YCP on Chandrababu: సింగిల్‌గా వచ్చే దమ్ము ఏ రాజకీయ పార్టీకి లేదు.. టీడీపీ, జనసేనలపై వైసీపీ ఫైర్

ఆంధ్రప్రదేశ్‌లో ఎవరు ఎవరితో పొత్తు పెట్టుకున్నా.. వైసీపీకి ఓట్లు, సీట్లు తగ్గబోవని వైఎస్సార్‌సీపీ నేతలు స్పష్టం చేశారు.

YCP on Chandrababu: సింగిల్‌గా వచ్చే దమ్ము ఏ రాజకీయ పార్టీకి లేదు.. టీడీపీ, జనసేనలపై వైసీపీ ఫైర్
Ambati Vijaysai Reddy
Follow us
Balaraju Goud

|

Updated on: May 07, 2022 | 12:38 PM

YCP Leaders on Chandrababu: ఆంధ్రప్రదేశ్‌లో ఎవరు ఎవరితో పొత్తు పెట్టుకున్నా.. వైసీపీకి ఓట్లు, సీట్లు తగ్గబోవని పార్లమెంటు సభ్యులు విజయసాయిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబుకు నమ్మకం లేదు కాబట్టే, భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. అందుకు మరొకరి మద్దతు కోసం ప్రయత్నిస్తున్నారని వ్యాఖ్యానించారు. 2019 ఎన్నికల్లో ప్రజలు చంద్రబాబుకు గుణపాఠం చెప్పారని.. వచ్చే 25 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డినే ఉంటారని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. చంద్రబాబును ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. వైసీపీకి పొత్తుల అవసరం లేదని.. జగన్ సోలో ఫైట్‌నే నమ్ముకున్నారని అన్నారు.

రాసిపెట్టుకోండి, 2024 ఎన్నికల్లో టీడీపీ గెలవదన్నారు జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు. ప్రతిపక్షాలు కలిసి వచ్చినా, ఒంటరిగా వచ్చినా గెలిచేది తామేనన్నారు. చంద్రబాబుకు అద్భుత ప్రజాదరణ అంటూ ఎల్లో మీడియా బాకాలు పలుకుతోందని మండిపడ్డారు. ఎన్నికల్లో జనం చంద్రబాబును చిత్తు చిత్తుగా ఓడించారని, ఆయనను ప్రజలు క్విట్‌ ఏపీ అంటున్నారని అన్నారు. అంత ఆదరణ ఉంటే చంద్రబాబు ఒంటరిగా ఎందుకు పోటీ చేయరని, అందరూ కలిసి రండి అని ఎందుకు ఆహ్వానిస్తున్నారని అంబటి ప్రశ్నించారు.

అలాగే ‘పన్నులు లేకుండా ప్రభుత్వాలు నడుస్తాయా.. గతంలో చంద్రబాబు పన్నులు లేకుండానే ప్రభుత్వాన్ని నడిపారా’ అంటూ అంబటి రాంబాబు ప్రశ్నించారు. చంద్రబాబు పరిపాలనలో ఉన్నపుడు పన్నులు వేయలేదా..? నవరత్నాలు, సంక్షేమ కార్యక్రమాలు అమలు కాకూడదని కుట్రలో భాగంగానే ఈ రాద్దంగామంతా చేస్తున్నారని మండిపడ్డారు. ఈ ప్రభుత్వాన్ని ఎదుర్కోలేక పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారన్నారు. మనకన్నా ఎక్కువ ధరలు ఉంటే రాజకీయ సన్యాసం చేస్తానని అంబటి రాంబాబు సవల్ విసిరారు.పతనమవుతున్న తన రాజకీయాన్ని ఇంకా ఉందని చెప్పుకోడానికి చంద్రబాబు తాపత్రయ పడుతున్నారని, చంద్రబాబు, పవన్ పర్యటనలో జై జగన్ అంటున్నారని గుర్తు చేశారు.

ఇవి కూడా చదవండి

రాష్ట్రంలో ఇంత వ్యతిరేకత ఉండనుకుంటే నువ్వొక్కడివే పోటీ చేయొచ్చుగా అన్న అంబటి.. ప్రజా ఉద్యమాలు ఎందుకు వస్తాయన్నారు. దిశ, దశ లేని ఆ పార్టీ చంద్రబాబుకి మాత్రమే అమ్ముడు పోతున్నారన్నారు. మీతో కలుస్తాం.. ప్యాకేజీ తీసుకుంటాం అంటున్నారు. సింగిల్ గా వచ్చే దమ్ము ఈ రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీకి లేదన్నారు. అందుకే అందరూ కలిసి పోటీ చేయాలని చూస్తున్నారు. ఏ పార్టీ వెంటిలేటర్ మీద ఉందో.. ఎన్నికల తర్వాత తెలుస్తుందన్నారు. కుప్పంలో ఒక్క సీటు కూడా తెచుకోలేని చంద్రబాబు రికార్డ్ ని ఎవ్వరూ బద్దలు కొట్టలేరన్నారు.