పార్లమెంటులో పార్టీ ఎంపీల తీరుతో వైసీపీకి మైనస్‌గా మారిందా.. మిథున్ రెడ్డి క్లారిటీ ఇదే..!

వైసీపీ విధానపరంగానే అమరావతిని వ్యతిరేకిస్తుందా.. అందుకే పార్లమెంట్‌లో వాకౌట్‌ చేసిందా? ఎంపీల వ్యవహరించిన తీరుతో వైసీపీకి ఇది మైనస్‌గా మారిందా.. ఇదే అంశంపై ఆ పార్టీ లోక్‌సభాపక్ష నేత మిథున్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా మూడు రాజధానుల విషయంలో వైసీపీ నిర్ణయం వెనక్కు తీసుకుందా?

పార్లమెంటులో పార్టీ ఎంపీల తీరుతో వైసీపీకి మైనస్‌గా మారిందా.. మిథున్ రెడ్డి క్లారిటీ ఇదే..!
Mp Mithun Reddy With Tv9 Managing Editor Rajinikanth

Updated on: Apr 11, 2026 | 8:05 PM

వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రతిపాదించిన ‘మావిగన్‌’లో తప్పేముందని వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ప్రశ్నించారు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కలిపి మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందాలనేదే జగన్‌ ఆకాంక్ష అని అన్నారు అమరావతి రాజధానికి వైసీపీ వ్యతిరేకం కాదన్న మిథున్ రెడ్డి, అవినీతికి మాత్రమే వ్యతిరేకమన్నారు. ఈ కారణంతోనే పార్లమెంటులో వాకౌట్‌ చేశామని మిథున్ రెడ్డి స్పష్టం చేశారు. టీవీ9 మేనేజింగ్‌ ఎడిటర్‌ రజినీకాంత్‌కు ఇచ్చిన క్రాస్‌ఫైర్‌లో మిథున్‌ రెడ్డి రాజధానిపై ఆసక్తికర అంశాలు వెల్లడించారు. పార్లమెంటులో వైఎస్ఆర్‌ కాంగ్రెస్ ఎంపీల వ్యవహరించిన తీరుతో వైసీపీకి ఇది మైనస్‌గా మారిందన్న దానిపై మిథున్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us