YS Jagan: ఎమ్మెల్సీ గెలుపు కోసం జగన్‌ వ్యూహాలు.. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో వరస భేటీ!

విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ గెలుపు కోసం జగన్‌ వ్యూహాలు రచిస్తున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లా వైసీపీ ప్రజాప్రతినిధులతో వరుస సమావేశాలు నిర్వహించారు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి.

YS Jagan: ఎమ్మెల్సీ గెలుపు కోసం జగన్‌ వ్యూహాలు.. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో వరస భేటీ!
Ys Jagan On Mlc Election
Follow us

| Edited By: Balaraju Goud

Updated on: Aug 08, 2024 | 4:51 PM

విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ గెలుపు కోసం జగన్‌ వ్యూహాలు రచిస్తున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లా వైసీపీ ప్రజాప్రతినిధులతో వరుస సమావేశాలు నిర్వహించారు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఇతర ప్రజాప్రతినిధులతో జగన్ నేరుగా మాట్లాడారు. వైసీపీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ గెలుపే లక్ష్యంగా ప్రజాప్రతినిధులకు దిశినిర్దేశం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికలో ఎలా వ్యవహరించాలో సూచనలు ఇచ్చారు జగన్‌.

ఎమ్మెల్సీ ఎన్నిక నేపథ్యంలో ఉమ్మడి విశాఖ జిల్లా వైసీపీ నేతల్లో ఫుల్ జోష్ కనిపిస్తుంది. రెండు రోజుల పాటు వైఎస్ జగన్ ను కలిసిన వారిలో ఉత్సాహం మరింత రెట్టింపు అవుతుంది. ఎమ్మెల్సీ ఎన్నికలో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ నాయకులకు దిశా నిర్దేశం చేశారు. ఇప్పటికే జీవీఎంసీ కార్పొరేటర్లతో సమావేశమైన వైఎస్ జగన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు.

ఆగస్ట్ 30వ తేదీన ఉమ్మడి విశాఖ జిల్లాలో స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నిక జరగనుంది. ఇప్పటికే నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్సీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ ఎమ్మెల్సీలు జడ్పీటీసీలు మున్సిపల్ కౌన్సిలర్లతో సమావేశమయ్యారు. ఎంపీటీసీ, జడ్పిటీసీ, కౌన్సిలర్లతోపాటు వారి కుటుంబ సభ్యులు కూడా వైఎస్ జగన్ తో భేటీ అయ్యారు. దీంతో వారిలో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. తమ అభిమాన నేతను ప్రత్యక్షంగా కలుస్తుండడంతో సభ్యులలో ఎన్నడూ లేని విధంగా నూతన ఉత్సాహం వెళ్ళు విరుస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికలో పార్టీ పరంగా ఎటువంటి వ్యూహాన్ని అనుసరించాలనే దానిపై వారితో చర్చించారు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి సంపూర్ణ బలం ఉంది. నాలుగింట 3 వంతులకు పైగా సభ్యుల బలం స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ఆర్‌సీపీ కైవసం చేసుకుంది. ఈ ఎన్నికల్లో 97 మంది కార్పొరేటర్లు, 36 మంది జడ్పీటీసీలు, 636 మంది ఎంపీటీసీలు, 53 మంది కౌన్సిలర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. చనిపోయిన వారితో ఏర్పడిన ఖాళీలు 11 ఉన్నాయి. సాధారణ ఎన్నికల తరువాత జరుగుతున్న తొలి ఎన్నిక కావడంతో ప్రతి ఒక్కరిలోనూ ఎమ్మెల్సీ ఎన్నిక ఫలితంపై ఆసక్తి నెలకొంది. మొత్తం 833 సభ్యుల్లో వైయస్సార్సీపీకి 620 మంది వరకు సభ్యుల బలం ఉంది. కూటమికి కేవలం 200 మంది సభ్యుల బలం మాత్రమే ఉంది. దీంతో వైఎస్సార్సీపీ నాయకులు ఎమ్మెల్సీ ఎన్నికలో సునాయాసంగా విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

ఎమ్మెల్సీ ఎన్నిక కోసం ప్రజాప్రతినిధులకు జగన్ దిశానిర్దేశం..!
ఎమ్మెల్సీ ఎన్నిక కోసం ప్రజాప్రతినిధులకు జగన్ దిశానిర్దేశం..!
మూడు గ్రహాల సానుకూల వీక్షణ..వారికి కొత్త పెట్టుబడులకు మంచి రోజులు
మూడు గ్రహాల సానుకూల వీక్షణ..వారికి కొత్త పెట్టుబడులకు మంచి రోజులు
షుగర్‌ పేషెంట్స్‌ మూత్రం దుర్వాసన ఎందుకు.? అసలు కారణం ఏంటంటే..
షుగర్‌ పేషెంట్స్‌ మూత్రం దుర్వాసన ఎందుకు.? అసలు కారణం ఏంటంటే..
శుక్రవారం స్ట్రీమింగ్‌కు సూపర్ హిట్ సినిమాలు..భారతీయుడు 2తో సహా..
శుక్రవారం స్ట్రీమింగ్‌కు సూపర్ హిట్ సినిమాలు..భారతీయుడు 2తో సహా..
స్టేజ్‌పైనే సుమను ముద్దుపెట్టుకున్న హాలీవుడ్ యాక్టర్.. సుమ తెలివి
స్టేజ్‌పైనే సుమను ముద్దుపెట్టుకున్న హాలీవుడ్ యాక్టర్.. సుమ తెలివి
స్మగ్లింగ్ చేయడం హీరోయిజం అయ్యింది.. పవన్ కామెంట్స్ వైరల్
స్మగ్లింగ్ చేయడం హీరోయిజం అయ్యింది.. పవన్ కామెంట్స్ వైరల్
ఏపీలో కొత్త లిక్కర్ పాలసీ ఎలా ఉండబోతోంది..?
ఏపీలో కొత్త లిక్కర్ పాలసీ ఎలా ఉండబోతోంది..?
వర్షాకాలంలో కాల్చిన మొక్కజొన్న పొత్తులు తింటున్నారా..?ఇదిమీ కోసమే
వర్షాకాలంలో కాల్చిన మొక్కజొన్న పొత్తులు తింటున్నారా..?ఇదిమీ కోసమే
చైతూకు కాబోయే భార్య శోభిత ధూళిపాళ్ల ఆస్తులు ఎంతో తెలుసా..
చైతూకు కాబోయే భార్య శోభిత ధూళిపాళ్ల ఆస్తులు ఎంతో తెలుసా..
గంజాయి సేవించే వారిని ఇట్టే కనిపెట్టవచ్చు.. ఎలాగంటే..
గంజాయి సేవించే వారిని ఇట్టే కనిపెట్టవచ్చు.. ఎలాగంటే..
స్టేజ్‌పైనే సుమను ముద్దుపెట్టుకున్న హాలీవుడ్ యాక్టర్.. సుమ తెలివి
స్టేజ్‌పైనే సుమను ముద్దుపెట్టుకున్న హాలీవుడ్ యాక్టర్.. సుమ తెలివి
స్మగ్లింగ్ చేయడం హీరోయిజం అయ్యింది.. పవన్ కామెంట్స్ వైరల్
స్మగ్లింగ్ చేయడం హీరోయిజం అయ్యింది.. పవన్ కామెంట్స్ వైరల్
పేరుకి ముంబై ముద్దుగుమ్మలే.. కానీ చూపంతా టాలీవుడ్ పైనే..
పేరుకి ముంబై ముద్దుగుమ్మలే.. కానీ చూపంతా టాలీవుడ్ పైనే..
మైహోమ్ గ్రూప్ నుంచి మరో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్‌.. "అక్రిద".
మైహోమ్ గ్రూప్ నుంచి మరో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్‌..
దేశం వదిలి పారిపోయిన ప్రధాని.. అసలు బంగ్లాదేశ్‌లో ఏం జరుగుతోంది.?
దేశం వదిలి పారిపోయిన ప్రధాని.. అసలు బంగ్లాదేశ్‌లో ఏం జరుగుతోంది.?
చెట్టుతో తనకు ఉన్న జ్ఞాపకాలను నెమరువేసుకున్న డైరెక్టర్ వంశీ
చెట్టుతో తనకు ఉన్న జ్ఞాపకాలను నెమరువేసుకున్న డైరెక్టర్ వంశీ
ఓజీ హీరోయిన్ వయ్యారాలు ఎలాంటి కుర్రాడైనా పడిపోవాల్సిందే..
ఓజీ హీరోయిన్ వయ్యారాలు ఎలాంటి కుర్రాడైనా పడిపోవాల్సిందే..
టూత్‌ పేస్ట్‌లో విషం కలిపి.. హతమార్చేసే చరిత్ర ఇజ్రాయెల్‌
టూత్‌ పేస్ట్‌లో విషం కలిపి.. హతమార్చేసే చరిత్ర ఇజ్రాయెల్‌
గొప్ప మనసు చాటుకున్న "మల్లు అర్జున్‌''
గొప్ప మనసు చాటుకున్న
మహిళ తలలో పేలు.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
మహిళ తలలో పేలు.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్