AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh Politics: మేం కూడా ఆ మాట అంటే ఏం చేస్తారు?.. సీపీఐ నారాయణపై సంచలన వ్యాఖ్యలు చేసిన వైసీపీ ఎమ్మెల్యే..

సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణపై శ్రీకాళహస్తి వైసీపీ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం ఇచ్చే ఇళ్ల స్థలాలు కుక్కకి ...

Andhra Pradesh Politics: మేం కూడా ఆ మాట అంటే ఏం చేస్తారు?.. సీపీఐ నారాయణపై సంచలన వ్యాఖ్యలు చేసిన వైసీపీ ఎమ్మెల్యే..
Shiva Prajapati
|

Updated on: Dec 28, 2020 | 5:59 AM

Share

Andhra Pradesh Politics: సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణపై శ్రీకాళహస్తి వైసీపీ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం ఇచ్చే ఇళ్ల స్థలాలు కుక్కకి కూడా సరిపోవంటూ నారాయణ చేసిన కామెంట్స్‌పై తీవ్ర స్థాయిలో స్పందించారు. పేద ప్రజలు ఉండే ఇళ్లను కుక్కలతో పోలుస్తారా? అంటూ నిప్పులు చెరిగారు. ‘సీపీఐ నారాయణ కూడా చంద్రబాబు కుక్క అంటే ఏం చేస్తారు? ఎర్రజెండాలు పట్టుకుని సీపీఐ వాళ్లంతా పోరాటాలు చేసింది బెత్తెడు స్థలాల కోసమే కదా?’ అని మధుసూదన్ రెడ్డి ప్రశ్నించారు. ‘నారాయణకు నేను ఛాలెంజ్ చేస్తున్నా.. నువ్వు కూడా చిత్తూరు జిల్లా వాడివేగా.. దమ్ముంటే శ్రీకాళహస్తి నియోజకవర్గానికి రాండి.. ఇక్కడ సెంటు కంటే తక్కువ స్థలంలో బతుకుతున్న వేలమందిని చూపిస్తా’ అని అన్నారు. శ్రీకృష్ణ దేవరాయలు కాలం నుంచి కనీసం ఉండటానికి ఇళ్లు లేకుండా జనాలు బతుకుతున్నారని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి వ్యాఖ్యానించారు.

ఇదే సమయంలో సీఎం జగన్ ఇచ్చే ఇళ్ల స్థలాలు బాత్ రూమ్ అంత కూడా లేవన్న లోకేష్ కామెంట్స్‌ పైనా మధుసూదన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బక్క చిక్కిన ప్రజలకు చిన్న ఇల్లు సరిపోతాయని వ్యాఖ్యానించారు. లోకేష్ లాంటి భారీ పర్సనాలిటీ ఉన్న వారికి మాత్రం ఎకరాల పరిధిలో ఇళ్లు కావాలంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. టీడీపీ నేతలు చంద్రబాబు, లోకేష్ ని ప్రజలు రాళ్లతో కొట్టే తరిమే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు. 321 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చి సీఎం జగన్ ప్రపంచ రికార్డ్ సృష్టిస్తుంటే.. విపక్ష నేతలు అడ్డగోలు విమర్శలు చేయడం దారుణం అన్నారు. జగన్ ఇల్లు కాదు గుళ్ళు కట్టించి ఇస్తున్నారని ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు.

Also read:

ఐసీసీ ఈ దశాబ్దపు మహిళా జట్లలో నలుగురు భారతీయులు.. మిథాలీరాజ్, ఝులన్ గోస్వామిలతోపాటు యువ ఆటగాళ్ల పేర్లు

CM KCR ADOPTED DAUGHTER: పెళ్లి కూతురుగా ముస్తాబయిన సీఎం కేసీఆర్ దత్తపుత్రిక.. పట్టు బట్టలు, గోల్డ్ నెక్లెస్ పెట్టి ఆశీర్వదించిన సీఎం సతీమణి..