YCP vs TDP: గృహసారథులకు పోటీగా కుటుంబ సారథులు.. ఏపీలో హీటెక్కిన పొలిటికల్ హీట్..

వేసవి కంటే ముందే ఏపీలో పొలిటికల్‌ హీట్‌ పెరిగింది. ఎవరికి వారే కొత్త వ్యూహాలతో ప్రజల్లోకి వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగా..

YCP vs TDP: గృహసారథులకు పోటీగా కుటుంబ సారథులు.. ఏపీలో హీటెక్కిన పొలిటికల్ హీట్..
Ycp Vs Tdp

Updated on: Feb 17, 2023 | 1:47 PM

ఏపీలో రెండేళ్లకు ముందే ఎన్నికల హంగామా మొదలై పోయింది. ఇప్పుడు ఏపీలో గృహసారథులు వర్సెస్ కుటుంబసారథులు. పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుుకు టీడీపీ-వైసీపీ కొత్త నియమాకాలు చేపట్టింది. ఇంటింటికి ప్రభుత్వ సంక్షేమ పథకాలను తీసుకెళ్లేందుకు కొత్తగా గృహసారథులతో దాదాపు ఐదున్నరకోట్ల మంది వైసీపీ సైనం రెడీ అవుతోంది. ఒక కోటి అరవై లక్షల ఇళ్లల్లో డోర్‌ టు డోర్ తిరిగేలా గృహసారథులకు లక్షంగా పెట్టుకున్నారు. ఇటు టీడీపీ తరఫున డోర్ టు డోర్ ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు కుటుంబ సాధికారధి ఉండేలా నియామకం చేస్తున్నారు.

పార్టీలో సెక్షన్ ఇన్ ఛార్జ్‌లను కుటుంబ సారథులుగా నియమించాలని ఆదేశించారు. పార్టీ విధానాలను, భవిష్యత్తు కార్యాచరణను ప్రజల్లోకి డోర్ టు డోర్ తీసుకెళ్లనున్నారు కుటుంబ సారథులు. టీడీపీపై ప్రజల్లో నమ్మకం కల్పించడం.. హామీలను ఇంటింటికి తీసుకెళ్లడమే టార్గెట్‌గా వీళ్లంతా పనిచేయనున్నారు కుటుంబ సాధికార సారథులు.

ఇది టీడీపీ ప్లాన్..

ఆంధ్రప్రదేశ్‌లో ఎలక్షన్‌మూడ్‌ వచ్చేసినట్లే కనిపిస్తోంది. వైసీపీ గృహసారథులకు పోటీగా.. కుటుంబ సాధికార సారథులను బరిలోకి దింపుతోంది తెలుగుదేశం. కాకినాడ జిల్లా పర్యటనలో ఉన్న చంద్రబాబు ఈ కీలక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఒక్కో వ్యక్తికి 30 కుటుంబాలు కేటాయించనున్నారు. రాగా కుటుంబ సారథులు ఏం చేయాలి? ఎప్పుడు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలన్నది నేరుగా చంద్రబాబే దిశానిర్దేశం చేయనున్నారు.

ప్రతిటీమ్‌లో ఒక మహిళ, ఒక పురుషుడు ఉండేలా ప్లాన్‌ చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో వైసీసీని ఎదుర్కొనేందుకే కుటుంబ సారథులను బరిలోకి దించుతోంది తెలుగుదేశం. ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమంలో భాగంగా కాకినాడ జిల్లాలో పర్యటిస్తున్న చంద్రబాబు.. జగ్గంపేటలో పార్టీ కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు. ఇక్కడే కుటుంబ సాధికార సారథులు వ్యవస్థను ప్రకటించారు.

ఇకపై పార్టీలో ఉన్న సెక్షన్‌ ఇన్‌ఛార్జ్‌లందరినీ కుటుంబ సాధికార సారథులుగా పిలుస్తామన్నారు. ఈ వ్యవస్థలో మహిళలకూ ప్రాధాన్యం ఇస్తామన్నారు. ప్రతి నియోజకవర్గంలో కుటుంబ సాధికార సారథి విభాగం ఉంటుందని చెప్పారు. ప్రతి కుటుంబానికీ న్యాయం చేసేందుకు ఈ విభాగం పనిచేస్తుందని టీడీపీ అధినేత తెలిపారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం