YS Jagan: ‘ఇంతకన్నా జగన్ పాలనకు ఇచ్చే సర్టిఫికెట్ ఇంకేం ఉంటుంది’

|

Apr 10, 2024 | 9:00 PM

చంద్రబాబుది బోగస్ రిపోర్ట్ అయితే..తనది ప్రోగ్రెస్ రిపోర్ట్ అన్నారు జగన్‌. ఐదేళ్ల పాలనలో స్వయం ఉపాధిని ప్రోత్సహించామని.. జాబు రావాలంటే జగన్‌ కావాలని చెప్పారు ముఖ్యమంత్రి. పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో మేమంతా సిద్ధం సభలో ఆయన ప్రసంగించారు. తన హయాంలో..

YS Jagan: ఇంతకన్నా జగన్ పాలనకు ఇచ్చే సర్టిఫికెట్ ఇంకేం ఉంటుంది
Ys Jagan
Follow us on

చంద్రబాబుది బోగస్ రిపోర్ట్ అయితే..తనది ప్రోగ్రెస్ రిపోర్ట్ అన్నారు జగన్‌. ఐదేళ్ల పాలనలో స్వయం ఉపాధిని ప్రోత్సహించామని.. జాబు రావాలంటే జగన్‌ కావాలని చెప్పారు ముఖ్యమంత్రి. పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో మేమంతా సిద్ధం సభలో ఆయన ప్రసంగించారు. తన హయాంలో 2లక్షలకు పైగా జాబులిచ్చామని.. బాబు వస్తే వాలంటీర్లను తీసి.. చంద్రబాబు కమిటీలతో నింపేస్తారని మండిపడ్డారు. వాలంటీర్ల వ్యవస్థను చూస్తుంటే చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయన్నారు సీఎం జగన్‌.

 

ఇన్నాళ్లూ వాలంటీర్ల వ్యవస్థపై విషం చిమ్మిన చంద్రబాబు, పవన్ కల్యాణ్‌.. ఇప్పుడు 10 వేలు జీతం ఇస్తామంటున్నారని.. ఇంతకంటే జగన్‌ పాలనకు ఇచ్చే సర్టిఫికెట్‌ ఏం ఉంటుందని ప్రశ్నించారు. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల బహిరంగ సభలో మాట్లాడిన జగన్‌.. చంద్రబాబు కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.

 

ఈ ఎన్నికల్లో పొరపాటున చంద్రబాబుకు ఓటేస్తే పథకాలు ఆగిపోతాయన్నారు జగన్. ఎన్నికలకు ముందు గంగలా ఉన్న చంద్రబాబు.. అధికారం వచ్చాక చంద్రముఖిలా మారుతారని సెటైర్లు వేశారు. జిత్తులమారి చంద్రబాబు కుట్రలను తిప్పికొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు జగన్‌. రానున్న ఎన్నికలు పేదల తలరాతను మార్చే ఎన్నికలని చెప్పారు. తమ పాలన ద్వారా లీడర్‌ అంటే ఇలా ఉండాలని రాష్ట్రానికే కాదు దేశానికి చాటి చెప్పామన్నారు జగన్‌.

 

ప్రభుత్వ పథకాలలో అనేక వర్గాలను పేదరిక సంకేళ్ల నుండి పేదలను విడిపించామన్నారు. రంగుల మార్చడంలో చంద్రబాబును మించినవాళ్లు లేరన్నారు జగన్‌. చంద్రబాబు అధికారంలోకి వస్తే వాలంటీర్లను తీసేసి..ఆ స్థానంలో జన్మభూమి కమిటీలను తీసుకువస్తారని ఆరోపించారు.