Andhra Pradesh: పేదల ఇళ్ల నిర్మాణంపై సీఎం జగన్ కీలక ఆదేశాలు… ఆ రోజు నుంచే పనులు

|

Sep 20, 2021 | 8:23 PM

పేదలందరికీ ఇళ్లు నిర్మాణ ప్రగతిపై సమీక్షించారు సీఎం జగన్. ఇళ్ల నిర్మాణ పనులు చురుగ్గా సాగేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు ఆదేశాలిచ్చారు.

Andhra Pradesh: పేదల ఇళ్ల నిర్మాణంపై సీఎం జగన్ కీలక ఆదేశాలు... ఆ రోజు నుంచే పనులు
Cm Jagan
Follow us on

పేదలందరికీ ఇళ్ల నిర్మాణమే లక్ష్యంగా ఏపీ సర్కార్‌ చేపట్టిన చర్యలు వేగవంతం చేసింది. సీఎం జగన్‌ ఇళ్ల నిర్మాణ ప్రగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇప్పటివరకూ గ్రౌండ్‌ అయిన 10.31 లక్షల ఇళ్ల నిర్మాణ పనులు వేగంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని సీఎం కలెక్టర్లను ఆదేశించారు. లబ్ధిదారులు ఎంచుకున్న ఆప్షన్‌-3 కింద ప్రభుత్వమే కట్టించనున్న ఇళ్ల నిర్మాణ పనులు అక్టోబరు 25 నుంచి ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గ్రామ, వార్డు సచివాలయాల్లోనే వన్‌టైం సెటిల్‌మెంట్‌ పథకం సొమ్మును చెల్లించేలా వెసులుబాటు కల్పించామని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. ఈ ఇళ్ల నిర్మాణ లబ్ధిదారులు, మేస్త్రీలతో కలిసి 18వేలకు పైగా గ్రూపులను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఖర్చులు తగ్గించుకునే విధానాల్లో భాగంగా ఇళ్ల నిర్మాణం జరుగుతున్న లే అవుట్ల వద్దే ఇటుక తయారీ యూనిట్లను ప్రోత్సహిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. దీనివల్ల రవాణా ఖర్చులు కలిసి వస్తాయన్నారు. మిగిలిన నిర్మాణ సామాగ్రి ధరలు, ఖర్చులను అదుపులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్‌ అధికారులకు సూచించారు.

జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాలపై కూడా సీఎం సమావేశంలో చర్చించారు. మౌలిక సదుపాయాల కల్పన పై డీపీఆర్‌ సిద్ధం చేశామన్నారు అధికారులు. కాలనీ ఒక యూనిట్‌గా చేసి.. పనులు అప్పగించాలని అధికారులను సీఎం జగన్ కోరారు. టిడ్కో ఇళ్లపై కూడా చర్చించారు. ఇక ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న విద్యాకానుకపై సీఎం జగన్‌ దృష్టి సారించారు. వచ్చే యేడాది విద్యాకానుక కిట్‌లో భాగంగా స్కూల్‌ బ్యాగు, బూట్ల నాణ్యతను సీఎం జగన్‌ స్వయంగా పరిశీలించారు. ప్రభుత్వ పాఠశాల్లో చదివే ప్రతి విద్యార్థికి జగనన్న విద్యాకానుక అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సీఎం జగన్‌ సూచించారు. ఒకటో తరగతి నుంచి పదో తరగతి విద్యార్థులకు 3 జతల యూనిఫాం క్లాత్‌, ఒక జత బూట్లు, రెండు జతల సాక్సులు, బెల్టు, స్కూల్‌ బ్యాగ్‌, నోట్‌బుక్స్‌, పాఠ్యపుస్తకాలు, డిక్షనరీ అందిస్తున్నారు.

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో ఘనవిజయాన్ని అందించిన ప్రజలకు ముఖ్యమంత్రి జగన్​ ధన్యవాదాలు

పరిషత్‌ ఎన్నికల్లో ఏకపక్ష విజయంపై సీఎం  జగన్​ స్పందించారు. ఈ విజయంతో తనపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. ప్రజలందరి చల్లని దీవెనలతోనే ఈ అఖండ విజయం వరించిందన్నారు. ప్రజలంతా ప్రభుత్వానికి తోడుగా నిలబడ్డారన్న జగన్​.. ఈ విజయాన్ని అందించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. పరిషత్‌ ఎన్నికల ఫలితాలపై సీఎం జగన్​ మీడియా సమావేశం నిర్వహించారు. ఎన్నికలు ఆపేందుకు చాలామంది కుట్రలు పన్నారని.. ఎవరెన్ని కుట్రలు పన్నినా ప్రజలు తమవైపే ఉన్నారని చెప్పారు.  ఈ విజయంతో తనపై మరింత బాధ్యత పెరిగిందన్నారు.

పరిషత్ ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించినందున సీఎం వైఎస్ జగన్ కు పలువురు మంత్రులు అభినందనలు తెలిపారు. తాడేపల్లి లోని క్యాంపు ఆఫీసుకు వచ్చిన మంత్రులు సీఎంను కలిశారు. ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్‌, మంత్రులు వెలంపల్లి శ్రీనివాస్‌, కొడాలి నాని, శ్రీరంగనాథరాజు ముఖ్యమంత్రికి అభినందనలు తెలిపారు.

Also Read: నిర్మల్ జిల్లాలో లేడీ డాన్స్ హల్‌చల్.. డబ్బులిస్తే ఓకే.. లేదంటే రచ్చ.. రచ్చే

భర్త కాదు.. ఆమెకు పుట్టబోయే బిడ్డకు తండ్రిని నేనంటే నేనంటూ కొట్టుకున్న ఇద్దరు వ్యక్తులు.. ఒకరు మృతి