PM Narendra Modi: ప్రధాని మోడీని కలిసిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి.. పలు అంశాలపై చర్చ

|

Mar 24, 2022 | 3:42 PM

YSRCP MP Vijayasai Reddy meets PM Modi: వైఎస్ఆర్‌సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోడీని మర్యాదపూర్వకంగా కలిశారు. పార్లమెంట్ సమావేశాలు

PM Narendra Modi: ప్రధాని మోడీని కలిసిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి.. పలు అంశాలపై చర్చ
Pm Modi Vijayasai Reddy
Follow us on

YSRCP MP Vijayasai Reddy meets PM Modi: వైఎస్ఆర్‌సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోడీని మర్యాదపూర్వకంగా కలిశారు. పార్లమెంట్ సమావేశాలు సందర్భంగా ఎంపీ విజయసాయి రెడ్డి గురువారం ప్రధాని మోడీతో కాసేపు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ విజయసాయిరెడ్డి (Andhra Pradesh) రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ప్రధాని మోడీకి వివరించారు. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన పలు అంశాలపై.. రావాల్సిన నిధులపై ప్రధాని మోడీకి ఎంపీ వివరించారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి సహాయసహకారాలు అందించాలని ఎంపీ.. ప్రధాని మోడీని కోరారు. ఏపీలోని సమస్యలతోపాటు పెండింగ్ నిధులు, హామీలపై చర్చించినట్టు ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్ చేసి వెల్లడించారు.

ఈ సందర్భంగా ఎంపీ విజయసాయిరెడ్డి ప్రధానమంత్రి నరేంద్రమోడీకి వినాయకుడి ప్రతిమను బహూకరించారు. దీంతోపాటు ప్రధాని మోడీని శాలువాతో సత్కరించారు. కాగా.. రాష్ట్రంలో బీజేపీ జగన్ ప్రభుత్వంపై పలు విమర్శలు చేస్తున్న నేపథ్యంలో.. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రధాని మోడీతో భేటీ కావడం ప్రధాన్యం సంతరించుకుంది.

Also Read:

MP Vijayasai Reddy: పాకిస్తాన్ జైళ్లలో ముగ్గురు ఆంధ్రా జాలర్లు.. విజయసాయిరెడ్డి ప్రశ్నకు కేంద్రం జవాబు

Surgery: ఆపరేషన్ కోసం వెళ్తే.. కడుపులోనే కాటన్ పెట్టి కుట్లేశారు.. వైద్యుల నిర్లక్ష్యంతో..