దేశంలోనే వినూత్నంగా ‘జగనన్నే మా భవిష్యత్తు’ ప్రారంభం.. ఈ నెల 20 నుంచి ఐదు కోట్ల మంది ప్రజలతో మమేకం..

|

Apr 07, 2023 | 9:22 PM

ప్రభుత్వ పనితీరుపై అభిప్రాయాల్ని తెలుసుకునేందుకు వచ్చాం’ అని చెబుతారు. పార్టీలకతీతంగా ప్రజాసంక్షేమ పథకాలు ప్రజలకు అందాలనే లక్ష్యంతో జగనన్న మా భవిష్యత్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు వైసీపీ నేతలు.

దేశంలోనే వినూత్నంగా జగనన్నే మా భవిష్యత్తు ప్రారంభం.. ఈ నెల 20 నుంచి ఐదు కోట్ల మంది ప్రజలతో మమేకం..
AP CM YS Jagan
Follow us on

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో 1.60 కోట్ల కుటుంబాలను నేరుగా కలుసుకునే ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమానికి ఏప్రిల్‌ 7వ తేది నుంచి వైఎస్సార్‌సీపీ శ్రీకారం చుట్టింది. జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమంలో భాగంగా సీఎం జగన్‌ సైనికులుగా పార్టీ పదాతిదళం ప్రతి ఇంటికీ వెళ్తుంది. దాదాపు 7 లక్షల మంది గృహ సారథులు, సచివాలయాల కన్వీనర్లు 1.60 కోట్ల ఇళ్లను 14 రోజుల్లో సందర్శిస్తారు. ఐదుకోట్ల మంది ప్రజలను ప్రత్యక్షంగా కలుసుకుంటారు. ‘మమ్మల్ని జగనన్న పంపారు. మీతో మాట్లాడి సంక్షేమ పథకాల అమలు, ప్రభుత్వ పనితీరుపై అభిప్రాయాల్ని తెలుసుకునేందుకు వచ్చాం’ అని చెబుతారు. పార్టీలకతీతంగా ప్రజాసంక్షేమ పథకాలు ప్రజలకు అందాలనే లక్ష్యంతో జగనన్న మా భవిష్యత్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు వైసీపీ నేతలు.

దేశచరిత్రలోనే ఇది అరుదైన కార్యక్రమంగా అభివర్ణించారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని విస్త్రుతంగా జనంలోకి తీసుకెళతామన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. ఆనాటి, నేటి పాలనలో వ్యత్యాసాన్ని ప్రజలకు వివరిస్తామన్నారు. చిత్తూరు జిల్లా వడమాలపేట మండలం పూడి గ్రామంలో ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమాన్ని మంత్రి ఆర్కే రోజా ప్రారంభించారు. వైఎస్‌ఆర్‌సీపీ పదాతిదళం రాష్ట్రవ్యాప్తంగా ప్రజలతో మమేకమయ్యేందుకు భారీ సర్వే చేపడుతుందని తెలిపారు. సింహం సింగిల్‌గానే వస్తుందనీ…పవన్‌ కళ్యాణ్‌, చంద్రబాబులాంటి వారెందరొచ్చినా ఏమీ చేయలేరన్నారు రోజా.

చిలకలూరి పేట నియోజకవర్గంలో…జగనన్న భవిష్యత్‌ కార్యక్రమాన్ని మంత్రి విడుదల రజని లాంఛ్‌ చేశారు. ఏడు లక్షల మంది కన్వీనర్లు 1.60 కోట్ల మందిని కలిసి ప్రభుత్వ పథకాల సమాచారాన్ని సేకరిస్తారని మంత్రి విడుదల రజని వివరించారు. ప్రజల గుండెల్లో నుంచి వచ్చిన నినాదమే ‘మానమ్మకం నువ్వే జగన్’ కార్యక్రమన్నారు వైసీపీ ఎంపీ సంజీవ్‌కుమార్. బడుగు బలహీన వర్గాల కోసమే ఈ కార్యక్రమం చేపట్టామన్నారు.

ఇవి కూడా చదవండి

ఇక గుంటూరు జిల్లా పొన్నూరులో ‘మా నమ్మకం నువ్వే జగన్’ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఎమ్మెల్యే కిలారి రోశయ్య. ఓటు ఎవరికి వేసినా…సంక్షేమ పథకాలు అందరికీ అందాలన్నది ముఖ్యమంత్రి జగన్‌ ఆకాంక్ష అన్నారు వైసీపీ నేత వేంపల్లి శ్రీనివాస్‌. సత్యసాయి జిల్లా నల్లమాడ మండలం రెడ్డిపల్లిలో జగనన్న భవిష్యత్‌ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఎమ్మేల్యే శ్రీధర్ రెడ్డి. పుంగనూరులో జగనన్న కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి పెద్దిరెడ్డి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం..