Road Accident: ఘాట్ అందాలు చూస్తుండగా పోయిన ప్రాణం.. శ్రీశైలం రోడ్‌లో యువతి మృతి

Srisailam Ghat Road: ఏపీలోని కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. శ్రీశైలం నల్లమల ఘాట్ రోడ్డులో జరిగిన ప్రమాదంలో ఓ యువతి దుర్మరణం చెందింది. బస్సు

Road Accident: ఘాట్ అందాలు చూస్తుండగా పోయిన ప్రాణం.. శ్రీశైలం రోడ్‌లో యువతి మృతి
Road Accident

Updated on: Dec 02, 2021 | 7:15 PM

Srisailam Ghat Road: ఏపీలోని కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. శ్రీశైలం నల్లమల ఘాట్ రోడ్డులో జరిగిన ప్రమాదంలో ఓ యువతి దుర్మరణం చెందింది. బస్సు ప్రయాణంలో అజాగ్రత్తగా ఉండటంతో ఆ యువతి ప్రాణం పోయింది. శ్రీశైలం ఘాట్ రోడ్డులో ఆర్టీసీ సూపర్‌ లగ్జరీ బస్సులో ప్రయాణిస్తున్న యువతి తల బయటకు పెట్టింది. సరిగ్గా ఈ సమయంలోనే ఓ మలుపు వద్ద ఎదురుగా వస్తున్న లారీ యువతి తలకు బలంగా ఢీకొట్టింది. దీంతో యువతి తలకు తీవ్ర గాయాలు కావడంతో ఆమె అక్కడికక్కడే చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. మృతిచెందిన యువతి నరసరావుపేట నుంచి శ్రీశైలానికి వస్తున్నట్లు పేర్కొంటున్నారు. అయితే.. మరణించిన యువతికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు.

Also Read:

Viral Video: రన్‌వేపై విమానాన్ని నెడుతున్న జనం.. వీడియో చూసి పొట్ట చక్కలయ్యేలా నవ్వుకుంటున్న నెటిజన్లు..

Viral Video: ఏనుగుల ప్రాంతానికి వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకున్న టూరిస్ట్‌లు.. ఒళ్లుగగుర్పొడిచే వీడియో..