేయాల్సిన అవసరం ఉందన్నారు. గతంలో జగన్ అమలు చేసినట్లే ముఖ్యమంత్రి చంద్రబాబు 50 లక్షల పరిహారం ఇవ్వడం అభినందనీయమన్నారు. జమిలీ ఎన్నికలు వస్తే జగన్ ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు. 2024 ఎన్నికల్లో బిజెపితో పొత్తు పెట్టుకుని ఉంటే పరిస్థితులు ఎలా ఉండేవి కాదని.. ఎన్నికల్లో బిజెపితో పొత్తు పెట్టుకోవడం మంచిదని అభిప్రాయాన్ని పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి చెబుతానని చెప్పడం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..