సీఎం జగన్ కాన్వాయ్ అడ్డుకున్న ఎన్నారై.. పోలీసుల తీరుపై వైసీపీ నేతల ఆగ్రహం..

|

May 19, 2024 | 7:41 AM

గన్నవరం ఎయిర్ పోర్టులో ఎన్నారై వ్యవహరించిన తీరుపై వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నారై లోకేష్‎పై కేసు నమోదు చేసిన కొద్ది సేపటికే పోలీసులు విడుదల చేశారు. ఈ వ్యవహారంపై తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు వైసీపీ నాయకులు. సీఎం జగన్ విదేశీ పర్యటనలో భాగంగా మే 17న గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. ఈ క్రమంలో ఆయన కాన్వాయ్‎ను అడ్డుకునేందుకు యత్నించాడు ఒక ఎన్నారై.

సీఎం జగన్ కాన్వాయ్ అడ్డుకున్న ఎన్నారై.. పోలీసుల తీరుపై వైసీపీ నేతల ఆగ్రహం..
Cm Jagan
Follow us on

గన్నవరం ఎయిర్ పోర్టులో ఎన్నారై వ్యవహరించిన తీరుపై వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నారై లోకేష్‎పై కేసు నమోదు చేసిన కొద్ది సేపటికే పోలీసులు విడుదల చేశారు. ఈ వ్యవహారంపై తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు వైసీపీ నాయకులు. సీఎం జగన్ విదేశీ పర్యటనలో భాగంగా మే 17న గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. ఈ క్రమంలో ఆయన కాన్వాయ్‎ను అడ్డుకునేందుకు యత్నించాడు ఒక ఎన్నారై. అతనిపై పోలీసులు వ్యవహరించిన తీరును తీవ్రంగా ఖండిస్తున్నారు వైఎస్ఆర్సీపీ ముఖ్యనేతలు. ఎన్నారై డాక్టర్ లోకేష్ అరెస్ట్ వ్యవహారంలో వైసీపీ నేతలు సీరియస్‎గా ఉన్నారు. ఎన్నారైను అరెస్ట్ చేసినట్లు చేసి గంటల వ్యవధిలోనే విడిచిపెట్టడాన్ని తీవ్రంగా ఖండించారు.

సీఎం జగన్ కాన్వాయ్‎ను అడ్డుకునేందుకు యత్నించిన ఎన్నారై లోకేష్ వెనుక ఎవరున్నారో తేల్చాలని పట్టుబడుతున్నారు. ఉన్మాద మనస్తత్వం ఉన్న లోకేష్‎ను అరెస్టు చేయకుండా సన్మానం చెయ్యాలా అంటూ ప్రశ్నించారు విజయవాడ సెంట్రల్ సిట్టింగ్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు. సీఎం జగన్‎ను అడ్డుకోవాలని చూసిన ఎన్నారై లోకేష్ ప్లాన్ ఏంటో పోలీసులు విచారించాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు డాక్టర్ లోకేష్‎ను అరెస్టు చేయడంపై టీడీపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఎన్నారై డాక్టర్‎ను అక్రమంగా అరెస్టు చేశారనీ తెలుగుదేశం పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. దీనికి కౌంటర్‎గా టీడీపీ నేతల వ్యాఖ్యల్ని తీవ్రంగా తప్పు బట్టింది వైఎస్ఆర్సీపీ.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…