Andhra Pradesh: ఏపీలో పెగసెస్ రచ్చ.. చంద్రబాబుపై సంచలన కామెంట్స్ చేసిన ఎమ్మెల్యే..

Andhra Pradesh: పెగసెస్ వ్యవహారం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ఊపేస్తుంది. ఇదే అంశంలో తాజాగా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత...

Andhra Pradesh: ఏపీలో పెగసెస్ రచ్చ.. చంద్రబాబుపై సంచలన కామెంట్స్ చేసిన ఎమ్మెల్యే..
Ambati Rambabu

Updated on: Mar 18, 2022 | 9:39 PM

Andhra Pradesh: పెగసెస్ వ్యవహారం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ఊపేస్తుంది. ఇదే అంశంలో తాజాగా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబుపై సంచలన కామెంట్స్‌ చేశారు వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు. బాబు అధికారంలో ఉండగా.. పెగసెస్‌ సాఫ్ట్‌వేర్‌ను వాడారని పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతాబెనర్జీ చెప్పారన్నారు. పెగాసెస్‌తో సంబంధం లేదని టీడీపీ అనడం విడ్డూరంగా ఉందన్నారు. పెగాసెస్‌పై పూర్తి విచారణ జరిగితే టీడీపీ బండారం బయట పడుతుందన్నారు అంబటి.

బాబు.. పెగసెస్ సాఫ్ట్‌వేర్‌ వాడారని తాము అనలేదని.. సాక్షాత్తూ ఓ సీఎం అన్నారని తెలిపారు. మమత వ్యాఖ్యలపై సమాధానం చెప్పాలని చంద్రబాబును డిమాండ్‌ చేశారు అంబటి రాంబాబు. తప్పు చేయకపోతే.. ఎందుకు భుజాలు తడుముకుంటున్నారో టీడీపీ నేతలు చెప్పాలన్నారు ఫైర్ అయ్యారు అంబటి.

Also read:

Krithi Shetty: కలర్ ఫుల్ డ్రెస్సులో కవ్విస్తున్న కృతి లేటెస్ట్ ఫోటోస్ వైరల్