ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయాలు హీటెక్కుతున్నాయి. నకిలీ, డబుల్ ఎంట్రీ ఓట్ల వ్యవహారం రాజకీయ రచ్చ రాజేస్తోంది. ఓట్లకు సంబంధించి వైసీపీ, టీడీపీ మధ్య ఆరోపణలు, విమర్శలు తారాస్థాయికి చేరుతున్నాయి. కొంతకాలం నుంచి ఓట్ల వ్యవహారానికి సంబంధించి వైసీపీ, టీడీపీ మధ్య వార్ నడుస్తోంది. ఇప్పటికే.. బోగస్ ఓట్లు, ఓట్ల తొలగింపుపై యుద్ధం కొనసాగుతుండగా.. ఇప్పుడు.. వైసీపీ నేతలు మరో అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. డబుల్ ఎంట్రీ ఓట్లపై చర్యలు తీసుకోవాలని ఏపీ సీఈవోకు కంప్లైంట్ చేశారు మంత్రులు జోగి రమేష్, చెల్లుబోయిన వేణుగోపాల్‌తోపాటు.. పలువురు నేతలు. తెలంగాణలో ఓటు వేసినవారిని ఏపీలో ఓటు వేయకుండా చర్యలు తీసుకోవాలని సీఈవోని కోరామన్నారు మంత్రి జోగి రమేష్.. హైదరాబాద్, ఏపీలో 4,30,264 ఓట్లు కామన్‌గా ఉన్న.. డబుల్ ఎంట్రీ ఓట్ల తొలగించాలని సీఈవోను కోరినట్లు మంత్రి జోగి రమేష్ వివరించారు.
ఇక.. ఎన్నికలు పారదర్శకంగా జరగాలనేది సీఎం జగన్ ఆకాంక్ష అన్నారు మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్. ఒకటి కంటే ఎక్కువ చోట్ల ఉన్నవారి ఓట్లను తొలగించాల్సిన అవసరం ఉందన్నారు. మరోవైపు.. తాను చేసిన తప్పులు.. చంద్రబాబు.. ఇతరులపైకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి చెల్లుబోయిన మండిపడ్డారు.
ఒక సామాజిక వర్గానికి రెండు, మూడు చోట్లు ఓట్లు ఉన్నాయి.. ఈసీకి చంద్రబాబు ఏమని ఫిర్యాదు చేస్తారు? అంటూ మంత్రి ఫైర్ అయ్యారు.
మొత్తంగా… ఏపీలో ఓట్ల వ్యవహారం కొన్నా్ళ్లుగా రాజకీయ దుమారం రేపుతోంది. ఇప్పటికే.. ఏపీలో ఓటర్ జాబితాకు సంబంధించి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తుండటంతో ఎన్నికల కమిషన్ కూడా ప్రత్యేక దృష్టి పెట్టింది. జిల్లాల వారీగా ప్రత్యేక పరిశీలకులను నియమించి.. పలు జిల్లాల వారీగా రాజకీయ పార్టీలతో చర్చించి అభిప్రాయాలు తీసుకుంటోంది. తాజాగా.. డబుల్ ఎంట్రీ ఓట్లపై వైసీపీ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి మరి..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..