Mysterious Disease: ఆ ఊరిని గడగడలాడిస్తున్న వింత వ్యాధి.. విద్యార్థులకు మాత్రమే అలా జరుగుతుండటంతో..!

|

Dec 07, 2021 | 9:00 AM

Mysterious Disease: అంతుచిక్కని వ్యాధి అక్కడి విద్యార్థుల ప్రాణాలను బలితీస్తోంది. గ్రామంలో ఏం జరుగుతుందో తెలియని జనం భయంతో రోజులు గడుపుతున్నారు. ఇంతకీ ఆ ఊరికి పట్టిన పీడ

Mysterious Disease: ఆ ఊరిని గడగడలాడిస్తున్న వింత వ్యాధి.. విద్యార్థులకు మాత్రమే అలా జరుగుతుండటంతో..!
Mysterious Disease
Follow us on

Mysterious Disease: అంతుచిక్కని వ్యాధి అక్కడి విద్యార్థుల ప్రాణాలను బలితీస్తోంది. గ్రామంలో ఏం జరుగుతుందో తెలియని జనం భయంతో రోజులు గడుపుతున్నారు. ఇంతకీ ఆ ఊరికి పట్టిన పీడ ఏంటి? ఆ మరణాలకు కారణాలేంటి? వివరాల్లోకెళితే.. పశ్చిమగోదావరి జిల్లా కొయ్యలగూడెం మండలం బొడిగూడెం గ్రామాన్ని వింత వ్యాధి పట్టి పీడిస్తోంది. అసలు అక్కడ ఏం జరుగుతోందో ఎవరికీ అర్ధంకాక తలలు పట్టుకుంటున్నారు. విద్యార్థుల వరుస మరణాలు గ్రామ ప్రజలను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. తల్లిదండ్రులకు కడుపుకోత మిగిలిస్తూ ఆ వ్యాధి యవ్వనంలోనే బతుకును చిదిమేస్తోంది. మొదట జ్వరం, తరువాత తలనొప్పి, వాంతులు ఆరోగ్యాన్ని క్షీణింపజేస్తున్నాయి. ఆస్పత్రికి వెళ్లినా లాభం లేకుండా పోతోంది. వైద్యపరీక్షలు చేస్తే రక్తనాళాలు క్షీణించినట్లు రిపోర్టులు వస్తున్నా.. అది ఏ వ్యాధికి సంబంధించిందో తెలియక విద్యార్థులు మరణిస్తున్నారు. ఇప్పటికే ముగ్గురు విద్యార్థులు చనిపోయారు. ఇప్పుడు మరో విద్యార్థి బలైపోవడంతో.. గ్రామంలో ఏంజరుగుతోందో తెలియడంలేదు.

విషయం తెలుసుకున్న జిల్లా జాయింట్ కలెక్టర్ హిమాన్షు శుక్లా.. బొడిగూడెంలో పర్యటించారు. విద్యార్థుల మరణాలపై ఆరాతీశారు. ఓ విద్యార్థి క్యాన్సర్‌ లక్షణాలతో.. మరోవిద్యార్థి రక్తకణాలు పడిపోయి.. ఇంకొకరు కిడ్నీ చెడిపోయి ఇలా రకరకాల కారణాలతో విద్యార్థులు అసువులు బాస్తున్నారు. విద్యార్థులు మాత్రమే ఇలా అస్వస్థతకు గురికావడంపై ఒక్కొక్కరు ఒక్కో వాదన వినిపిస్తున్నారు. గ్రామంలో శానిటైజేషన్‌ లోపించి ఊరంతా అధ్వాన్నంగా తయారైంది. అందుకే అంటురోగాలు ప్రబలాయంటున్నారు. ఇంకొందరు మధ్యాహ్నం భోజనం కలుషితం కావడం వల్లే ఇలా జరుగుతోందంటున్నారు. చనిపోయినవారంతా 15 ఏళ్లలోపువారే కావడం మరో ఆశ్చర్యకరమైన విషయం. ఇకపోతే.. రాజమండ్రి, జంగారెడ్డి గూడెంలో 15 మంది వరకు చికిత్స పొందుతున్నారు. ప్రభుత్వం చొరవతీసుకుని ఇక్కడి వింత వ్యాధులకు కారణాలు కనుక్కుని నివారించాలని వేడుకుంటున్నారు స్థానికులు.

Also read:

Ashes Series: యాషెస్ తొలి టెస్ట్‌కు ముందు ఇంగ్లండ్‌కు భారీ షాక్.. గాయంతో స్టార్ బౌలర్ దూరం..!

Bigg Boss 5 Telugu: వైరల్ అవుతున్న ప్రియాంక పారితోషికం..(Video)

SaraTendulkar: మోడలింగ్‌లోకి అడుగు పెట్టిన సచిన్‌ ముద్దుల తనయ.. ఫొటోలు వైరల్‌..