పనులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న వ్యక్తిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. రాళ్లు, కత్తులతో దాడి చేసి అత్యంత దారుణంగా హత్య(Murder) చేశారు. దారి కాచి మరీ ఈ దురాగతానికి పాల్పడ్డారు. హత్య చేసి అక్కడి నుంచి పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. సంఘటనాస్థలాన్ని పరిశీలించి, దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు. కృష్ణా జిల్లా తిరుపూరు(Tiruvur) పట్టణంలోని సీతామహాలక్ష్మి కాలనీలో కృష్ణచైతన్య అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. అతను ఆర్టీసీ బస్టాండ్ క్యాంటీన్‌లో పనిచేస్తూ జీవనోపాధి పొందుతున్నాడు. బుధవారం రాత్రి పనులు ముగించుకుని బైక్ పై వస్తుండగా దారి మధ్యలో గుర్తు తెలియని వ్యక్తులు దాడి(Attack) చేశారు. కృష్ణచైతన్యను రాళ్లతో కొట్టి, కత్తులతో పొడిచి తీవ్రంగా గాయపరిచారు. ఈ ఘటనలో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. వాహనం వెనుక ఉన్న మరో వ్యక్తి భయంతో పరారయ్యాడు.
సమాచారం అందుకున్న నూజివీడు పోలీసులు.. ఘటనా స్థలాన్ని పరిశీలించారు. సీసీ కెమెరా ఫుటేజీని స్వాధీనం చేసుకున్నారు. పాతకక్షల నేపథ్యంలోనే హత్య జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఎనిమిది మంది అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
Also Read
Health Tips: ఆస్తమాతో ఇబ్బంది పడుతున్నారా.. అయితే, ఈ ఆహారాలను దూరం పెట్టండి..!
Viral Video: చిరుత వేట ఎలా ఉంటుందో చూసారా.. షాకింగ్ వీడియో మీకోసం