
కాలువల్లో , నీరు ఎండిపోయిన మడుగుల్లో మట్ట గుడిసెలు, కోరమీనులు దొరుకుతాయి. వీటి కోసం బురదలో దిగి ఒక వృద్ధుడు ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. ఏలూరు నగరానికి చెందిన బాజీరావు అనే వృద్ధుడు స్థానిక ఓవర్ బ్రిడ్జి వద్ద నివాసం ఉంటున్నాడు. కాలువల్లో దిగి చిన్న చిన్న చేపలు, నత్తలు, పట్టుకుని వాటిని అమ్మి పొట్ట నింపుకుంటుంటాడు. రోజూ లాగే చేపల వేటకు బయలు దేరాడు. అయితే ఈసారి అతనికి ఊహించని షాక్ తగిలింది.
జూట్ మిల్లు సమీపంలో కృష్ణా కాలువలో కొత్తగా నిర్మిస్తున్న వంతెన వద్ద చేపలను గమనించాడు. వాటిని పట్టుకునేందుకు కాలువలోకి దిగాడు. కాలువలో నీరు తక్కువగా ఉంది. కానీ అది ఊబి కావడంతో కూరుకుపోయారు. అంతకంతకూ కిందికి ఊబిలో కూరుకు పోతుండటంతో భయాందోళనకు గురయ్యారు. బయటకు రాలేక అరవటం మొదలుపెట్టాడు. అటుగా వెళుతున్న కొందరు యువకులు వృద్ధుడి కేకలు విని అక్కడికి వెళ్ళారు. తాళ్ళ సహాయంతో కాలువలో దిగి వృద్ధుడిని బయటకు లాగారు. బాజీరావు క్షేమంగా బయటపడటంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
కాలువల్లో ప్రమాదక ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని, ప్రమాదాలను గమనించాలని స్థానికులు అంటున్నారు. ఊబి లాంటి ప్రమాదకరమైన ప్రాంతాలకు ఎవరు వెళ్ళకుండా అధికారులు చర్యలు చేపట్టి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. ఊబి ఎలా ఉంటుంది, అందులో నుంచి ఎలా బయటపడాలో తెలియకపోతే మనుషులైనా, జంతువులైనా ప్రాణాలు కోల్పోవాల్సిందే..!
వీడియో చూడండి..
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..