Andhra Pradesh: ‘ఊపిరి ఉన్నంతవరకు జగన్‌తోనే ఉంటాం..’ ఆరో జాబితా ప్రకటనపై వైసీపీ శ్రేణుల సంబరాలు..

|

Feb 03, 2024 | 9:41 AM

వై నాట్ 175..? ఈ టార్గెట్‌ పై గురి పెట్టిన వైసీపీ హైకమాండ్‌ మార్పే మంత్రంగా అభ్యర్థుల ఎంపికలో తన మార్క్‌ చాటుకుంటోంది. ఇప్పటికే ఐదు లిస్టులు విడుదల వైసీపీ .. తాజాగా ఆరో జాబితాను ప్రకటించింది. ఆరో లిస్టులో నాలుగు లోక్‌సభ.. 6 అసెంబ్లీ మొత్తంగా పది సెగ్మెంట్లకు కొత్త ఇంచార్జ్‌లను నియమించారు వైఎస్ జగన్..

Andhra Pradesh: ‘ఊపిరి ఉన్నంతవరకు జగన్‌తోనే ఉంటాం..’ ఆరో జాబితా ప్రకటనపై వైసీపీ శ్రేణుల సంబరాలు..
Ysrcp
Follow us on

వై నాట్ 175..? ఈ టార్గెట్‌ పై గురి పెట్టిన వైసీపీ హైకమాండ్‌ మార్పే మంత్రంగా అభ్యర్థుల ఎంపికలో తన మార్క్‌ చాటుకుంటోంది. ఇప్పటికే ఐదు లిస్టులు విడుదల వైసీపీ .. తాజాగా ఆరో జాబితాను ప్రకటించింది. ఆరో లిస్టులో నాలుగు లోక్‌సభ.. 6 అసెంబ్లీ మొత్తంగా పది సెగ్మెంట్లకు కొత్త ఇంచార్జ్‌లను నియమించారు వైఎస్ జగన్.. సామాజిక స‌మీక‌ర‌ణాలు.. స్థానిక ప‌రిస్థితులు.. ఇవే కొల‌మానంగా.. గెలుపే లక్ష్యంగా మార్పులు చేర్పులు చేశారు. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వైసీపీ అభ్యర్థుల ఎంపికలో మార్పులు చేర్పులు చేసినట్లు నేతలు పేర్కొంటున్నారు. అయితే, ఎంతో ఆసక్తికరంగా మారిన నెల్లూరు సిటీ అసెంబ్లీ స్థానానికి డిప్యూటీ మేయర్ ఎండీ ఖలీల్‌ను నియమించింది. నెల్లూరు సిటీ నుంచి మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ను నరసరావుపేట ఎంపీ స్థానానికి బదిలీ చేసింది. ఖలీల్‌ను నెల్లూరు ఇన్‌ఛార్జ్‌గా నియమించడంతో కార్యకర్తలు సంబరాల్లో మునిగితేలుతున్నారు.

వైసీపీ ప్రకటించిన ఆరో జాబితాలో స్థానం దక్కించుకున్న నేతలు సీఎం జగన్‌కు కృతజ్ఞతలు చెప్పారు. తిరుపతి జిల్లా జీడి నెల్లూరు అసెంబ్లీ సమన్వయకర్తగా తన పేరు ప్రకటించడంపై డిప్యూటీ సీఎం నారాయణస్వామి ధన్యవాదాలు చెప్పారు. తన ఊపిరి ఉన్నంతవరకు జగన్‌తోనే ఉంటానని మరోసారి తేల్చిచెప్పారు. అన్ని మండలాల నేతలను సమన్వయం చేసి భారీ మెజారిటీతో గెలుస్తానని ధీమా వ్యక్తంచేశారు.

వీడియో చూడండి..

వైసీపీ ప్రకటించిన ఆరో జాబితాలో చోటు దక్కడంపై రాజమండ్రిలో సంబరాలు మిన్నంటాయి. ఎంపీ కార్యాలయంలో అభ్యర్థి గూడూరి శ్రీనివాస్, స్థానిక ఎంపీ భరత్ నేతలు, కార్యకర్తలతో కలిసి బాణాసంచా కాల్చారు. అనంతరం ఒకరికొకరు స్వీట్లు తినిపించుకున్నారు. తనపై సీఎం జగన్‌ పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా భారీ మెజారిటీతో గెలిచి బహుమతిగా ఇస్తామని ప్రకటించారు అభ్యర్థి..

ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..