AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vijayawada: టైమ్ పాస్ ప్రేమ వల్ల పిచ్చివాడ్ని అయ్యా.. అందుకే ప్రాణాలు తీసుకుంటున్నా.. కన్నీరు పెట్టిస్తున్న సూసైడ్ లెటర్..

చిన్న వయసులో కలిగే ఆకర్షణలకు టీనేజర్లు బలై పోతున్నారు. ఆ వయసులో కలిగే ఫీలింగ్స్ ను కంట్రోల్ చేసుకోలేక ప్రేమలో పడిపోతున్నారు. ప్రేమా, ఆకర్షణా అనేది తెలుసుకోవడం లేదు. ఆకర్షణనే ప్రేమగా భావిస్తున్నారు...

Vijayawada: టైమ్ పాస్ ప్రేమ వల్ల పిచ్చివాడ్ని అయ్యా.. అందుకే ప్రాణాలు తీసుకుంటున్నా.. కన్నీరు పెట్టిస్తున్న సూసైడ్ లెటర్..
Ragging
Ganesh Mudavath
|

Updated on: Jan 08, 2023 | 12:57 PM

Share

చిన్న వయసులో కలిగే ఆకర్షణలకు టీనేజర్లు బలై పోతున్నారు. ఆ వయసులో కలిగే ఫీలింగ్స్ ను కంట్రోల్ చేసుకోలేక ప్రేమలో పడిపోతున్నారు. ప్రేమా, ఆకర్షణా అనేది తెలుసుకోవడం లేదు. ఆకర్షణనే ప్రేమగా భావిస్తున్నారు. కాదంటే తట్టుకోలేకపోతున్నారు. తాజాగా విజయవాడలో అలాంటి ఘటనే జరిగింది. ప్రేమలో మోసం చేసిందనే కారణంతో ఓ యవకుడు రైలు కింద పడి సూసైడ్ చేసుకున్నాడు. తనలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదని సూసైడ్ లెటర్ లో కోరాడు. విజయవాడలో బీటెక్ విద్యార్థి సూసైడ్ కలకలం రేపింది. ప్రేమించి మోసపోయానంటూ బీటెక్ విద్యార్ది అబ్దుల్ సలామ్ సూసైడ్ చేసుకున్నాడు. తనలా ఏ అబ్బాయి మోసపోకుండా చూడాలంటూ సూసైడ్ లెటర్ రాశాడు. అనంతరం రైలు కింద పడి ప్రాణాలు తీసుకున్నాడు.

తాను.. ఇంటర్ చదువుతున్న ఓ విద్యార్థినిని ప్రేమిస్తున్నానని, ఆమె కూడా తనను ప్రేమిస్తోందని లేఖలో పేర్కొన్నాడు. కొంత కాలంగా అమ్మాయి ప్రవర్తనలో తేడా వచ్చి ఆరా తీస్తే పెళ్లైన లెక్చరర్ తో న్యూడ్ వీడియో కాల్స్ చేస్తున్నట్లు తెలుసుకుని, పద్ధతి మార్చుకోవాలని సూచించినట్లు తెలిపాడు. అయినా ఆమె ప్రవర్తనలో మార్పు రాలేదని, అంతే కాకుండా మరో యువకుడితో వీడియో కాల్స్ మాట్లాడుతుందని లేఖలో వివరించాడు. ఆమె మారుతుందని ఎన్ని ప్రయత్నాలు చేసినా.. లాభం లేకుండా పోయిందని వాపోయాడు. ఆమెలో మార్పు తీసుకువచ్చేందుకు ఎంతగా ప్రయత్నించినా మారలేదు. ఈ కారణంగా సరిగా చదవలేకపోయాను. టైమ్ పాస్ ప్రేమ వల్ల పిచ్చివాడ్ని అయ్యాను. బతకలేకపోతున్నానని లెటర్ లో సలామ్ వివరించాడు.

ఈ ఘటనను తీవ్రంగా తీసుకోవాలని సూసైడ్ లెటర్ లో కోరాడు. తల్లిదండ్రులకు సమాధానం చెప్పలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్టు రాశాడు. ఆమె చేతిలో మోసపోయిన అమాయకపు అబ్బాయిలకు న్యాయం చేయాలంటూ చివరి మాటల్లో తన ఆవేదనను వివరించాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం..