కరోనా టెన్షన్.. క్వారంటైన్‌లో విజయ సాయిరెడ్డి..!

| Edited By:

Jul 22, 2020 | 1:24 PM

వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డికి కరోనా టెన్షన్ పట్టుకుంది. గత కొద్ది రోజులుగా ఆయన పలు కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నారు. అయితే గత కొద్ది రోజులుగా ఆయన అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో..

కరోనా టెన్షన్.. క్వారంటైన్‌లో విజయ సాయిరెడ్డి..!
Follow us on

వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డికి కరోనా టెన్షన్ పట్టుకుంది. గత కొద్ది రోజులుగా ఆయన పలు కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నారు. అయితే గత కొద్ది రోజులుగా ఆయన అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆయనకు కరోనా భయం టెన్షన్‌ పట్టుకుంది. దీంతో ముందస్తు జాగ్రత్తగా ఆయన హోం క్వారంటైన్‌లోకి వెళ్లిపోయారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. తాను ఓ వారం పది రోజులపాటు క్వారంటైన్‌లో ఉండేందుకు నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఎమర్జెన్సీ పరిస్థితులైతే ఫోన్ ద్వారా అందుబాటులో ఉంటానని.. లేదంటే దానికి కూడా అందుబాటులో ఉండనంటూ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.