Andhra Pradesh: తల్లిదండ్రుల వేధింపులు.. తట్టుకోలేక యువకుడు లాడ్జీకి వెళ్లి ఏం చేశాడంటే

తన చావుకు తల్లిదండ్రులే కారణమంటూ ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నారు. అమ్మానాన్నలు పట్టించుకోవడం లేదని, సూటిపోటి మాటలతో వేధిస్తున్నారంటూ బలవన్మరణానికి పాల్పడ్డాడు. స్నేహితులు ఆదరించినంతగా కూడా తల్లిదండ్రులు...

Andhra Pradesh: తల్లిదండ్రుల వేధింపులు.. తట్టుకోలేక యువకుడు లాడ్జీకి వెళ్లి ఏం చేశాడంటే
Follow us
Ganesh Mudavath

| Edited By: Ravi Kiran

Updated on: May 04, 2022 | 5:05 PM

తన చావుకు తల్లిదండ్రులే కారణమంటూ ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నారు. అమ్మానాన్నలు పట్టించుకోవడం లేదని, సూటిపోటి మాటలతో వేధిస్తున్నారంటూ బలవన్మరణానికి పాల్పడ్డాడు. స్నేహితులు ఆదరించినంతగా కూడా తల్లిదండ్రులు ఆదరించడం లేదంటూ వ్యాట్సాప్ స్టేటస్ పెట్టి తనువు చాలించాడు. ఈ హృదయ విదారక ఘటన చిత్తూరు జిల్లాలోని పుంగనూరులో జరిగింది. పట్టణంలోని బజారు వీధిలో తరుణ్ కుమార్.. తన తల్లిదండ్రులతో కలిసి నివాసముంటున్నాడు. తరుణ్ ఇంజినీరింగ్‌ పూర్తి చేశాడు. ఇటీవలే అతనికి ఓ యువతితో వివాహం నిశ్చయమైంది. కొన్ని కారణాల వల్ల ఆ వివాహం రద్దయింది. తన పెళ్లిని చెడగొట్టింది అమ్మానాన్నలే అని తెలుసుకుని తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. తల్లిదండ్రులు బంగారం షాప్ నిర్వహిస్తుండగా వారికి సహాయం చేసేందుకు షాప్ కు వెళ్లేవాడు. అక్కడా వారు తరుణ్ ను సూటిపోటి మాటలతో ఇబ్బంది పెట్టేవారు. ఫ్రెండ్స్ తనను పట్టించుకున్నంత స్థాయిలో కూడా తల్లిదండ్రులు పట్టించుకోవడం లేదని ఆవేదన చెందేవాడు. ఇదిలా ఉండగా.. సోమవారం రాత్రి తరుణ్ అమ్మానాన్నలు కర్రలతో కొట్టి ఇంటి నుంచి తరిమేశారు.

దీంతో గత్యంతరం లేక తరుణ్‌.. ఓ లాడ్జీకి వెళ్లాడు. గదిని అద్దెకు తీసుకున్నాడు. కొట్టినా, తిట్టినా తల్లిదండ్రులే కదా అని ఇంటికెళితే వారు తలుపు తెరవలేదు. అంతే కాకుండా ‘నువ్వు చచ్చినా పట్టించుకోమ’ని ముఖం మీద చెప్పడంతో లాడ్జికి వచ్చి ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు. తన తల్లిదండ్రులు తనను ఇబ్బంది పెట్టిన తీరు, తాను అనుభవించిన మానసిక క్షోభను వాట్సాప్ స్టేటస్ లో పెట్టాడు. విషయం తెలుసుకున్న తండ్రి నాగరాజు ఘటన స్థలానికి చేరుకున్నారు. తనకు వేరుగా దుకాణం పెట్టించమని అడిగాడని.. దుకాణం పెట్టడం ఆలస్యం కావడంతో ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Also Read

Viral Video: రారా చూసుకుందాం.. నీ ప్రతాపమో.. నా ప్రతాపమో.. ఈ ఇద్దరి సీరియస్ ఫైటింగ్ వీడియో వైరల్

Railway News: ఫలిస్తోన్న అధికారుల నిర్ణయాలు.. భారీగా పెరిగిన దక్షిణ మధ్య రైల్వే ఆదాయం.. ఎంతో తెలుసా.?