Andhra Pradesh: బండరాళ్ల మధ్యలో అపస్మారక స్థితిలో అమ్మాయి.. ఆరా తీయగా వెలుగులోకి షాకింగ్ నిజాలు..

Visakhapatnam, October 10: జీవితాంతం తోడుంటానని మాట ఇచ్చాడు.. ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు.. వాడి మాటలు విని వచ్చేసిన యువతిని ఊరు కాని ఊరు తీసుకెళ్లాడు. అక్కడ ఆలయంలో తాళి కట్టాడు. ప్రమాదం జరిగితే ఆసుపత్రికి తీసుకెళ్లాల్సిన ఆ ప్రియుడు.. వదిలి పారిపోయాడు. దీంతో ఆ యువతి కొండ గుట్టల మధ్య.. గంటల పాటు నరకయాతన అనుభవించింది. ఎట్టకేలకు స్థానికుల సహకారంతో..

Andhra Pradesh: బండరాళ్ల మధ్యలో అపస్మారక స్థితిలో అమ్మాయి.. ఆరా తీయగా వెలుగులోకి షాకింగ్ నిజాలు..
Visakhapatnam

Edited By: Shiva Prajapati

Updated on: Oct 10, 2023 | 2:40 PM

Visakhapatnam, October 10: జీవితాంతం తోడుంటానని మాట ఇచ్చాడు.. ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు.. వాడి మాటలు విని వచ్చేసిన యువతిని ఊరు కాని ఊరు తీసుకెళ్లాడు. అక్కడ ఆలయంలో తాళి కట్టాడు. ప్రమాదం జరిగితే ఆసుపత్రికి తీసుకెళ్లాల్సిన ఆ ప్రియుడు.. వదిలి పారిపోయాడు. దీంతో ఆ యువతి కొండ గుట్టల మధ్య.. గంటల పాటు నరకయాతన అనుభవించింది. ఎట్టకేలకు స్థానికుల సహకారంతో ఆసుపత్రిలో చేరింది. విశాఖ అప్పికొండ బీచ్ సమీపంలో జరిగిన ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది.

విశాఖ అప్పికొండ బీచ్ వద్ద కలకలం రేగింది. రాళ్ల గుట్టల మధ్య గాయాలతో నిరసించిన స్థితిలో యువతి కనిపించింది. ఆమెను గుర్తించిన స్థానికులు.. సంరక్షించారు. రోడ్డు వరకు మోసుకొచ్చి ఆసుపత్రికి తరలించ్చారు. బాదితురాలు మచిలీపట్నానికి చెందిన యువతిగా గుర్తించారు. ఈనెల 2వ తేదీన ఓ యువకుడితో విశాఖ వచ్చినట్లు గుర్తించారు పోలీసులు. కొండపై ఆలయానికి వెళ్లి.. గుట్టలపై ఫోటో తీస్తుండగా జారి పడినట్టు చెబుతోంది బాదితురాలు. ఆదివారం సాయంత్రం నుంచి అక్కడే చెమ్మ చీకటి నిస్సహాయ స్థితిలో ఉండిపోయి నిరసించిపోయింది.

గాయాలతో గుట్టల మధ్య దాదాపు ఒక రోజు పాటు ఉండిపోయింది. ఆమెను గుర్తించిన స్థానికులు స్థానికంగా ఉండే జాలర్లకు సమాచారం ఇచ్చారు. దీంతో ఘటనా స్థలం నుంచి డోలి కట్టి ఆమెను తరలించారు. రోడ్డు వరకు తీసుకువచ్చి అక్కడ నుంచి 108 లో కేజీహెచ్ కు తరలించారు. దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు. బాధితురాలి పేరెంట్స్ కు సమాచారం అందించారు. అయితే తానే పడిపోయానని అంటుంది బాధితురాలు. వాహనం తీసుకొస్తానని చెప్పి ఫణీంద్ర తిరిగి రాలేదని అంటుంది.

ఇవి కూడా చదవండి

కృష్ణా జిల్లా మచిలీపట్నం ప్రాంతంలోని ఇనుకుదురు పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉంటుంది యువతి. ఆమెకు భీమవరానికి చెందిన ఫణీంద్ర వర్మతో పరిచయం ఏర్పడింది. గత నెల 29 నుంచి కావ్య కనిపించకుండా పోవడంతో.. పోలీసులకు ఫిర్యాదు చేశారు కుటుంబ సభ్యులు. ఇనుకుదురుపేట పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదు అయింది. కట్ చేస్తే పణీంద్ర, కావ్యా ఇద్దరు ఈ నెల 2వ తేదీన విశాఖలో తేలారు. గోపాలపట్నంలోని ఓ లాడ్జిలో గదిని అద్దెకు తీసుకున్నారు. ఆ తర్వాత అప్పికొండ తీరానికి వెళ్లి అక్కడ కొండపైనున్న శివాలయానికి దర్శనం వెళ్లారు. అక్కడే కావ్య మండలం తాళి కట్టాడు ఫణీంద్ర. ఆ తర్వాత అరకు వెళ్లారు ఇద్దరు. తిరిగి 8వ తేదీన విశాఖ వచ్చినట్టు పోలీసుల విచారణలో తేలింది. ఆ తర్వాత మళ్లీ లాడ్జి గదికి వచ్చి.. పాపికొండ శివాలయానికి వెళ్లారు. ఆదివారం.. కొండలపై ఫోటో తీసుకుంటుండగా జారిపడినట్టు బాధితురాలు చెబుతోంది. ఇదే విషయాన్ని పోలీసులకు ఇచ్చిన స్టేట్మెంట్లో చెప్పింది బాధితురాలు. తాను కింద పడిన తర్వాత స్పృహ కోల్పోయానని. మెలకువ వచ్చిన తరువాత ఫణీంద్ర కనిపించాడని.. ఆసుపత్రికి తరలించేందుకు వాహనం తీసుకువస్తానని చెప్పి వెళ్లాడని అంటుంది. ఆదివారం నుంచి సోమవారం ఉదయం వరకు.. ఆ ప్రాంతంలోనే కొండల మధ్య చీకటిలో బిక్కుబిక్కుమంటు గడిపింది కావ్య. నిస్సహాయ స్థితిలో ఎటూ వెళ్లలేక ఉండి నిరసించి పోయింది. స్థానికుల సాయంతో బతికి బయటపడింది.

ఇప్పటికే మిస్సింగ్ కేసు దర్యాప్తు చేస్తున్న ఇనుకుదురుపేట పోలీసులు.. విశాఖ చేరుకున్నారు. బాధితురాలు స్టేట్‌మెంట్ రికార్డ్ చేశారు. అయితే.. ప్రియుడు ఫణీంద్ర ప్రస్తుతానికి పరారీలో ఉన్నాడు. అయితే, అక్కడున్న పరిస్థితులకు, బాధితురాలు ఇచ్చిన స్టేట్మెంట్ పై పోలీసులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఫణీంద్ర ఎందుకు పారిపోయాడు? అన్న దానిపై ఆరా తీస్తున్నారు పోలీసులు.

కేజీహెచ్ లో బాధితురాలు కాస్త కోలుకొవడంతో.. ఎనుకుదురుపేట పోలీసులు ఆమెను పేరెంట్స్ కు అప్పగించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. తాళి కట్టిన వారం గడవకముందే.. ఆపదలో ఉన్న ప్రియురాలిని విడిచిపెట్టి ప్రియుడు పారిపోవడం చర్చనీయాంశంగా మారింది. పెద్దలను ఎదిరించి అనుకున్న వాడిని నమ్మి వెళ్లిపోతే ఇటువంటి పరిస్థితులు ఎదుర్కోక తప్పదని అంటున్నారు జనాలు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..